దశావతారాల్లో ఎనిమిదవ అవతారం అయిన కృష్ణుడు పేరుకు అర్థం ఏమిటంటే అపరిమితమైన ఆనందం అని వేదాంతులు చెబుతుంటారు. మరి అలాంటి కృష్ణుడు తలపై నెమలి పింఛం చేతిలో మురళి ఎందుకు ధరించేవాడు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకృతి చినుకుతో తడిచినప్పుడే ప్రకృతి అసలైన అందం కనిపిస్తుంది. ఆ సమయంలో తన్మయత్వంతో నెమలి పురివిప్పి నాట్యం ఆడుతుంది. అదే చినుకు పడనప్పుడు నెమలి చెట్ల పైన ముడుచుకొని పడుకొని ఉంటుంది.ప్రకృతి పట్ల అంతటి నిస్వార్థ ప్రేమ కలిగివున్న నెమలి సూచికగా నెమలిని కృష్ణుడు తన తలపై ధరిస్తాడు అని ఒక కథ చెబుతుంటే మరోపక్క ఓ వేదాంతి వేదాలను పూర్తిగా చదివిన వాళ్ళు సాన్నిహిత్యం లేకుండా నెమలి పిల్లల్ని కంటుంది. అలాగే కృష్ణుడు కూడా ఏ స్త్రీతోనూ సాన్నిహిత్యం చేయలేదు ఆయన ఒక అస్కలిత బ్రహ్మచారి అని అన్నారు.అందుకు సూచికగా ఆయన నెమలి పించం ధరిస్తారని అన్నారు.
ఇక మురళి విషయానికొస్తే శూన్యం అయినది కనుక కృష్ణునికి కావాల్సిన రీతిలో మారుతుంది కనుక మురళి అంటే కృష్ణునికి ఇష్టమని చాలామంది భావిస్తారు.