News
పాఠాలు చెప్పే లెక్చరర్ లే క్లాస్రూమ్ లో కొట్టుకున్నారు … ఎందుకో తెలుసా.? దెబ్బకి స్టూడెంట్స్ షాక్.!
తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల ఇద్దరు లెక్చరర్ల మధ్య జరిగిన సంఘర్షణ చర్చలకు దారి తీసింది. సమయం కథనం ప్రకారం అనపర్తి శివారు కొత్తూరులో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియం గురుకుల జూనియర్ కాలేజ్ లో వెంకటేశ్వరరావు గత ఎనిమిది సంవత్సరాలుగా పార్ట్ టైం లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నారు.

కొంతకాలం క్రితం వెంకటేశ్వరరావుతో పాటు ఇంకొంతమంది పార్ట్ టైం లెక్చరర్లు టెట్ పరీక్షకు హాజరు అవ్వలేదని ఇంఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన తర్వాత ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావుతో పాటు మరికొంతమంది లెక్చరర్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

తర్వాత వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కాలేజ్ లో జరుగుతున్న విషయాలను వెంకటేశ్వరరావు ఉన్నతాధికారులకు చెప్పడంతో వారు శ్రీనివాసరావు ని వివరణ కోరారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25 వ తేదీన వారిద్దరూ క్లాస్ రూమ్ లో గొడవ పడ్డారు.

ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలు అవ్వడంతో తోటి అధ్యాపకులు, విద్యార్థులు వారిద్దరిని విడదీసి అనపర్తి లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థుల నుండి, అధ్యాపకుల నుండి అడిగి తెలుసుకున్నారు.
ఆ గ్రామంలో యువతకు పెళ్లి కావట్లేదు అంట.! కారణం ఏంటో తెలుసా.? తప్పు ఎవరిది.?
ఒక మనిషికి కావాల్సిన సదుపాయాల్లో ఎంతో ముఖ్యమైనవి కనీస సదుపాయాలు. వాళ్ళు ఉండే చోట తిండి, ఆశ్రయం, ఇవి కాకుండా ఇంకా మిగిలిన కనీస అవసరాలు అనేవి కచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే మనుషులు నివసించడం కష్టం. కానీ ఒక ప్రదేశంలో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఈనాడు కథనం ప్రకారం పశ్చిమ బెంగాల్ బీహార్ సరిహద్దుల్లో ఉన్న తారాబడి అనే గ్రామంలో దాదాపు ఎనిమిది వందల మంది ముస్లిం జనాభా ఉంటారు. ఆ ఊరు చుట్టూ నదులు ఉంటాయి. అయితే బీహార్ ప్రాంతాల్లో కనీస సదుపాయాలను ఏర్పాటు చేస్తామని సీఎం నితీష్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.


కానీ ఈ గ్రామంలో కనీస సదుపాయాలు లేవు. దాంతో ఈ గ్రామంలో ఉండే యువతని పెళ్లి చేసుకోవడానికి పక్కల ఉండే గ్రామాల వాళ్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. అంతే కాకుండా ఏమైనా అవసరం ఉంటే చుట్టుపక్కల ఉండే గ్రామాలకి వెళ్లడానికి కూడా సదుపాయాలు లేవు అని ఈ గ్రామంలోని నివాసులు చెప్తున్నారు.

ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని, తమ గ్రామానికి ఒక వంతెన కూడా లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించాలి అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
కస్టమర్ పై పిచ్చి పిచ్చి గా అరిచేసిన డెలివరీ బాయ్..కానీ అందరు మంచి పని చేసావ్ అంటున్నారు..కారణమేమిటంటే..?
మనకి ఊరికే ఏదైనా తినాలనిపిస్తే ఏమి చేస్తాం.. బయటకెళ్లడానికి కూడా బద్దకిస్తే ఏదైనా ఆర్డర్ చేసేసుకుంటాం. నిమిషాల్లో మన ముందుకొచ్చి డెలివరీ బాయ్ లు ఫుడ్ అందిస్తూ ఉంటారు. వారి జీవితంలో ఏమి కష్టాలుంటాయో.. అవి అన్ని అధిగమిస్తూ అవసరం కోసం వారు కష్టపడుతూ ఉంటారు. వారి కష్టాన్ని గుర్తిస్తూ కంపెనీ చిన్న రైజ్ ఇచ్చినా.. లేదా ఎవరైనా కస్టమర్ టిప్ ఇచ్చినా ఆరోజు వారికి ఎంతో సంతృప్తి గా గడుస్తుంది.

