ప్రతి రోజు అన్ని తెలుగు దిన పత్రికల్లో ప్రచురించబడిన తెలుగు డైలీ కార్టూన్ న్యూస్ మీకోసం మేము అందిస్తున్నాము, ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి, నమస్తే తెలంగాణ, దిశ, వార్త, మొదలగు అన్ని పత్రికల్లో ప్రచురించిన తెలుగు కార్టూన్ న్యూస్ ఇలా ఉన్నాయి
News
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఆయనతో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తన సంఘ రామ్ చరణ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇరానీ తో సినిమా చేస్తున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాని ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని నిర్మిస్తున్నాడని కూడా చెప్పారు.

అయితే ఆ వార్తల పైన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ వివరణ ఇచ్చారు.ఆ వార్తలను తాను కూడా పేపర్లలో చూశానని అయితే అందులో నిజం లేదని తేల్చి చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని ఆయన నటన తనకి ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ తో సినిమా చేయడం తనకి ఆసక్తిగానే ఉందని అయితే అది వెంటనే కాదని త్వరలోనే చేస్తానని చెప్పాడు. తాజాగా రాజ్ కుమార్ హిరానీ షారుక్ ఖాన్ తో డంకీ అనే సినిమాని రూపొందించాడు.
ఈ సినిమా సలార్ కి పోటీగా విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. రాజకుమార్ హీరాని సినిమాలన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ గానే తీశారు. ఎమోషనల్ సినిమా గా మంచి గుర్తింపు పొందింది. అయితే రామ్ చరణ్ తో సినిమా పైన ఆయన ఒక క్లారిటీ చేయడంతో సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ఫేక్ అని తేలింది
సినిమా ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది.2023 సంవత్సరంలో చాలా మంది కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.అయితే వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.
బలగం వేణు నుంచి రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న శౌర్యువ్ వరకు తొలి సినిమాతోనే డైరెక్టర్ గా వారి సత్తా చాటి అదుర్స్ అనిపించారు.

2023 మొదట్లోనే రైటర్ పద్మభూషణ్ సినిమాతో తొలి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు షణ్ముఖ్ ప్రశాంత్. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సంవత్సరం సంచలన విజయాల్లో ఒకటి దసరా. న్యాచురల్ స్టార్ నాని హీరోగా డిబటెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దసరా. శ్రీకాంత్ మీద నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
అలగే సుమంత్ ప్రభాస్ అనే కుర్ర దర్శకుడు కూడా తన డైరెక్షన్ లో తీసిన మేమ్ ఫేమస్ తో హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ గా తొలి సినిమా అవ్వడమే కాదు హీరోగా కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాడు. ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ కూడా తన సత్తా చాటాడు. ఇక మ్యాడ్ సినిమాతో యూత్ ఫుల్ హిట్ అందుకున్నాడు కళ్యాణ్ శంకర్. యుత్ మెచ్చేలా సినిమా తీసి మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ అనిపించాడు. ఈ నెలలో రిలీజైన హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు నాని. ఆల్రెడీ దసరా తో శ్రీకాంత్ కి తొలి అవకాశం ఇచ్చిన నాని హాయ్ నాన్నతో శౌర్యువ్ సత్తా చాటాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు మరో సెన్సిబుల్ డైరెక్టర్ దొరికాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్ర రాజమౌళి ప్రత్యేకమైన స్థానం. ఆయన సృష్టించిన రికార్డులను టచ్ చేయడం తిరగరాయడం ఎవరి వల్ల కావడం లేదు. ఒక డైరెక్టర్ గా తెలుగు సినిమాకి అతని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది రాజమౌళి. ప్రతి ఒక్కరూ రాజమౌళితో కంపేర్ చేసుకోవడం, రాజమౌళి సినిమాలతో కంపేర్ చేసుకోవటం, వాటి కలెక్షన్స్ తో కంపేర్ చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది.

అయితే ఇప్పుడు గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సంక్రాంతికి గుంటూరు కారం సినిమా విడుదల అవనుండగా, విడుదలయ్యే ప్రతి చోట రాజమౌళి రికార్డును టచ్ చేస్తామంటూ ప్రకటించారు. ప్రతిచోట రాజమౌళి సినిమాకి తగ్గట్టుగానే థియేటర్లలో సినిమాని విడుదల చేయడం, దానికి తగ్గట్టుగానే తమ సినిమా కలెక్షన్స్ సాధించడం జరుగుతుందని అన్నారు.
గుంటూరు సినిమా స్టోరీ నాకు తెలుసు అని, ఇప్పటివరకు జరిగిన షూటింగ్ తనను చూశానని సినిమా కంపల్సరిగా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఎన్ని సినిమాలు వచ్చిన కూడా ఆడియన్స్ అందరూ గుంటూరు కారం సినిమాకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని అన్నారు. మహేష్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే రిలీజ్ ఉంటుందని భరోసా కల్పించారు.
రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు….? చాణక్య స్ట్రాటజీ సర్వే…!
ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే 2024 సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అధికార వైసిపి ఇప్పటికే తమ అభ్యర్థులను మార్చే విషయం పైన దృష్టి సారించింది. నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటిస్తుంది. ఇక పొత్తులో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కసరత్తు పైన తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తెలుగుదేశం జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి అనేదానిపైన స్పష్టత లేదు. తమకు ఎమ్మెల్యే సీటు దక్కదని భావిస్తున్న ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది రాజీనామా చేసి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

ఒకపక్క జనసేన పార్టీ కూడా చేరికలు ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందంటూ కూడా ఆంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్ధితి ఎలా ఉందన్న అంశాలపై ప్రజాభిప్రాయంతో చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్ధ తాజాగా సర్వే రిపోర్టు వెల్లడించింది. దీని ఫలితాలు ఏపీలో టీడీపీ-జనసేన కూటమి వల్ల భారీ ప్రయోజనం ఉండబోతున్నట్లు తేల్చాయి.

రాష్ట్రంలోని 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేసిన సర్వే ఫలితాల్ని చాణక్య స్ట్రాటజీస్ ఇవాళ వెల్లడించింది. ఇందులో టీడీపీ-జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అధికార వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తంగా 18 సీట్లలోనే హోరాహోరీ పోరు ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కాకుండా ఇతరులకు 4 నుంచి 7 సీట్లు దక్కే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ సర్వే ఫలితాలు చూసిన టిడిపి జనసేన శ్రేణులు ఆనందంతో మునిగితేలుతున్నారు. మరోపక్క వైసీపీ శ్రేణులు ఈ సర్వే ఫలితాలను కొట్టి పడేస్తున్నారు
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్‌చే ఏర్పాటు చేసిన సంగీత విభావరి, బెలీ డాన్స్, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ నాయకులు పాల్గొని 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ ” గతంలో ఉన్న కమిటీ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ను ఎంతో అభివృద్ధి చేసింది. మేము కూడా అదే దిశగా ముందుకు తీసుకెళతాం . దక్షిణాదిలో నంబర్ వన్ కల్చరల్ సెంటర్ గా తీర్చిదిద్దుతాం” అని అన్నారు,

ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎన్ సీ సీ ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ట్రెజరర్ బి రాజశేఖరరెడ్డి, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ , శైలజా జుజల, బాలరాజు, గోపాలరావు, ఏడిద రాజా మోహన్ వడ్లపట్ల, ఇంద్రపాల్‌రెడ్డి, వరప్రసాదరావు పాల్గొన్నారు.
న్యూ ఇయర్ వచ్చేస్తుంది….ఇవి తప్పకుండా బకెట్ లిస్టులో పెట్టుకోండి…
2024 నూతన సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలామంది కొత్త కొత్త విషయాలను ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరంలో ఫ్రెష్ గా మొదలు పెడితే సంవత్సరం అంతా ఉత్సాహభరితంగా పనిని చేస్తామని భావిస్తూ ఉంటారు.అయితే చాలామందికి ఏం చేయాలో అనేదానిపై స్పష్టత ఉండదు. కొందరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే, మరికొందరు పాత అలవాట్లను వదిలేయాలని అనుకుంటారు. అయితే ఏ పనులను ప్రారంభించాలి ఏ అలవాటులను ఎలా వదిలేయాలి అనే దాని పైన ఒకసారి వివరంగా చూస్తే…

