తల్లి తన బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది ఏమైనా చేస్తుంది అని ఎప్పుడు వింటుంటాం అప్పుడప్పుడు చూస్తుంటాం.తాజాగా తన బిడ్డ కోసం తల్లి ఇద్దరు కిడ్నాపర్ల తో పోరాడింది.

వివరాలలోకి వెళ్తే ఢిల్లీలోని షకార్ పుర్ ఏరియాలో ఇద్దరు కిడ్నాపర్లు ఒక ఇంట్లో ఉన్న 4 ఏళ్ల పాపను ఎత్తుకెళ్ళాలని ప్రయత్నించారు.దానికి అడ్డుపడిని తల్లి వారు పాపను ఎత్తుకెళ్ళాలని ప్రయత్నించిన మోటార్ వెహికల్ అదుపు తప్పేలా తెలివిగా ప్రయత్నించి పాపను ఒక చేతితో వాళ్ళ వద్ద నుండి లాక్కుంది.

అరుపులు వస్తుండడంతో ఏమైందో తెలుసుకోవాలని చుట్టుపక్కల వాళ్ళు గుమికూడేసరికి భయపడిన దుండగులు ఆ మహిళ నుండి ఎలాగో బయటపడి అక్కడి నుండి తప్పించుకున్నారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి.
#WATCH: Mother of a 4-yr-old girl saved her daughter from kidnappers in Shakarpur area on July 21. Two persons including uncle of the child arrested. A motorcycle with fake number plate, one loaded country-made pistol, .315 bore cartridge&original number plate were seized. #Delhi pic.twitter.com/nG6R14pUnp
— ANI (@ANI) July 22, 2020





























