మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల సాకెట్ కి 3 పిన్నులు ఎందుకు ఉంటాయి. సిమ్ కార్డ్ మెమరీ కార్డు అంత పలుచగా ఇంకా ఒకటే షేపులో ఎందుకు ఉంటాయి. ఇలాంటి అనుమానాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా. ఇలా మనం చుట్టు గమనిస్తే ఇలాంటి అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటే కీబోర్డ్ పైన ఉండే f,j అక్షరాలు కింద గీతలు ఉండటం.
మనం సరిగ్గా పరిశీలించి చూస్తే ప్రతి కీబోర్డ్ ఇలానే ఉంటుంది. అలా ఎందుకు ఉంది, దానికి కారణం ఏమిటి , అన్ని అక్షరాలు ఉండగా ప్రత్యేకించి ఈ రెండు అక్షరాల తెగితే ఎందుకు ఉంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటి అంటే మనం ప్రతిసారి కీబోర్డ్ ని పరిశీలనగా చూస్తూ టైప్ చేయలేము. హడావిడిలో నో లేకపోతే పని వేగంగా చేసే సమయం లో దాదాపు మనం మన కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ టైప్ చేస్తాం. అలాంటప్పుడు కీబోర్డు మీద ఉన్న పదాలు వరుస గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఇలా f,j అక్షరాల కింద గీతలు ఉంటాయి.
కానీ ఇది f,j అక్షరాల కి ఎందుకు ఇచ్చారు అంటే, మనం టైప్ చేసేటప్పుడు మన చూపుడు వేలు ఈ అక్షరాల మీద ఉంటాయి కాబట్టి. ఒకసారి మనం కీబోర్డు మీద ఉన్న అక్షరాల మీద వేళ్ళు పెట్టి గమనిస్తే ఎడమవైపు 3 వేలు a,s,d అక్షరాల మీద ఉంటాయి. కుడివైపు కె.ఎల్ అక్షరాల మీద ఉంగరం వేలు చిటికెన వేలు ఉంటాయి. టైపింగ్ పద్ధతి ప్రకారం ఈ వేళ్ళు ఈ అక్షరాలు మాత్రమే సులభంగా టైప్ చేయగలుగుతాయి. కాబట్టి ఆ వేళ్ళకి ఆ స్థానాలు ఫిక్స్ అయి ఉంటాయి. దాంతో రెండు చేతుల చూపుడు వేళ్ళు f,j మీద పడతాయి. అలా మనం వేగంగా టైప్ చేస్తున్నప్పుడు ఒకసారి చూడకుండా టైప్ చేసినా అక్షరాల ఆర్డర్ గుర్తు ఉంటుంది. మిగిలిన వేళ్ళు కూడా ఆటోమేటిక్గా పక్కన అక్షరాల మీద పడిపోతాయి. అందుకే f j అక్షరాల కింద మాత్రమే గీతలు ఉంటాయి.