భారతదేశం సర్వ మతాలకి నిలయం. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు కలిసికట్టుగా జీవిస్తూ ఉంటారు. అయితే ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ఉంటారు. కొందరు మతాలకు అతీతంగా దేవుని పూజిస్తూ ఉంటారు. తాజాగా అయోధ్య రామ మందిరానికి ముస్లిం భక్తులు రావడం ఇందుకు నిదర్శనం.
తాజాగా హిందూ ఆలయాల్లోకి అన్య మతస్తుల ప్రవేశం పైన మద్రాస్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అసలు విషయంలోకి…అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన మధురై బెంచ్ అన్యమతస్థుల ప్రవేశంపై ఆలయ ప్రవేశ ద్వారం, ధ్వజస్తంభం దగ్గర, మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో ‘హిందూయేతరులను అనుమతించరు’ అనే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారిని చేర్చింది.

హిందూ విశ్వాసాలు నమ్మని వారిని ఆలయాల్లోకి అనుమతించవద్దని కోర్టు సూచించింది.ఎవరైనా హిందుయేతరులు ఆలయంలోకి వస్తామని కోరితే దేవతపై విశ్వాసం, హిందూ మతం ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తానని…ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటాననే హామీని వారి నుండి పొందాలి. అటువంటి హామీతో హిందుయేతరులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించవచ్చు అని కోర్టు తీర్పు చెప్పింది.అలాగే అటువంటి వ్యక్తులను అనుమతించే సమయంలో ఆలయ రిజిస్టర్లో పేరు నమోదు చేయాలని స్పష్టం చేసింది.

అయితే ఈ పిటిషన్ పళని దేవాలయానికి మాత్రమే దాఖలు చేయడంతో కోర్టు ఉత్తర్వులు దానికి మాత్రమే పరిమితం కావచ్చని ప్రతివాదులు చేసిన వాదనను తోసిపుచ్చింది. లేవనెత్తిన అంశం పెద్ద సమస్య.ఇది అన్ని హిందూ దేవాలయాలకు వర్తించాలి,కాబట్టి ప్రతివాదుల అభ్యర్థన తిరస్కరించాం…ఈ ఆంక్షలు వివిధ మతాల మధ్య మత సామరస్యాన్ని,సమాజంలో శాంతిని నెలకొల్పుతాయి అని కోర్టు తెలిపింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఆర్ అండ్ సీఈ విభాగం, ఆలయ నిర్వహణలో పాలుపంచుకున్న వ్యక్తులందరూ అన్ని హిందూ దేవాలయాలకు ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది.




అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం ఎంతో దివ్యంగా, అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్యలో దశాబ్దాల తర్వాత బాబ్రీ మసీదు వివాదం ముగిసి, సుప్రీం కోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణం జరిగింది. 500 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవంతో భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముస్లింలు కూడా పాల్గొనడం ఆమోదించలేని పాకిస్థాన్, రామ మందిరం పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్యసమితికి అధికారికంగా లేఖ రాసింది.
భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఎప్పుడూ అలసిపోని పాక్ నాయకులలో మునీర్ అక్రమ్ ఒకరు. పాకిస్తాన్ రాయబారి ఉన్న మునీర్ అక్రమ్ రామ మందిరం పై ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. అందులో
ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం మరియు శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. భారతదేశంలోని ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణ కోసం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబ్రీ మసీదు లాగే భారతదేశంలోని ఇతర మసీదులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా ఇతర మసీదులు ఎన్నో అవమానాలు మరియు విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని పాకిస్థాన్ లేఖలో వెల్లడించింది.
హయత్ నగర్ బస్ డిపో 1 బస్ కండక్టర్ ను ఒక యువతి మద్యం మత్తులో బూతులు తిడుతూ, అతని పై దాడి చేసిన ఇన్సిడెంట్ ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది తెలియలేదు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దాన్ని బట్టి, హయత్ నగర్ నుండి అఫ్టల్ గంజ్ మార్గంలో నడిచే 72 బస్ లో ఉదయాన్నే ఒక యువతి మద్యం సేవించి ఎక్కింది. 500 రూపాయల నోటు ఇచ్చి టికెట్ ఇవ్వమనడంతో కండక్టర్ ఇంత ఉదయం చిల్లర ఉండదని తెలిపాడు.
దాంతో ఆగ్రహించిన యువతి బస్ కండక్టర్ని నానా బూతులు తిట్టి, కొట్టడమే కాకుండా తోటీప్రయాణికులు చెబుతున్నా వినకుండా కండక్టర్ని కాలుతో తన్నడం, ఉమ్మడం జరిగింది. ఎంత చెబుతున్నా వినకుండా కండక్టర్‌పై దాడి చేసింది. ఆమె ప్రవర్తన భరించలేక చివరికి బస్సును పక్కకు ఆపడంతో ఆమె దిగిపోయింది.
అయితే దిగే ముందు కూడా బస్సులో ఉన్న మరో స్త్రీని సైతం బూతులు తిట్టింది. ఇదంతా ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘట పై ఎండి సజ్జనార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ అంజు(34), పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లో పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా ఖాన్(29)తో పరిచయం అయ్యింది. వీరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. అలా కొన్నాళ్ళు సాగిన తరువాత ఇద్దరు కలవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అంజు,భర్త పిల్లలను విడిచి పెట్టి, ప్రేమించిన వ్యక్తి కోసం సరిహద్దులు కూడా దాటి, జూలై 21న పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఫ్రావిన్స్‌లో ఉండే దీర్ సిటీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఈ విషయంలో అంజు భర్త అయిన అరవింద్ మాట్లాడుతూ, తన భార్య అంజు జైపూర్‌కు వెళ్తున్నాననే వంకతో గురువారం నాడు ఇంటి నుండి వెళ్లినట్టు వెల్లడించారు. అయితే అంజు పాకిస్థాన్‌కు వెళ్లినట్టుగా తెలిసిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆమె స్నేహితుడిని కలవాలని తెలిపి, ఇంటి నుండి వెళ్లిపోయిందని తెలిపారు. ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ఆమె భర్తకి ఫోన్ చేసి, ఆమె లాహోర్‌లో ఉన్నానని, 2, 3 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని అంజు చెప్పినట్టు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.

