మలయాళ సినిమాలకు ప్రస్తుతం తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ లభిస్తుంది. ఓటిటి ట్రెండ్ మొదలైన తర్వాత మలయాళ సినిమా ప్రతిదీ తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలకు పట్టం కడుతున్నారు.
మలయాళ సినిమాలో ఉండే సహజత్వం మన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంటుంది. సింపుల్ పాయింట్‌ను పట్టుకుని చివరి వరకు ఇంట్రెస్టింగ్గా కథని నడిపించడం మలయాళ సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది.
సెప్టెంబర్ 15న థియేటర్లో రిలీజ్ అయిన కాసర్ గోల్డ్ అనే సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూసేద్దాం…!పైసల్ (సన్నీ) ఓ మధ్యతరగతి యువకుడు. భార్య, తల్లి, చిన్న పాప ఇది అతని కుటుంబం. కులాంతర వివాహం చేసుకున్న ఫైజర్ ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకపక్క కూతురు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అతనికి అత్యవసరంగా డబ్బు కావాలి. ఆ ఆపదనుండి బయటపడే మార్గం కోసం అతను వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఒక ముఖ్యమైన పనిమీద పక్క ఊరికి వెళ్లి వస్తానని స్నేహితులతో కలిసి కారులో బయలుదేరుతాడు. ఇక ఆ జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న మోసా (సిద్ధికి) ఆ పార్టీ జిల్లా సెక్రటరీగా ఉన్న నారాయణ కలిసి బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ల మనుషుల ద్వారా దుబాయ్ నుండి భారీగా బంగారం వస్తుంది. ఈ వ్యవహారం అంతా అల్బి (ఆసిఫ్ అలీ) పర్యవేక్షణలో నడుస్తూ అతని లవర్ నాన్సీ (మాళవిక శ్రీనాథ్) కూడా ఇందులో కీలకంగా ఉంటుంది. దుబాయ్ నుండి రెండున్నర కోట్లు ఖరీదు చేస్తే బంగారాన్ని ఆమె అక్రమంగా తీసుకొస్తుంది.
అల్బీ- నాన్సీ ఇద్దరు ఎయిర్ పోర్ట్ నుండి బంగారంతో వస్తుండగా అదే రోడ్లో వారికి ఎదురుగా ఫైజల్ ప్రయాణిస్తున్న కారు వస్తుంది. రెండు కార్లు ఢీ కొట్టుకోవడంతో అల్బి – పైసల్ ఫ్రెండ్స్ గొడవపడతారు. గొడవ సద్దుమణిగాక తమ కారులో బంగారం లేకపోయేసరికి అల్బీ-నాన్సీ ఆశ్చర్యపోతారు.యాక్సిడెంట్ జరిగిన సమయంలో పైసల్ బ్యాచ్ ఆ బంగారాన్ని లేపేసి ఉంటుందని భావించి ఈ విషయాన్ని ఎమ్మెల్యేకి చెబుతారు.
కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం మాయం అవ్వడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసహనానికి గురై పైసల్ బ్యాచ్ ను పట్టుకోవడానికి ఒక పక్క తన రౌడీ గ్యాంగ్, మరోపక్క సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ అలెక్స్ (వినాయక న్ )ను నియమిస్తాడు. అయితే ఎమ్మెల్యేకి అల్బీపై కూడా అనుమానం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పైసల్ ఆ బంగారాన్ని కాజేసాడా? తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి అల్బీ ఆ బంగారం నొక్కేసాడా? ఆ బంగారం ఎవరి జీవితాలతో ఎలా ఆడుకుంది? అనేది మిగతా కథ.
కథపరంగా చూస్తే ఇంతేనా అనిపిస్తుంది కానీ దర్శకుడు మృదుల నాయర్ ఈ కథను పిట్ట కథతో మొదలుపెట్టిన విధానం అక్కడి నుంచి కథను నడిపించిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.
ఒకవైపు అల్బీ తన లవర్ తో కలిసి అందమైన జీవితం ఊహించుకుంటాడు, మరోవైపు తన ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలని డిసైడ్ అయిన ఫైజల్, తన బంగారం దక్కాలని పట్టుదలతో ఎమ్మెల్యే, బంగారం దొరికితే తన సస్పెన్షన్ పోతుందని బయలుదేరిన పోలీస్ ఆఫీసర్. ఇలా ఈ నాలుగు పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఈ కథలో ఎమోషన్స్ ను యాక్షన్స్ ను టచ్ చేస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతూ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. ఒక దశ దాటాక ప్రేక్షకులకు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది తెలిసిపోతుంది. అయినా ఈ సంఘటన నుండి పాత్రలు ఎలా బయటపడతాయి అనే ఒక టెన్షన్ క్రియేట్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ మంచి మార్కులు కొట్టేస్తాయి.
ప్రధాన పాత్రలో పోషించిన వాళ్లంతా చాలా న్యాచురల్ గా ఆక్ట్ చేశారు. విష్ణు విజయ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. జేబిన్ జాకబ్ కెమెరా వర్క్ బాగుంది. అంతర్లినంగా సందేశం ఇవ్వడానికి దర్శకుడు ట్రై చేశాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీస్ లో ఈ సినిమాకి చూడు దక్కుతుంది.సస్పెన్స్ ట్విస్టులు ఎంజాయ్ చేసేవారు ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు.
Also Read:విజయ్ – లోకేష్ కనగరాజ్” కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!