ఆ గ్రామంలో యువతకు పెళ్లి కావట్లేదు అంట.! కారణం ఏంటో తెలుసా.? తప్పు ఎవరిది.?

ఆ గ్రామంలో యువతకు పెళ్లి కావట్లేదు అంట.! కారణం ఏంటో తెలుసా.? తప్పు ఎవరిది.?

by Mohana Priya

Ads

ఒక మనిషికి కావాల్సిన సదుపాయాల్లో ఎంతో ముఖ్యమైనవి కనీస సదుపాయాలు. వాళ్ళు ఉండే చోట తిండి, ఆశ్రయం, ఇవి కాకుండా ఇంకా మిగిలిన కనీస అవసరాలు అనేవి కచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే మనుషులు నివసించడం కష్టం. కానీ ఒక ప్రదేశంలో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Video Advertisement

a village in bihar does not have basic facilities

ఈనాడు కథనం ప్రకారం పశ్చిమ బెంగాల్ బీహార్ సరిహద్దుల్లో ఉన్న తారాబడి అనే గ్రామంలో దాదాపు ఎనిమిది వందల మంది ముస్లిం జనాభా ఉంటారు. ఆ ఊరు చుట్టూ నదులు ఉంటాయి. అయితే బీహార్ ప్రాంతాల్లో కనీస సదుపాయాలను ఏర్పాటు చేస్తామని సీఎం నితీష్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

a village in bihar does not have basic facilities

కానీ ఈ గ్రామంలో కనీస సదుపాయాలు లేవు. దాంతో ఈ గ్రామంలో ఉండే యువతని పెళ్లి చేసుకోవడానికి పక్కల ఉండే గ్రామాల వాళ్లు అంతగా ఆసక్తి చూపడం లేదు.  అంతే కాకుండా ఏమైనా అవసరం ఉంటే చుట్టుపక్కల ఉండే గ్రామాలకి వెళ్లడానికి కూడా సదుపాయాలు లేవు అని ఈ గ్రామంలోని నివాసులు చెప్తున్నారు.

a village in bihar does not have basic facilities

ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని, తమ గ్రామానికి ఒక వంతెన కూడా లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించాలి అని గ్రామస్తులు  డిమాండ్ చేస్తున్నారు.


End of Article

You may also like