1. లక్ష్యం పెట్టుకోండి:
ఏదైనా సాధించాలి అనుకుంటున్నప్పుడు కొత్త సంవత్సరంలో దాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని వాటిని సాధిస్తూ మీరు అనుకుంటున్న పెద్ద టార్గెట్ ను చేరుకోండి. ఒక కొత్త ప్రణాళికతో ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టండి.
2. ఇన్వెస్ట్మెంట్స్:
ఎవరైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే గుర్తుండేందుకు కొత్త సంవత్సరంలో మొదలు పెడుతూ ఉంటారు. మీకు సంబంధించిన రియల్ ఎస్టేట్ అవ్వని, పొలాలు, బంగారం, లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అయినా కూడా ఈరోజు నుంచి మొదలు పెట్టండి.
3. హెల్దీ డైట్:
బాడీ మీద కంట్రోల్ పెంచుకునేందుకు ఆరోగ్యవంతమైన శరీరాన్ని మలుచుకునేందుకు న్యూ ఇయర్ ని వాడుకోండి. ఈరోజు నుండి ఏం తినాలి?ఎంత తినాలి? ఎలా తినాలి? ఏ టైం కి తినాలి? అని దానిపైన ప్రణాళిక సిద్ధం చేసుకోండి.
4. చెడు అలవాట్లకి దూరంగా ఉండండి:
చాలామంది చెడు అలవాట్లను మానేయాలనుకున్న మానుకోలేరు. అయితే కొత్త సంవత్సరం నుండి వాటిని క్రమక్రమంగా మానేస్తూ దూరంగా జరగండి. ఈరోజు మొదలుపెట్టి దాన్ని ప్రతిరోజు కొనసాగించండి.
5. డైరీ రాయండి:
ఇదివరకు రోజుల్లో నిత్యం డైరీ రాసేవారు, కానీ ఇప్పుడు ఎవరూ రాయడం లేదు.అయితే ఒక డైరీని పెట్టుకుని మీరు చేసిన పనులను చేయాలనుకున్న పనులను స్పష్టంగా రాసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ జీవితం ఎలా సాగుతుందో మీకు అవగాహన వస్తుంది. తర్వాత ఎలా మార్చుకోవాలని స్పష్టత కూడా లభిస్తుంది.
భార్య తప్పిపోయిందనుకున్నాడు…కానీ ఇన్‌స్టాలో పోస్ట్ చూసి షాక్ అయిన భర్త..! ట్విస్ట్ మాములుగా లేదుగా.?
రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు అంటే మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచుతాను అందట.ఇది ఒక సినిమా డైలాగ్ కానీ ప్రస్తుత సమాజానికి సరిగ్గా ఈ డైలాగ్ సరిపోతుంది. ఎందుకంటే నేటి రోజులలో బంధాలకి, బంధుత్వాలకి విలువలకి,ఆప్యాయతలకి, అనుబంధాలకి అసలు విలువ లేకుండా పోయింది. డబ్బు కోసం ఒక మనిషి ఎంత కింది స్థాయికి అయినా దిగజారటానికి వెనకడుగు వేయడం లేదు అలాంటి సంఘటన ఒకటి కర్ణాటకలోని దావణగెరె లో జరిగింది.

అసలు ఏం జరిగిందంటే దావణగెరె కు చెందిన స్నేహ అనే 25 ఏళ్ల మహిళ 2 ఏళ్ల క్రితం ప్రశాంత్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. దావణగెరె లో ఓ అద్దె ఇంట్లో కాపురానికి కూడా దిగారు. అనంతరం రెండు నెలల క్రితం తాను గర్భవతినని పుట్టింటికి వెళ్లాలని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడిగిన స్నేహ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన ప్రశాంత్ స్నేహ ఒకప్పుడు చెప్పిన చిరునామాకు వెళ్లి చూడగా ఆమె అక్కడ లేదు.
ఆ తర్వాత కొద్ది రోజులకు స్నేహ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో చూసిన ప్రశాంత్ ఒక్కసారిగా నివ్వెర పోయాడు. స్నేహ మరొక వ్యక్తిని వివాహం చేసుకొని ఫోటో పోస్ట్ చేయడంతో కంగుతిన్న ప్రశాంత్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఫైల్ చేసిన పోలీసులు విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. అయితే ఈ విచారణలో స్నేహ ఇంతకుముందే రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది.
మొదట మేలుకొటే నివాసి మహేష్ తో పెళ్లి జరిగింది తర్వాత అతనిని విడిచిపెట్టి బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది తర్వాత ప్రశాంత్ ని వివాహం చేసుకుంది ఇప్పుడు అతనిని వదిలిపెట్టి రఘు అనే వ్యక్తిని నాలుగో పెళ్లి చేసుకుంది. ప్రశాంత్ ఫిర్యాదు మేరకు స్నేహను అరెస్టు చేశారు. నాలాగా మరొకరు మోసపోకూడదని కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.
తెలంగాణ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ నుండి మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి ఆమె విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు.
ఒకసారి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే… యశస్విని రెడ్డి 1997 సంవత్సరంలో హైదరాబాదులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి, మాధవి. యశస్విని రెడ్డికి ఒక చెల్లెలు కూడా ఉంది. టెన్త్ క్లాస్ వరకు ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్లో చదివారు.

