ఆ ఊరిలో ఎవరికీ పేర్లు ఉండవు…ఎవరినైనా పిలవాలంటే “విజిల్‌” వేయాల్సిందే.!

ఆ ఊరిలో ఎవరికీ పేర్లు ఉండవు…ఎవరినైనా పిలవాలంటే “విజిల్‌” వేయాల్సిందే.!

by Anudeep

Ads

విచిత్రం గా ఉంది కదా.. ఒక మనిషి కి పేరు లేకపోతె ఎలా..? కానీ వాళ్ళు మాత్రం ఈల వేసి పిలుస్తారట. అది అసలు ఎలా సాధ్యం అవుతుందో..? కానీ వారికి మాత్రం ఇది సంప్రదాయం గా వస్తోందట. మనకి పిల్లలు పుట్టగానే.. ఏ పేరు పెట్టాలో రోజుల తరబడి ఆలోచించి పెడుతూ ఉంటాం.. అయినా సరే.. ఒకరికి పెట్టిన పేరు చాలా మందికి పెట్టబడి ఉంటూ ఉంటుంది. కానీ.. వారిలో మాత్రం ఒకరికి పెట్టిన ఈల మరొకరికి పెట్టరట.. అలా ఈల సౌండ్ లో వచ్చే డిఫరెన్స్ ని బట్టే మనుషుల్ని గుర్తిస్తారట.. ఇంతకీ వాళ్లెవరో చూద్దాం.

Video Advertisement

మేఘాలయ లో ఈస్ట్‌ ఖాసి జిల్లా కాంగ్‌థాన్‌ అనే ఊళ్లోని ప్రజలు ఇలా విజిల్స్ తోనే తమ వాళ్ళని పిలుచుకుంటారు. ఏ ఇద్దరు అయినా ఒకరికొకరు ఎదురుబడితే విజిల్స్ తోనే పలకరించుకుంటారు.. 700 కి పైగా జనాభా ఉంటున్న ఈ ప్రాంతం లో పక్షుల సౌండ్స్, ప్రకృతి లో వచ్చే సౌండ్స్, సినిమా పాటల్లోని మ్యూజిక్.. ఇలా రకరకాల సౌండ్ లను గుర్తుపెట్టుకుని వాటితోనే కొత్త సౌండ్ ని క్రియేట్ చేసుకుని వారి పిల్లలకు పేరు పెట్టుకుంటారట.. చిన్న పిల్లలకు కూడా చిన్నతనం నుంచే సౌండ్స్ ని చేయడం, గుర్తుపెట్టుకోవడం, ఈల వేయడం వంటి వాటిని నేర్పిస్తారట..

kangathong village

ఇక్కడ.. రోడ్డు పైన కానీ.. పదిమంది ఉన్న చోట కానీ ఎవరైనా ఈల వేస్తె మనం అసభ్యం గా భావిస్తాం కదా.. కానీ అక్కడ ఈలలు వేస్తె.. పిల్లవాడు ఎదిగాడని భావిస్తారట. పిల్లాడికి ఈల వేయడం వస్తే.. ఆ తల్లితండ్రులు తమ బిడ్డను ఎత్తుకుని మురిసిపోతారట. బయట ప్రపంచం ఎంత అప్ డేట్ అవుతున్నా.. వారు మాత్రం వారి సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.

kangathong village

వారి వారసత్వాన్ని కాపాడుకోవడానికి అందరు సహకరిస్తూ ఉంటారు. పిల్లలకు కూడా చిన్నతనం నుంచే.. మనం రకరకాల పదాలు నేర్పించినట్లు వారు సౌండ్స్ ని నేర్పిస్తారట. రకరాల సౌండ్స్ చేయడం, ఈలలు వేయడం వంటివి వారికి చిన్నతనం నుంచే అలవాటు అయ్యి ఉంటాయి. కొత్తగా పుట్టిన వారికి 30 సెకండ్స్ నిడివి తో సౌండ్ ని సృష్టించి పేరు పెడతారట. ఇక్కడ మనం ఏ పేరు పెట్టుకున్నా ఇంట్లో వాళ్ళు షార్ట్ కట్ లో పిలుస్తూ ఉంటారు కదా.. అక్కడ కూడా అంతే.. 30 సెకండ్స్ సౌండ్ లో.. ఆరు సెకండ్ల సౌండ్ ని ఉపయోగనుంచి ఇంట్లో షార్ట్ కట్ లో పిలుచుకుంటుంటారట.

ఇలా ఈలలతో పీల్చుకోవడాన్ని ‘జిగవా యోబి’ అని పిలుస్తారట. వారి భాష లో ఈ పదానికి అర్ధం ఏంటి అంటే.. “అమ్మ ప్రేమ” అని. మన పెద్దలు మనకు జోల పాడినట్లు.. వీరు రకరకాల ట్యూన్స్ తో వారి పిల్లలకు జోల పాడతారట. తరతరాలు గా వస్తున్నా ఈ సంప్రదాయం ఇప్పటికీ అక్కడ కొనసాగిస్తున్నారట. ఆశ్చర్యం గా ఉంది కదా.. ఈ ప్రాంతం లో చదువుకున్న వాళ్ళు కూడా తక్కువే. ఇప్పటివరకు 6 గురు మాత్రమే చదువుల కోసం ఆ ఊరు దాటి బయటకు వచ్చారట. మిగిలిన వారంతా సాంప్రదాయ పనులపైనే ఆధారపడతారట.


End of Article

You may also like