మీ ప్రేయసితో సిరీస్ చూసిచూసి బోర్ కొడుతోందా..? అయితే ఈ 14 ట్రై చేసేయండి మరి..!

మీ ప్రేయసితో సిరీస్ చూసిచూసి బోర్ కొడుతోందా..? అయితే ఈ 14 ట్రై చేసేయండి మరి..!

by Megha Varna

Ads

చాలామంది భార్యాభర్తలు, లవర్స్ ఎక్కువ సమయాన్ని సినిమాలు, సిరీస్ వంటి వాటిని చూసేందుకు కేటాయిస్తూ ఉంటారు. అయితే వాళ్లకు ఉన్న సమయంలో కేవలం సిరీస్ ని చూడడం మాత్రమే కాకుండా ఇటువంటి వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు.

Video Advertisement

అప్పుడు ప్రేమ మరింత పెరుగుతుంది. పైగా స్క్రీన్ లను చూడడం కంటే కూడా ఇవి బాగుంటాయి.

#1. బైక్ రైడ్:

బైక్ రైడ్ లేదా కార్ డ్రైవ్ కి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. దారిలో స్ట్రీట్ ఫుడ్, టీ, కాఫీలతో ఎంజాయ్ చేయొచ్చు.

#2. ట్రెండింగ్ డాన్స్ రొటీన్:

ఇంస్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియాలలో మనకి ఇవి తరచూ కనపడుతూ ఉంటాయి ఇటువంటి వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు.

#3.కలిసి వంట చేసుకోవడం:

బయట ఫుడ్ ని ఆర్డర్ చేయడం కంటే కూడా కాసేపు ఇద్దరు కలిసి హ్యాపీగా కుకింగ్ చేయొచ్చు. ఇది కూడా మంచి జ్ఞాపకలని మీకు ఇస్తుంది.

#4 .ఇంటిని శుభ్రం చేయడం:

కలిసి ఇంట్లో చెత్తాచెదారాన్ని శుభ్రం చేయడం చేస్తూ కూడా సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

#5. కలిసి పానీపూరి తినడం:

ఉన్న సమయంలో కాస్త సమయాన్ని కలిసి పానీపూరి లేదా చాట్ వంటి వాటిని తినడానికి వెళ్లండి. పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకోండి. అంతేకానీ ఉన్న సమయాన్ని వృధా చేసుకోకండి.

#6.స్టాండప్ కామెడీ కి వెళ్లడం:

స్టాండ్ అప్ కామెడీ లేదంటే ఎగ్జిబిషన్స్ వంటి వాటికి వెళ్లి మీరు కాస్త సమయాన్ని గడపవచ్చు.

#7.పిక్నిక్ కి వెళ్లడం:

బయటకు వెళ్లడం లేదా పిక్నిక్ కి వెళ్ళండి. ఇలా మీరు ఒక రోజుని ఇలా ఆనందంగా గడిపితే.. సమయమే తెలియదు.

#8. కలిసి వర్కౌట్స్:

అస్తమాను స్క్రీన్ ల ముందు కూర్చుకండి. కాసేపు వర్కౌట్ చేయడం వలన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.

#9. మ్యూజియం కి వెళ్ళండి:

మంచి మ్యూజియం కి కానీ అందమైన ప్రదేశాలకి కానీ వెళ్లి కాస్త సమయాన్ని గడపండి.

#10. పెయింటింగ్ క్లాసెస్:

ఇద్దరూ కలిసి పెయింటింగ్ క్లాసులకి కూడా వెళ్లొచ్చు ఆనందంగా అక్కడ సమయాన్ని గడపొచ్చు.

#11. బేకింగ్ చేయండి:

మంచి రుచికరమైన కప్ కేక్స్ వంటి వాటిని మీరు కలిసి బేక్ చేయొచ్చు ఇది కూడా ఆనందాన్ని ఇస్తుంది.

#12. బోర్డ్ గేమ్స్:

ఈ గేమ్స్ తో కాసేపు మీరు కలిసి గడిపితే ఎంతో ఆనందంగా ఉంటుంది. పైగా ఫన్నీగా ఉంటుంది.

#13. నచ్చిన పుస్తకాన్ని ఇద్దరూ చదవడం:

ఒక మంచి పుస్తకాన్ని తీసుకుని ఇతరు కాసేపు చదివితే కూడా మంచిగా సమయాన్ని స్పెండ్ చేయొచ్చు.

#14. ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో ఉంచండి:

ఫోన్లతో చాలామంది బిజీగా ఉంటారు నిజానికి ఒకరు ఫోన్ తో బిజీగా ఉంటే ఇంకొకరికి కోపం వస్తుంది. సో మీరు ఫోన్ల ని ఫ్లైట్ మోడ్ లో ఉంచండి లేదంటే స్విచ్ ఆఫ్ చేయండి ఇదే ఉత్తమమైన మార్గం.


End of Article

You may also like