ఒక్కోసారి పొరపాటున ఒకరికి ట్రాన్స్ఫర్ చేయబోయి మరొకరికి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో ఆ డబ్బులను మనం ఎలా తిరిగిపొందచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.
ఒకరికి ట్రాన్స్ఫర్ చేయబోయి మరొకరికి డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంకులు బాధ్యత వహించవు. పంపిన వ్యక్తిదే పూర్తి బాధ్యత. కానీ బ్యాంకులు మాత్రం డబ్బులు పొందేందుకు సాయం చేస్తాయి. మీరు కనుక బ్యాంక్ బ్రాంచ్ నుంచి పంపిస్తే అప్పుడు అకౌంట్ వివరాలను, పేరును చూసి ట్రాన్సక్షన్స్ ని టెంపరరీగా క్లోజ్ చేస్తారు. ఆ వ్యక్తికి తెలుపుతారు.
ఒకవేళ కనుక బ్యాంకింగ్ యాప్లు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ నుండి కనుక పేమెంట్స్ చేస్తే ఆ ట్రాన్సక్షన్స్ డీటెయిల్స్ ని చూడలేరు. ఒకవేళ మీరు అకౌంట్ నెంబర్ ని ఎంటర్ చేసి డబ్బులను పంపుతుంటే …అకౌంట్ నెంబర్ తప్పై ఆ నెంబర్ లేదంటే మెసేజ్ వస్తుంది. డబ్బులు వెళ్లవు. అదే ఆ నెంబర్ ఉంటే మరొక వ్యక్తికి డబ్బులు వెళ్తాయి. బ్యాంక్ కి వెళ్లి కంప్లైంట్ చెయ్యాలి. బ్యాంక్ కి మీరు డబ్బు పంపినట్టు రుజువు ఇవ్వాలి.
రిసీవర్ కనుక ఆ డబ్బులను వాడకపోతే డబ్బులను తిరిగి పంపమని అడుగుతారు. అదే ఖర్చు చేసేస్తే.. వాళ్ళు ఆ అమౌంట్ ని ఇచ్చే దాకా చూడాలి. అంతే కానీ బ్యాంకులు ఏమి చెయ్యలేవు.
ఆ వ్యక్తి డబ్బు పంపకపోతే ఏం చెయ్యాలి..?
డబ్బులు మీరు ఆ వ్యక్తికి పంపితే.. ఆ వ్యక్తి ఖర్చు చేసేసి కొంత సమయం అడిగితే మనం ఏం చేయలేము. పోలీసులకు ఫిర్యాదు చెయ్యచ్చు. ఫిర్యాదు కాపీని బ్యాంకుకి ఇచ్చి వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చెయ్యచ్చు. ఇలా డబ్బుని ఇచ్చే దాకా ఫ్రీజ్ చేయవచ్చు. ఆ అకౌంట్ వద్దనుకుంటే అతను మరో బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాంటి చర్య తీసుకోవడం అవ్వదు. తిరిగి ఇవ్వమని అడగడం తప్ప. ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదు.