మనిషి చనిపోతే కడసారి చూపు కోసం దగ్గర వారందరూ వెళ్లడం సహజమే.అయితే ఈ కరోనా నేపథ్యంలో ఎవరైనా చనిపోయిన దగ్గరవారు ఎవరూ వెళ్ళడానికి కుదరడం లేదు.ఒకవేళ వెళ్లిన కరోనా సోకె ప్రమాదం ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది.అయితే సంగారెడ్డి జిల్ల్లా జహీరాబాద్ టౌన్ లో కొన్ని రోజుల క్రితం 54 సంవత్సరాల మహిళా చనిపోయింది.కాగా అంత్యక్రియలకు వెళ్లినవారిలో చాలామందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.వివరాల్లోకి వెళ్తే ..

representative image
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కొన్ని రోజుల క్రితం చనిపోయిన ఓ 54 యేళ్ళ మహిళా అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.కాగా చనిపోయిన మహిళా కరోనా భారినపడి మరణించింది.అయితే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి అంత్యక్రియలకు చాలామంది హాజరయ్యారు అని సమాచారం తెలుసుకున్న జిల్లా అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.

వెంటనే ఆ మహిళా అంత్యక్రియలకు హాజరు అయిన ప్రతీ ఒక్కరిని గుర్తించి కరోనా పరీక్షలు చేయించారు అధికారులు.కాగా హాజరు అయిన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.అయితే ఈ ఇరవై మంది ఎవరితో అయితే కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకీ కరోనా పరీక్షలు చేయించే పనిలో అధికారులు బిజిగా ఉన్నట్లు తెలుస్తుంది.
