డెలివరీ బాయ్స్ ని ఉత్తేజపరచడం కోసం చాలా మంది టిప్ లు ఇస్తూ ఉంటారు. అయితే, కొందరు మాత్రం కంపెనీ వాళ్ళకి జీతం ఇస్తుంది కదా.. మళ్ళి ఈ టిప్ లు ఎందుకు అని భావిస్తూ ఉంటారు. చాలా మంది డెలివరీ బాయ్స్ కరోనా గడ్డు కాలం లో కూడా ఎంతో కష్ట పడి పని చేసారు. కొందరైతే రోజుకు 12 నుంచి 15 గంటలు కూడా పని చేసిన వారు ఉన్నారు. వారికి జీతాలు తక్కువే ఉంటాయి. కాబట్టి, వారికి టిప్ ఇవ్వడం వలన ఉత్తేజపరిచినట్లు ఉంటుంది. ఈ క్రమం లో ఓ ఘటన చోటు చేసుకుంది.

డెలివరీ బాయ్స్ అంటే ఎండకి, వర్షానికి లెక్క చేయకుండా తిరగాల్సి ఉంటుంది. ఇటీవల డామినోస్ కి చెందిన ఓ డెలివరీ బాయ్ వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా ఓ కస్టమర్ కి పిజ్జా డెలివరీ చేసాడు. అతడిని టిప్ కోరగా, సదరు కస్టమర్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీనితో ఆ డెలివరీ బాయ్ కి కోపం వచ్చి ఆ కస్టమర్ పైనా, సదరు మానేజ్మెంట్ పైనా పిచ్చి కోపం గా అరిచేసాడు. ఇదంతా సీసీ టీవీ లో రికార్డు అయింది.ఈ వీడియో టిక్ టాక్ లో అప్ లోడ్ అయింది.

కెమెరా వెనక నుంచి ఓ వ్యక్తి.. కామ్ డౌన్ ప్లీజ్.. ఇంకా చాల డెలివరీలు ఉన్నాయి అని చెప్పడం వినిపిస్తోంది. అయితే, సదరు డెలివరీ బాయ్ మాత్రం ఆగ్రహం లోనే నో… నేను ఇంకా ఇక్కడ పని చేయను.. వర్షం లో అంత సేపు నుంచున్నా కనీసం టిప్ ఇవ్వలేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసాడు. అంతే కాదు పక్కన ఉన్న పిజ్జా బాక్స్ లను కూడా నేలకేసి కొట్టాడు. ఈ వీడియో నెట్టింట్లో పెట్టడం తో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు సదరు డెలివరీ బాయ్ పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
watch video:
బావిలోంచి అరుపులు వినిపిస్తున్నాయని వెళ్లారు…లోపల ఓ యువతి, యువకుడు.! అసలేమైంది.?
కొన్ని సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక ట్రెండ్ సెల్ఫీ. ఈ సెల్ఫీ ట్రెండ్ మెల్లగా స్టార్ట్ అయ్యి ప్రపంచం మొత్తం పాకింది. ఒక పాయింట్ తర్వాత మామూలుగా సెల్ఫీ తీసుకోవడం కామన్ అయిపోయి డిఫరెంట్ గా సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించడం మొదలు పెట్టారు. దాని కోసం డిఫరెంట్ పోజ్ లలో, డిఫరెంట్ లొకేషన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు.

