మనిషికి న్యూస్ పేపర్ తో ఒక విడదీయలేని అనుబంధం ఉంటుంది. చాలా మంది రోజు మొదలయ్యేది న్యూస్ పేపర్ తోనే. ఇంటర్నెట్ వచ్చినా కూడా న్యూస్ పేపర్ స్థానం అలాగే ఉంది. మనం రోజు న్యూస్ పేపర్ చదువుతాం కానీ న్యూస్ పేపర్ పై ఉండే కొన్ని ముఖ్యమైన అంశాలను అసలు గమనించం.
ఉదాహరణకి న్యూస్ పేపర్లో న్యూస్ అంటే అర్థం తెలుసా? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని. ఇదే కాదు ఇంకా కొన్ని మనం గమనించని విషయాలు న్యూస్ పేపర్ పై ఉంటాయి. అందులో ఒకటి న్యూస్ పేపర్ చివర్లో ఉండే చుక్కలు.
న్యూస్ పేపర్ చివరిలో దాదాపు నాలుగు చుక్కలు ఉంటాయి. అదికూడా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క రంగులో ఉంటుంది. అలా ఉండడం వెనకాల కూడా ఒక అర్థం ఉంది. అది ఏంటంటే. ఆ చుక్కలు న్యూస్ పేపర్లో ప్రింట్ సరిగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక సంకేతం. అప్పుడప్పుడు ఆ చుక్కలు సరిగ్గా ప్రింట్ అవ్వవు. అంటే ప్రతి చుక్క వెనకాల నీడ లాగ మరొక చుక్క ప్రింట్ అవుతుంది. దాని అర్థం న్యూస్ పేపర్ లో ప్రింటింగ్ అలైన్మెంట్ సరిగా లేదు అని. మీరు సరిగ్గా గమనిస్తే ఆ చుక్కలు ఎప్పుడూ ఒకటే ఆర్డర్లో ఉంటాయి.
ఆ ఆర్డర్ ని సీఎంవైకె (CMYK) సీక్వెన్స్ అంటారు. ఇందులో.
C – సియాన్ (నీలి రంగు)
M – మెజెంటా (గులాబీ రంగు)
Y – ఎల్లో (పసుపు)
K – బ్లాక్ (నలుపు)
రంగులు ఉంటాయి. మీరు ఒకసారి న్యూస్ పేపర్ తీసి గమనించండి. కింద చుక్కలు పైన చెప్పిన ఆర్డర్ ప్రకారమే ఉంటాయి. అలాగే పైన చెప్పిన విధంగా చుక్కల ని బట్టి ప్రింట్ ఎలా ఉంది అనే దాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. కావాలంటే ఒకసారి ఇది కూడా ప్రయత్నించి చూడండి.