సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ను చూడడం కోసం వెళ్ళిన టైటాన్ జలాంతర్గామి పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓషన్ గేట్ కంపెనీ ఈ దుర్ఘటన పై అఫిషియల్ ప్రకటన విడుదల చేసింది. సముద్రంలో తీవ్రమైన ప్రెజర్ వల్ల టైటాన్ జలాంతర్గామి పేలిందని, అందులోని ఉన్నవారంతా చనిపోయినట్టు వెల్లడించింది.
ఆదివారం నాడు వీరు వెళ్లగా, 3 రోజుల క్రితం టైటాన్ సముద్రంలో గల్లంతైంది. దాంతో ఈ జలాంతర్గామి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కానీ ఒత్తిడి వల్ల పేలిపోయినట్లుగా కనుగొన్నారు. ఇదిలా ఉంటే జలాంతర్గామిలో ఎంత ఆక్సిజన్ ఉంటుంది? ఆక్సిజన్ అయిపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం..టైటానిక్ నౌక 1912లో సముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నౌక శకలాలను చూడడం కోసం పాకిస్తాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, ఆయన తనయుడు సులేమాన్, బ్రిటీష్ బిజినెస్ మెన్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ నేవీ ఆఫీసర్ పాల్ హెన్నీ, ఓషన్ గేట్ ఫౌండర్ స్టాక్టన్ రష్ టైటాన్ జలాంతర్గామిలో ప్రయాణించారు. ఈ అడ్వెంచర్ ట్రిప్ కు టికెట్ 2 కోట్ల పైనే ఉంటుంది. అత్యంత ఖరీదైన టూర్ అయినప్పటికీ సాహసాలు ఇష్టపడే వారు సముద్రం అడుగున ఉన్న టైటానిక్ శిథిలాలను చూడడానికి ఇష్టపడుతుంటారు. ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బందితో ఈ జలాంతర్గామి బయలుదేరింది. అయితే సముద్రం లోపలికి వెళ్లిన అనంతరం జలాంతర్గామిలో ఏదో సమస్య వచ్చింది. సిగ్నల్ కట్ అయింది. ట్రిప్ ను ప్రారంభించిన గంట 45 నిముషాల్లోనే జలాంతర్గామి కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే జలాంతర్గామిలో మరో 72 గంటలవరకు సరిపడే ఆక్సిజన్ ఉన్నట్లు సమాచారం.
జలాంతర్గామి లోపల చలి ఎక్కువయినపుడు ఆక్సీజన్ ఎక్కువ అవసరం ఉంటుందని, అందరు ఒక్కదగ్గర ఉండడం ద్వారా శరీరంలోని వేడిని ఆదా చేసుకోవచ్చని సెయింట్ జాన్స్ మెమోరియల్ యూనివర్సిటీ హైపర్బరిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ కెన్ లీడెజ్ అన్నారు. ఆక్సీజన్ నిల్వలు తగ్గిపోవడం మాత్రమే సమస్య కాదని, ఆ నౌకలో విద్యుత్ నిలిచిపోయిన ప్రమాదమే అని అన్నారు. జలాంతర్గామి లోపలి ఆక్సీజన్, కార్బన్ డయాక్సైడ్ల లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో విద్యుత్ పాత్ర ఉంటుంది.
ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోయిన కొద్ది, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. అలా జరిగితే వారి కండిషన్ సీరియస్ అవుతాయి. కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిన కొద్దీ బాడీ మందకొడిగా మారి, మత్తు మందు పీల్చినట్లుగా వారంతా నిద్రలోకి వెళతారని, మనిషి బ్లడ్ ఫ్లోలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అయితే వారు హైపర్కాప్నియాకు గురవుతారు. వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే చనిపోతారు’’ అని చెప్పారు.
Also Read: తెలంగాణ రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేసిన బట్టి పాదయాత్ర ! 100 రోజులు పూర్తి !