మల్లు భట్టి విక్రమార్క. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఒక బ్రాండ్ గా మారింది. పీపుల్స్ మార్చ్ పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. పార్టీలో కొత్త ఊపును తీసుకొచ్చింది. నేతల ఐక్యతకు వేదికగా నిలిచింది. ప్రజలతో మమేకం అవుతూ.. వారికలో ఒకరిగా నిలుస్తూ..సమస్యల పరిష్కారానికి స్వాంతన కల్పిస్తూ యాత్ర సాగింది. భట్టికి పార్టీ హైకమాండ్ యాత్ర వేళ ఇచ్చిన మద్దతు బరింత బలాన్నిచ్చింది. కొత్త నేతల చేరికకు ఈ యాత్ర ప్రేరణగా నిలిచింది. ప్రజలతో కలిసి పీపుల్స్ లీడర్ గా చేసిన మార్చ్..వందో రోజుకు చేరింది.

కాంగ్రెస్ కుటుంబానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు అదే పార్టీలో కీలకంగా మారారు. భట్టి సోదరుడు ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసారు. భట్టి వైఎస్సార్ హాయంలో చీఫ్ విప్ గా.. తరువాత డిప్యూటీ స్పీకర్ గా..తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ప్రస్తుతం నరనరాకన జీర్ణించుకున్న కాంగ్రస్ భావాలతో ఆ పార్టీని తెలంగాణలో అధికారం..తమ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయటం లక్ష్యంగా భారత్ జోడో యాత్ర స్పూర్తితో పీపుల్ మార్చ్ ప్రారంభించారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో మొదలైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిరాటంకంగా ముందుకు సాగుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తోంది.

గిరిజనులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వర్గాలు, అణగారిన ప్రజలతో భట్టి మమేకమయ్యారు. వారి నుంచి విక్రమార్క యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. ఆ స్పందనే అధికార బీఆర్ఎస్ లో గుబులు పెంచింది. తొలి నుంచి కాంగ్రెస్ నే నమ్ముకున్న ఈ వర్గాలు తిరిగి ఇప్పుడు భట్టి యాత్ర ద్వారా పార్టీకి దగ్గరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలందరికీ ఆప్తుడుగా ఉన్న భట్టి పాదయాత్ర నేతల ఐక్యతకు వేదికగా నిలిచింది. అందరినీ కలిపింది. పార్టీ కోసం పని చేయాలనే లక్ష్యాన్ని నూరిపోసింది. పట్టుదల పెంచింది. ఫలితంగా ఈ యాత్ర ద్వారా వస్తున్న స్పందన..పార్టీలో మార్పు హైకమాండ్ ను ఆకర్షించింది. పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే తో సహా పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. సభల్లో పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ సైతం భట్టి యాత్రపై ఆరా తీసారు. భట్టి పాదయాత్రతో వస్తున్న స్పందన పార్టీలో చేరికలను పెంచింది. పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు భట్టి చొరవ తీసుకున్నారు. మంతనాలు చేసారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటానికి కలిసి వచ్చేలా ఒప్పించారు. ఖమ్మం వేదికగా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు. భట్టి సొంత జిల్లాలో జరిగే సభకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ ,ప్రియాంక తరలి వస్తున్నారు. మండుటెండలో అస్వస్థతకు గురైనా స్వల్ప విరామం మినహా.. వెనుకడుగు వేయకుండా భట్టి యాత్ర కొనసాగింది. ఈ యాత్ర వంద రోజుల కాలంలో ఇంటి వైపు తిరిగి చూడలేదు. పండుగలు..జన్మదినాలు..సందర్భాలు ఏవైనా అన్నీ ప్రజల మధ్యనే నిర్వహించారు.
పీపుల్స్ మార్చ్ తో పార్టీలో..ప్రజల్లో భట్టి స్థానం మరో స్థాయికి చేరింది. ఎర్రటి ఎండను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వంద రోజుల్లో 1150 కిలోమీటర్లు పాదయాత్ర నేడు వందో రోజుకు చేరింది. వందో రోజు పాదయాత్ర నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. కాంగ్రెస్ లో చేరనున్న నేతలు భట్టిని పరామర్శించారు. భట్టి పట్టుదలన ప్రశంసించారు. మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల వేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ టు ఢిల్లీ భట్టి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వంద రోజుల యాత్ర ముగించిన భట్టికి పార్టీ శ్రేణులు..అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
























ఇంతకి విజయమ్మ ఎవరనే ప్రశ్న అందరిలో వస్తుంది అయితే ఈ విషయాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్’ అనే పుస్తకంలో వివరించారు. అందులో ఆమె వారి పెళ్లి విషయాలను వివరించారు.
వాస్తవానికి విజయమ్మ అసలు పేరు విజయలక్ష్మి. వారి ఫ్యామిలీ హిందూమతస్తులు. రాజారెడ్డి ఫ్యామిలీ క్రిస్టియన్లు. అందువల్ల వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో చేయాలనుకున్నారు. దాంతో పాస్టర్ను పిలిచారు. కాబోయే వధూవరుల పేర్లను పరిశీలించి, ఇద్దరు సమానంగా ఉండాలంటే అమ్మాయి పేరు మార్చాలని చెప్పారు. ఆ క్రమంలో విజయలక్ష్మి పేరును రాజేశ్వరిగా మార్చారు. అలానే పెళ్లి పత్రికలో కూడా ముద్రించారు. అంటే విజయమ్మే ఆ పత్రికలోని రాజేశ్వరి. 1972లో ఫిబ్రవరి 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు.
1. సుచేతా కృపలానీ – ఉత్తర ప్రదేశ్ :
2. నందిని సత్పతీ – ఒడిశా :
3. శశికళ కకొడ్కర్ – గోవా :
4. అన్వారా తైమూరు – అసోం :
5. వి.ఎన్.జానకి రామచంద్రన్ – తమిళనాడు :
6. జె. జయలలిత – తమిళనాడు:
7. మాయావతి – ఉత్తర ప్రదేశ్:
8.రాజేంద్ర కౌర్ భట్టల్ – పంజాబ్:
9. రబ్రీదేవి – బీహార్:
10. సుష్మా స్వరాజ్ – ఢిల్లీ:
11. షీలా దీక్షిత్ – ఢిల్లీ :
12. ఉమాభారతి – మధ్య ప్రదేశ్ :
13. వసుంధర రాజే – రాజస్థాన్ :
14. మమతా బెనర్జీ – పశ్చిమ బెంగాల్ :
15. ఆనందిబెన్ పటేల్ – గుజరాత్ :
16. మెహబూబా ముఫ్తీ – జమ్మూ, కాశ్మీర్ :
Also Read: 