2018లో హైదరాబాదులోని శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి బిటెక్ పూర్తి చేశారు. తర్వాత 2019 సంవత్సరంలో ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి ల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి తో వివాహం జరిగింది. వీరి పెళ్లి సంగీత కార్యక్రమంలో బాహుబలి సినిమాలోని అనుష్క ప్రభాస్ గెటప్పులు వేసి వీరు డాన్స్ కూడా చేశారు. అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి టికెట్ పౌరసత్వం విషయంలో చిక్కుల రావడంతో ఆ టిక్కెట్ యశస్విని రెడ్డికి దక్కడం ఆమె ఎమ్మెల్యే గా నెగ్గడం జరిగింది.

యశస్విని రెడ్డి భర్త అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. యశస్విని రెడ్డి మామయ్య కార్డియాలజిస్ట్. యశస్విని రెడ్డి అత్తమామలు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టారు. వారికి 1000 యూనిట్స్ ఉన్నాయి. అవి బయట వేరే మేనేజ్మెంట్ కంపెనీకి ఇవ్వకుండా వీళ్లే మేనేజ్ చేసుకుని, లీజింగ్ ఆఫీస్ కూడా వీళ్లే చూసుకుంటారు. అది కాకుండా బాదం, పిస్తా తోటలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఆఫీస్ లు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఈ పనులన్నీ యశస్విని రెడ్డి భర్త చూసుకుంటారు.

ఝాన్సీ రెడ్డి అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించేవారు. బాగా సంపాదించి తన సొంత ఊరికి ఎంత కొంత మేలు చేయాలని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు. యశస్వి రెడ్డి కూడా అమెరికాలో కంపెనీ వ్యవహారాలు చూసుకుని వారు. తర్వాత ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఎస్ఎస్సి రెడ్డికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేకి నెగిన తర్వాత ఎటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు పెడతానని ప్రకటించారు.
ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిగా మారాడు… కానీ చివరికి..! అసలు విషయం ఏంటంటే..?
చెన్నైలో పుట్టినరోజు నాడే ఒక మహిళా టెక్కీ దారుణంగా మరణించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె మాజీ క్లాస్మేట్ ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలుస్తోంది. గొలుసుతో కట్టేసి, పెట్రోల్ పోసి సజీవదహనం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తులో మృతురాలు చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న నందిని అని తెలిపారు. ఆమెను చంపిన వ్యక్తి మృతురాలి మాజీ లవర్ వెట్రిమారన్ అని సమాచారం. పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మదురైకి చెందిన నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. చెన్నైలోనే తన బంధువుల ఇంట్లో నందిని ఉంటోంది. ఆమెకు పదవతరగతి నుండి పాండి మహేశ్వరితో స్నేహం ఉంది. పాండి మహేశ్వరి చెన్నైలో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని, తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. ఇద్దరూ చెన్నైలో సహజీవనం చేస్తున్నారని, లింగమార్పిడి తరువాత కూడా వారి సహజీవనం కొనసాగిందని తాంబరం పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వారిద్దరూ గత ఎనిమిది నెలలుగా తోరైపాక్కంలోని ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు.
అయితే నందిని రాహుల్ అనే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి, పగ పెంచుకున్నాడు. దీంతో ప్లాన్ ప్రకారం నందిని బర్త్ డే కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తానని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి పలు ప్రాంతాలు తిరిగారు. గుడికి, ఆ తరువాత హోటల్ కి వెళ్ళి భోజనం చేశారు. చివరికి పొన్మార్ రోడ్ సమీపంలో ఫ్లాట్ కి నందిని తీసుకెళ్ళాడు. ప్లాట్‌కి తీసుకెళ్లాడు. సర్ ప్రైజ్చేస్తానని చెప్పి, నందిని కళ్లకు గంతలు కట్టాడు. ఆ తరువాత చేతులు, కాళ్ళు కట్టేసి, బ్లేడ్ తో మణికట్టు, మెడ కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించి, అక్కడి నుండి పరారీ అయినట్టు పోలీసులు వెల్లడించారు.
Also Read: విద్యార్థుల కోసం ఈ ఉపాధ్యాయుడు చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..! అసలు విషయం ఏంటంటే..?

Disha CartoonNews