అందులో కొన్ని రిస్కీగా ఉండడం వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇటీవల ఇలాంటి ఒక సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లా సుఖేడా గ్రామానికి చెందిన ఒక యువతి ఒక బావి దగ్గర సెల్ఫీ దిగుదామని అనుకుంది. ఆ బావి లోతు 85 అడుగులు. బావి దగ్గర సెల్ఫీ దిగే క్రమంలో బావిలో పడిపోయింది.

అదే దారిలో ఉన్న ఒక యువకుడు బావి నుండి వినిపిస్తున్న అరుపులు విని బావి దగ్గరికి వెళ్లి చూశాడు. ఆ బావిలో ఉన్న యువతిని కాపాడటానికి తాను కూడా బావిలోకి దూకాడు. ఆ యువతిని కాపాడాడు కానీ బావిలో నుంచి తిరిగి బయటికి వచ్చే దారి లేదు. దాంతో ఆ యువకుడు ఇంకా యువతి కాపాడమని గట్టిగా అరవడం మొదలు పెట్టారు.

అటుగా వెళుతున్న కొంత మంది స్థానికులు వారి అరుపులు విని వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారేమోనని భావించారు. దాంతో ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు అక్కడికి దగ్గరికి వచ్చి స్థానికుల సహాయంతో వారిద్దరినీ బయటికి తీశారు. అసలు ఏం జరిగింది అని పోలీసులు అడగగా ఆ యువకుడు జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు ఆ యువతిని మందలించి పంపించారు.
పాతికేళ్ళు గా ఆమె గొంతులో ఈల ఉన్న విషయం ఆమెకు తెలియదు.. చివరకు ఏమి జరిగిందంటే..?
ఒక్కోసారి మనం చేసే పొరపాట్లు మనకు జీవితకాలం పాటు శిక్షను విధిస్తుంటాయి. కొన్నిటిని సరిచేసుకోవచ్చు. కొన్నిటిని సరిచేసుకోలేకపోతాము. ముఖ్యం గా చిన్నపిల్లలలు ఆడుకునేటప్పుడు వారిని కనిపెట్టుకుని ఉండాలి. వారి శరీరానికి ఏమైనా జరిగితే.. ఆ బాధ వారు జీవితాంతం పడాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే ఒక అమ్మాయి విషయం లో జరిగింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకమ్మాయి.. పదిహేనేళ్ల వయసు లో పొరపాటున ఈలను మింగేసింది. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె దగ్గుతో ఇబ్బంది పడింది. దాదాపు పాతికేళ్ళు ఆమెను దగ్గు, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. కేరళలో కన్నూరు జిల్లాలోని మత్తన్నూరు కు చెందిన ఓ అమ్మాయి విషయం లో ఇలా జరిగింది. ఇప్పుడామెకు నలభై ఏళ్ళు. దాదాపు పాతికేళ్ళకు పైగా ఆమె ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది.

డాక్టర్లు రకరకాల పరీక్షలు చేసి.. చివరికి ఆమె గొంతు లో ఏదో ఉందన్న విషయాన్నీ గుర్తించారు. స్కాన్ చేయగా.. ఆమె గొంతులో విజిల్ ఇరుక్కుందన్న విషయం తెలిసింది. పాతికేళ్ళు గా ఆమెకు ఈ విషయం తెలియనే లేదట. శ్వాస నాళం నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే మార్గం లో ఈ విజిల్ చిక్కుకుంది. ఓ ప్రైవేట్ క్లినిక్ లో ఆమె చూపించుకుంది. వారు ఆమెను ప్రభుత్వాసుపత్రికి పంపించారు.

