నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ తాజాగా విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది. మృణాల్ ఠాకుర్, నాని జంటగా శౌర్యువ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎంటర్టైర్ గా ముందు నుంచి అంచనాలు పెంచేసింది.విడుదలైన పాటలు ట్రైలర్లు సినిమా మీద విపరీతమైన ఆసక్తి కలిగేలా చేశాయి. తండ్రి కూతురు మధ్య అనుబంధాన్ని ప్రధాన అంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒకసారి ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అనే విషయాల్లోకి వెళ్తే…!
హాయ్ నాన్న సినిమా టోటల్ బడ్జెట్ విషయానికి వస్తే.. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లతో పాటు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 50 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని టాక్. ఈ సినిమా నిర్మాణం కోసం 40 కోట్లు, ప్రమోషన్స్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక ప్రమోషన్స్ కు భారీ స్పందన లభించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.
తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్‌కు మంచి డిమాండ్ కనిపించింది. నైజాం థియేట్రికల్ హక్కులను 9 కోట్ల రూపాయలకు అమ్మారు. ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాలకు కలిపి 12.6 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 21.6 కోట్ల వరకు జరిగింది.
ఇక ఓవర్సీస్లో రిలీజ్ డేట్ కంటే ఒక రోజు ముందే ప్రీమియర్లను ప్రదర్శించారు. అమెరికాలో జరిగిన ప్రీమియర్లకు మృణాల్ థాకూర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఇక 6.5 కోట్ల రూపాయలతో ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ఈ సినిమా నాని కెరీర్ లో మరో మైలు రాయి అవుతుందని సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు.