కొంతమంది నటులు తెలుగు లో చేసినవి కొన్ని సినిమాలే అయినా జనాల మైండ్ లో రిజిస్టర్ అవుతారు. వాళ్లలో సింధుమీనన్ ఒకరు. సింధు మీనన్ బెంగళూరు లో నివసించే ఒక మలయాళీ కుటుంబానికి చెందిన వారు. మాతృభాష మలయాళం అయినప్పటికీ సింధు మీనన్ పుట్టిపెరిగింది మొత్తం బెంగళూరులోనే.

సింధు మీనన్ చిన్నప్పటి నుండే భరతనాట్యం నేర్చుకున్నారు. ఒక భరతనాట్యం కాంపిటీషన్ లో పాల్గొని అందులో విజేతగా నిలిచారు సింధు మీనన్. ఆ కాంపిటీషన్ కి జడ్జ్ అయిన భాస్కర్ హెగ్డే సింధూ మీనన్ ని కన్నడ డైరెక్టర్ కె.వి.జయరామ్ కి పరిచయం చేశారు. 1994లో జయరామ్ దర్శకత్వం వహించిన రష్మీ అనే సినిమాతో బాల నటి గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సింధు మీనన్.

తర్వాత మరో రెండు సినిమాల్లో నటించారు. 1999లో ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్ గా కెరియర్ ను మొదలు పెట్టారు. 2001లో వచ్చిన, రియల్ స్టార్ శ్రీహరి గారు నటించిన భద్రాచలం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సింధు మీనన్.

తర్వాత ఎన్నో తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. తెలుగులో లో త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఇన్స్పెక్టర్, ఆడంతే అదో టైపు, చందమామ, రెయిన్ బో, సిద్ధం, ప్రేమ పిలుస్తోంది, సుభద్ర సినిమాల్లో నటించారు.

చందమామ లో తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు సింధు మీనన్. 2009 లో వచ్చిన డబ్బింగ్ చిత్రం వైశాలి ద్వారా తెలుగు ప్రజలకు ఇంకా దగ్గరయ్యారు. 2012లో వచ్చిన తెలుగు చిత్రం సుభద్ర సింధు మీనన్ నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత మరే సినిమా లోనూ నటించలేదు.

2010లో యు.కె లో నివసించే ఐటీ ప్రొఫెషనల్ అయిన డొమినిక్ ప్రభు ని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇప్పుడు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ప్రస్తుతం సింధుమీనన్ విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సింధుమీనన్ ఫోటోలు కొన్ని ఇప్పుడు చూద్దాం.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20




సినీ ఇండస్ట్రీకి న వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే , నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ సంచలనం సృష్టించింది నటి, హిందీ బిగ్‌బాస్-13 మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. పెద్ద నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను అత్యాచారం చేయాలని ప్రయత్నించాడంటూ చెప్పుకొచ్చింది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు టీవీ కార్యక్రమాలు , సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమైన నటి రష్మీ దేశాయ్. సల్మాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ 13 లో థర్డ్ రన్నరప్ కూడా. ఆ తర్వాత వెండితెరపై కూడా కనిపించింది. ఇటీవల ఒక ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.
పదమూడేళ్ల క్రిందట తాను కెరీర్ ప్రారంభించానని, అప్పుడే టీనేజ్ లోకి అడుగుపెట్టానని, నటనపై ఇంట్రస్ట్ తో ఇటువైపొచ్చనని చెప్పింది. అయితే ఆ సమయంలో ఆఫర్స్ ఇప్పిస్తాను అనే వంకతో సూరజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం లేకపోయేసరికి సూరజ్ నిజంగానే అవకాశాలు ఇప్పిస్తాడని నమ్మాను . కానీ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ రావాలంటే లైంగికంగా లొంగాల్సిందే అని చెప్పేవాడని, అలా చాలా సార్లు తనను లొంగగదీసుకునే ప్రయత్నం చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.
పెద్ద నిర్మాత యశ్ రాజ్‌తో కలిసి పనిచేసే అవకాశం ఇప్పిస్తానని తన నెంబర్ తీసుకున్న సూరజ్. ఓసారి ఫోన్ చేసి ఆడిషన్‌కి రమ్మన్నాడు, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ రూమ్‌లో అతనొక్కడే ఉండడంతో డౌటొచ్చింది . దాంతో వెళ్లిపోతానని చెప్తే కూల్ డ్రింక్ తాగడానికి ఇచ్చి, అది తాగాల్సిందిగా బలవంతం చేశాడు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపాడని, దాన్ని తాగించి అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశాడని రశ్మి తెలిపింది.
అక్కడినుండి ఎలాగోలా తప్పించుకుని బయటపడి, ఆ తర్వాత అమ్మతో జరిగినదంతా చెప్పాను . దీంతో అమ్మ సూరజ్ ని పిలిపించి ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చిందని, ఈ పని నేనే చేసి ఉండాల్సిందని అనిపిస్తుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన రశ్మి చేసిన కామెంట్స్ తో మళ్లీ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వైరలవుతోంది.



