అక్కడి వైద్యులు డాక్టర్ పద్మనాభన్, డాక్టర్ రాజీవ్ రామ్ ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ విజిల్ ను తొలగించారు. మొదట్లో ఆమెకు కొంచం ఉబ్బసం ఉన్నట్లు అనిపించేది. క్రమం గా ఆమె కోలుకుంది. ఇప్పుడు ఆమెకు ఏ ఆరోగ్య సమస్యలు లేవు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తానూ మంచినీళ్లు తాగుతున్నా సరే.. గొంతులో ఎదో తగులుతున్నట్లు అనిపించేది అని, కానీ అదేంటో తెలిసేది కాదని ఆ మహిళ చెప్పుకొచ్చింది.
“ఫాస్టాగ్” తొందరగా రావాలంటే ఏం చేయాలి.? ఎంత వరకు రీఛార్జ్ చేయించుకోవచ్చు.?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫాస్టాగ్ విషయం లో కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ఫోర్ వీలర్ వాహనాలు ఫాస్టాగ్ ను ఫాలో అవ్వాల్సిందేనని ఆదేశాలు కూడా జారీ చేసేసింది. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా టోల్ చెల్లించదలుచుకుంటే చెల్లించాల్సిన మొత్తం కంటే రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని ఆదేశించింది. అసలు.. ఈ ఫాస్టాగ్ అంటే ఏమిటి..?

మనం ఒక చోటు నుంచి మరొక చోటు కు వెళ్లే క్రమం లో రహదారులపై ప్రతి 70 కిలోమీటర్లకు మధ్యన టోల్ గేట్ లు ఉంటాయి. అక్కడ మనం టోల్ ఫీజు ను చెల్లిస్తూ ఉంటాం. అయితే, ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం ఫాస్టాగ్ ను తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక స్టికర్ లాంటిది. దానిని మీరు మీ కారుపై అంటించుకోవాలి. మీ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలతో ఒక రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ను ఇస్తారు. ఇది బార్ కోడ్ రూపం లో ఆ స్టికర్ పై ఉంటుంది. ఒకసారి ఫాస్టాగ్ ను తీసుకుంటే.. ఇది ఐదేళ్ల కాలం పాటు చెల్లుతుంది.

టోల్ ప్లాజాలు / ఇష్యూయర్ ఏజెన్సీల వద్ద వాహన దారులు ఈ ఫాస్టాగ్ ను తీసుకోవచ్చు. టోల్ ప్లాజా వద్ద పాయింట్ ఆఫ్ ది సేల్ వద్ద ఈ ఫాస్టాగ్ ను పొందవచ్చు. అయితే, ఇందుకోసం మీరు కొన్ని డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వ్యక్తిగత కెవైసి పత్రాలు, ఏదైనా గుర్తింపు పత్రం, అలాగే ఆధార్ కార్డును తప్పని సరిగా జత చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు, వాహన దారుని పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా తప్పనిసరి. అలాగే, అమెజాన్.ఇన్ లో ఫాస్టాగ్ ను తొందరగా పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ , కోటక్, పేటిఎమ్ పేమెంట్స్ వంటి బ్యాంకులను సంప్రదించడం ద్వారా కూడా ఫాస్టాగ్ ను పొందవచ్చు.

అలాగే, మీరు ఆన్ లైన్ నే ఫాస్టాగ్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్., నెఫ్ట్ ద్వారా ఆన్ లైన్ లోనే చెల్లింపులు చేసుకోవచ్చు. దాదాపు లక్ష రూపాయల వరకు మీరు ఒకేసారి రీ ఛార్జ్ చేసుకోవచ్చట. గూగుల్ పే, ఫోన్ పే, పే టీమ్ వంటి యుపిఐ ఆప్ ల ద్వారా కూడా ఈ చెల్లింపులు చేసుకోవచ్చు.
భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మహిళ మొదటిసారిగా ఉరికంబం ఎక్కబోతున్నారు. వివరాల్లోకి వెళితే. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం షబ్నమ్ అనే ఒక మహిళ ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా కి చెందిన వారు. షబ్నమ్ ఇంగ్లీషులో ఎంఏ చేశారు. ఐదవ తరగతి మధ్యలో ఆపేసిన (డ్రాప్ అవుట్) సలీం అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు షబ్నమ్.

కానీ షబ్నమ్ కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించలేదు. దాంతో సలీంతో కలిసి తన కుటుంబంలోని ఏడుగురు సభ్యులని గొడ్డలితో నరికి చంపారు షబ్నమ్. వీరిలో షబ్నమ్ తండ్రి షౌకత్ అలీ (55), తల్లి హష్మి (50), అన్నయ్య అనీస్ (35), అనీస్ భార్య అంజుమ్ (25), తమ్ముడు రషీద్ (22), కజిన్ రబియా (14), అనీస్ 10 నెలల కుమారుడు అర్ష్ ఉన్నారు.

ఈ సంఘటన 2008 లో జరిగింది. వారిద్దరిని అరెస్ట్ చేసినప్పుడు వారి వయసు 20 దాటింది. షబ్నమ్ ఏడు నెలల గర్భవతి గా ఉన్నారు. ఆ సంవత్సరం డిసెంబర్ లో షబ్నమ్ కి కొడుకు పుట్టాడు. 2010 లో, వీరిద్దరినీ దోషులుగా తేల్చిన అమ్రోహా సెషన్స్ కోర్ట్ వీరిద్దరికీ ఉరిశిక్షను విధించింది.

దాంతో వాళ్ళిద్దరూ హై కోర్ట్, సుప్రీం కోర్ట్ లని ఆశ్రయించారు. సుప్రీం కోర్ట్ కూడా తమ కింది కోర్టు ఇచ్చిన తీర్పుని ఖరారు చేసింది. దాంతో వారిద్దరూ అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీని క్షమాభిక్ష కోరారు. ప్రణబ్ ముఖర్జీ నిరాకరించారు. దాంతో అధికారులు ఉరిశిక్ష అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. తేదీ ఖరారు అయిన తర్వాత షబ్నమ్ ని మధురై లోని జైలులో ఉరి తీస్తారు.
తాజాగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసిఆర్ఎ) రిపోర్ట్ ల ప్రకారం, రాబోయే ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి టెలికం కంపెనీలు మరోసారి సుంకాలను పెంచాలని యోచిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుండి టెలికాం కంపెనీలు రాబోయే నెలల్లో టారిఫ్ ప్లాన్ ల చార్జీలను పెంచే అవకాశం ఉంది. ఇక పై ఫోన్ మాట్లాడడం, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడం ఇప్పటిలా చీప్ గా ఉండకపోవచ్చు.

2021-22 సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఈ పెంపుదల ప్రారంభమవుతుంది. అయితే, ఈ సుంకాలు ఎంత పెంచబడుతుందనే దానిపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. 2 జి నుండి 4 జి వరకు వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీల పెరుగుదల సగటు ఆదాయాన్ని (ఎఆర్పియు) మెరుగుపరుస్తుందని ఐసిఆర్ఎ నివేదిక పేర్కొంది. సంవత్సరం మధ్య నాటికి ఇది సుమారు 220 రూపాయలు ఉండవచ్చని ఓ సూచన చేసింది. ఈ పెరుగుదల వలన రాబోయే 2 సంవత్సరాలకు 11% నుండి 13% వరకు మరియు 2022 ఆర్థిక సంవత్సరంలో ఆపరేటింగ్ మార్జిన్ 38% వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.

కరోనావైరస్ మహమ్మారి వల్ల అనేక రంగాలు ప్రభావితమైనప్పటికీ టెలికాం పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపలేదు. అంతేకాకుండా, డేటా వినియోగం మరియు లాక్డౌన్లో చార్జీల పెరుగుదల కారణంగా పరిస్థితి మెరుగుపడింది. ముఖ్యంగా, ఆన్లైన్ తరగతులు మరియు ఉద్యోగుల కోసం ఇంటి నుండి పని చేయడం వల్ల డేటా వినియోగం పెరిగింది.
