జనాలు ఎక్కువ బస్ ప్రయాణాల కంటే ట్రైన్ ప్రయాణం ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జన సందోహం ఉన్న ప్రదేశాలలో ట్రైన్ వెళ్లదు కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలా మనం మనం ట్రైన్ ఎక్కినప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ట్రైన్ ని ఎక్కువ గమనించము. మన బెర్త్ తప్ప మిగిలినవి మనం పట్టించుకోము.
అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించారా? అదేంటంటే, రైల్వే పట్టాల మీద ఉన్న ట్రాక్ మీద ఉండే ఇనుము రైలింగ్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. అలా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? అలా రైల్వే ట్రాక్ మీద మధ్యమధ్యలో గ్యాప్ ఉండడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా గ్యాప్ వదిలేయడానికి వెనకాల సైన్స్ కి సంబంధించిన ఒక కారణం ఉంది. అదేంటంటే వేసవి కాలంలో ఇనుము అనేది సాగుతుంది (ఎక్స్పాండ్ అవుతుంది). ఒకవేళ ట్రాక్ మీద ఉన్న ఇనుముకి మధ్య గ్యాప్ లేకపోతే వేసవి కాలంలో ఇనుము సాగినప్పుడు చోటు సరిపోక ట్రాక్ మీద ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ట్రాక్ చాలా ఒత్తిడికి గురవుతుంది. అలాంటప్పుడు ట్రాక్ మీద పగుళ్లు వస్తాయి. అందుకే వేసవి కాలంలో ఇనుము సాగినప్పుడు వీలుగా ఉండేలా అలా మధ్యలో గ్యాప్ వదిలేస్తారు. అదే ఒకవేళ శీతా కాలంలో అయితే ఇనుము కాంట్రాక్ట్ అవుతుంది. అంటే శీతా కాలంలో అయితే ఇనుము దగ్గరికి వస్తుంది.