ఇండియాలో క్రికెట్ అంటే ఒక మతం అని అంటారు. ఏ క్రీడకు లేని క్రేజ్, పాపులారిటీ క్రికెట్ కు ఉందనడం అతియోశక్తి కాదు. భారత్ క్రికెటర్లు ధరించే నీలిరంగు జెర్సీని ఇష్టపడని క్రికెట్ ఫ్యాన్ ఉండరేమో. అయితే ఈ బ్లూ జెర్సీని ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నప్పటికీ, ఈ జెర్సీ పైన ఉండే మూడు స్టార్స్ ఎందుకు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదని చెప్పవచ్చు.
బ్లూ జెర్సీకి కుడివైపున్న ఉన్న బీసీసీఐ లోగో పైన మూడు స్టార్స్ ను 2011 తరువాత ముద్రించారు. అయితే ఈ మూడు స్టార్స్ ను ఎందుకు భారత జట్టు జెర్సీ పై రూపొందించారు. ఈ 3 స్టార్స్ దేనిని సూచిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ స్పోర్ట్స్ యాక్సెసరీస్ తయారీ కంపెనీ ‘నైక్’ 2011 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించిన తర్వాత భారత క్రికెటర్ల జెర్సీ పై ఈ మూడు స్టార్లను పరిచయం చేసింది. అలా ముద్రించడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ఇండియా మూడు ప్రపంచ కప్ లను గెలుచుకుంది.
1983లో ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి భారత జట్టు తొలి ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. గ్రేట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు ఈ కప్ గెలిచింది. 2007లో భారత జట్టు తొలి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంతో రెండవ ప్రపంచకప్ విజయం సాధించింది. 2011లో వాంఖడే స్టేడియంలో ఎం ఎస్ ధోని సారధ్యంలో భారత క్రికెట్ జట్టు మూడవ ప్రపంచ కప్ ను సాధించింది.
మూడు ప్రపంచ కప్ లు గెలుచుకోవడంతో మూడు స్టార్లను భారత జెర్సీలో రూపొందించారు. అది మాత్రమే కాకుండా గ్రౌండ్ లో క్రికెటర్లకు స్ఫూర్తి నింపేందుకు గాను ఈ మూడు నక్షత్రాలను జెర్సీలో రూపొందించారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇప్పటివరకు 5 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అందుకే ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు లోగోలో 5 నక్షత్రాలు ఉన్నాయి. వాస్తవానికి పుట్‌బాల్‌లో ఈ సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది.
Also Read: మొన్న ఏమో వాటర్‌బాయ్… ఇప్పుడు ఏమో..? ఏంటి కోహ్లీ ఇది..?

ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడంతో విరాట కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కి దిగడానికి రెడీ అయ్యారు. కానీ మొదటి వన్డేలో కోహ్లి బ్యాటింగ్ కి రాకముందే టీం ఇండియా విజయం సాధించింది. దాంతో విరాట్ బ్యాటింగ్ చూసే ఛాన్స్ అభిమానులకు దొరకలేదు. ఇక ఆ తరువాత జరిగిన రెండో వన్డేలో వీరిద్దరిని విశ్రాంతి పేరుతో మ్యాచ్ కు దూరంగా ఉంచారు. కానీ ఆ మ్యాచ్ లో భారత జట్టు ఘోరమైన పరాజయాన్ని పొందింది.
చివరిది అయిన మూడవ మ్యాచ్ లో కూడా మళ్ళీ వీరిద్దరికి విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ సిరీస్ మొత్తంలో కోహ్లీ ఆటను చూడాలనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయ్యింది. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రెండో వన్డేలో పరాజయం పొందినా, మూడవ వన్డేలో మాత్రం 200 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ ను కైవసం చేసుకోవడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.
ఇదిలా ఉండగా, మైదానంలో కోహ్లీ బ్యాటింగ్ చూడలేకపోయినా, మొదటి వన్డేలో వాటర్‌బాయ్ గా విరాట్ కోహ్లి కనిపించాడు. అలాగే ఆఖరి వన్డేలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోకి ‘‘కోహ్లీ గ్రౌండ్ లో ఉంటే చాలు, కానీ బ్యాటింగ్ మెరుపులను మిస్ అవుతున్నాం’’ అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.



కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ లో వన్డే ప్రపంచకప్ ఇండియాలో జరగనుందని, ఇప్పటి నుంచే దాని కోసం ప్రిపేర్ అవుతున్నట్లుగా తెలిపాడు. ఈ క్రమంలోనే అందరికీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నామని, ఆ కారణంతోనే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసినట్లు వెల్లడించాడు. వరల్డ్ కప్ కోసం ప్లేయర్ల సత్తాను టెస్ట్ చేస్తామని, ఫలితాలపై రాజీపడనని అన్నారు.
ఒక వైపు ఆటలో ప్రయోగాలు చేస్తూ, ఇంకో వైపు గెలుపు కోసం కష్టపడతామని పేర్కొన్నాడు. అలాగే రోహిత్ శర్మ ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు చేయడం పైన స్పందించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ తనకు కొత్త కాదని, కెరీర్ మొదట్లో 7వ స్థానంలోనే బ్యాటింగ్ చేసేవాడినని తెలిపాడు. మొదటి వన్డేలో బ్యాటింగ్ చేసినపుడు ఆ రోజులు గుర్తుకు వచ్చాయని అన్నాడు. కానీ అందరికీ అన్నిమ్యాచ్లలో అవకాశాలు వస్తాయని గ్యారంటీగా చెప్పలేమని అన్నాడు.
సంజు శాంసన్‌ను మొదటి వన్డేలో ఎందుకు ఆడించలేదు అని మీడియా అడుగగా, ఎడమ, కుడి కాంబినేషన్ కోసమే అతన్ని పక్కన పెట్టినట్లుగా తెలిపాడు. ప్రపంచ కప్ నేపథ్యంలో ఎలాంటి డౌట్స్ లేకుండా జట్టు కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవాలని భావిస్తున్నటు రోహిత్ తెలిపాడు. ఇషాన్ కిషన్ మొదటి వన్డేలో బాగా ఆడాడని అతని పై ప్రశంసలు కురిపించాడు.
ఎంఎస్ ధోనీ 1981లో జూలై 7న రాంచిలో పాన్ సింగ్, దేవకీ దేవిలకు జన్మించాడు. ధోనీకి అక్క జయంతి గుప్తా మరియు అన్న నరేంద్ర సింగ్ ధోని కలరు. ధోని తండ్రి పాన్ సింగ్ చిన్న ప్రభుత్వోద్యోగిగా పని చేశారు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలన్నీ వారు అనుభవించారు. ధోనికి టికెట్ కలెక్టర్‌గా జాబ్ వచ్చినా, ధోనికి చిన్నతనం నుండే క్రికెటర్ కావాలని, ఎప్పటి కైనా దేశం కోసం ఆడాలని బలంగా కోరుకునేవాడు. ఈ విషయం తన తండ్రికితో చెప్తే, ఇవి మనకు సాధ్యం కావని వెనుకడుగు వేశారట.
అలాంటి సమయంలో తమ్ముడు ధోనీకి జయంతి గుప్తా అండగా నిలిచింది. వారి తల్లిదండ్రులకు తమ్ముడి ఆశయం గురించి నచ్చజెప్పి, వాళ్లకు అర్ధమయ్యే విధంగా చేసింది. ధోనికి ఎటువంటి సహాయం అవసరమైన ఆమె ముందుండేది. అలా ఇంట్లో వాళ్లందరిని ఒప్పించి, ధోని క్రికెటర్ గా ప్రయాణం ప్రారంభించిన సమయంలో జయంతి గుప్తా అతనికి ఆర్థికంగా, నైతికంగానూ అండగా నిలిచింది. అలా కెరీర్ మొదలు పెట్టిన ధోనీ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెటర్లలో ఒకరిగా ఉన్నారు.
ధోనీ ఆస్తి విలువ 1000 కోట్ల పైగా ఉన్నప్పటికీ, జయంతి గుప్తా మాత్రం తక్కువ ప్రొఫైల్‌ను మెయింటెన్ చేస్తూ, మీడియాకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రస్తుతం రాంచీలోని ఒక గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారని నేషనల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. జయంతి గుప్తా ధోని ప్రాణ మిత్రుల్లో ఒకరైన గౌతం గుప్తాను పెళ్లి చేసుకుంది. జయంతితో పాటు గౌతం కూడా దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో ధోనికి అండగా నిలచినట్లు కొన్ని వార్తా కథనాలు వెల్లడించాయి. ధోని బయోపిక్ మూవీలో కూడా జయంతి గుప్తా క్యారెక్టర్ ఉన్న విషయం తెలిసిందే.
ధోని పేరుతో ఉన్న ఒక ఓల్డ్ అపాయింట్మెంట్ లెటర్ తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది 2012కు సంబంధించిన లెటర్. ఇండియన్ సిమెంట్స్ సంస్థలో ధోనిని వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు సెలెక్ట్ చేసినట్లుగా ఆ లెటర్లో ఉంది. ఈ పోస్టుకి నెలకు శాలరీ రూ. 43వేలు (రూ.12,650-47,650)గా ఉంది.
జీతంతో పాటుగా స్పెషల్ పే రూ 20వేలు అని, ఫిక్స్డ్ అలెవెన్స్ రూ. 21,970 అని ఉంది. ఇవీ మాత్రమే కాకుండా హౌస్ రెంటల్ అలెవెన్స్ కి రూ.20,400, ప్రత్యేక హౌస్ రెంట్ అలెవెన్స్ కి రూ.8,400 (సబ్ ప్లాంట్స్‌లో వరక చేసినట్లయితే అదనంగా మరో రూ.8 వేలు) వార్తా పత్రిక ఖర్చులకు గాను 175 రూపాయలు, బెనిఫిట్స్ లేని ప్రత్యేక అలెవెన్స్ కి గాను 60వేల రూపాయలు ఇవ్వనున్నట్లు అపాయింట్మెంట్ లెటర్లో తెలిపారు.
మొత్తంగా చూస్తే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి గాను ధోని దాదాపు లక్షా 60వేల రూపాయలకు పైగా నెల జీతంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఈ లెటర్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఆ సమయానికి వేల కోట్లు ఆర్జిస్తున్న ధోని ