2018 లో పెళ్లి నిశ్చయమైంది..ఇప్పటికి 3 సార్లు ఆగిపోయింది..! ఎందుకో తెలుసా.?

2018 లో పెళ్లి నిశ్చయమైంది..ఇప్పటికి 3 సార్లు ఆగిపోయింది..! ఎందుకో తెలుసా.?

by Anudeep

Ads

కళ్యాణం వచ్చినా కక్కోచ్చినా ఆగదంటారు.. కాని ఒక జంటకి కళ్యాణ గడియలు దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఆగిపోతున్నాయి . ఒకటి రెండు సార్లు కాదు ముచ్చటగా మూడు సార్లు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయాయి. మూడు సార్లు పెళ్లి ఆగిపోయేంత పెద్ద కారణాలు ఏంటబ్బా , దగ్గర వాళ్లు ఎవరైనా పోయుంటారా? లేదంటే కట్న కానుకల గొడవల మరింకేంటి.. ఏం లేదండీ విధి వాళ్లిద్దరిని కలపాలని చూస్తుంది కాని ప్రకృతి సహకరించట్లేదు..

Video Advertisement

కేర‌ళలోని కోజికోడ్ కు చెందిన ప్రేమ‌చంద్ర‌న్, సంద్రా సంతోష్ వీళ్లిద్దరికి వివాహం చేయాలనుకున్నారు పెద్దలు.మొదటి సారి  2018 మే 20న పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. సరిగ్గా అప్పుడే కేర‌ళ‌లో నిఫా వైర‌స్ విజృంభించింది. నిఫా వైరస్ ప్రభలడంతో కోజికోడ్, మ‌ల‌ప్పురం జిల్లాలో 17 మంది చ‌నిపోయారు. దాంతో ఈ వైర‌స్ ను అరిక‌ట్టే చ‌ర్య‌ల్లో భాగంగా జ‌న స‌మూహ‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. సామాజిక దూరం పాటించాల‌ని, రాకపోకలు ఆపుచేయాలని ఆదేశించారు. అంతే పెళ్ళి వాయిదా పడింది.

నిఫా వైరస్ నుండి కోలుకుంటూ మళ్లీ కేరళలో వాతావరణం కుదుటపడింది . అందరూ వారి వారి పనుల్లో పడి రొటీన్ జీవితంలో పడ్డారు.  ఇక మన ప్రేమ చంద్రన్, సంద్రాలు కూడి పెళ్లి చేస్కోవాలనుకున్నారు . కాని ప్రేమ‌చంద్ర‌న్ వాళ్ల రిలేటివ్ చనిపోవడంతో  ఒన్ ఇయర్ పాటు మళ్లీ  పెళ్లి వాయిదా. ఛల్ ఇక ఇలా కాదు ఈ సారి ఓనం హాలిడేస్లో ఎలా అయి పెళ్లి చేస్కోవాలని  2019 ఓనం సెల‌వుల్లో పెళ్లి  ఫిక్స్ చేశారు. అప్పుడు పెళ్లి జరిగి ఉంటే మనం ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుకుంటాం. ఈ సారి వరదల రూపంలో ప్రకృతి వీరి పెళ్లి కి అడ్డుపడింది. అయినా సరే ఆశ వదులు కోకుండా మార్చి 22,2020 పెళ్లికి సిద్దపడ్డారు.

కానీ ఈ సారి కరోనా రూపంలో పెళ్లి వాయిదా పడింది. మార్చ్ లో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందేగా. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని , పెళ్లిల్లు, మీటింగులు అన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే.


End of Article

You may also like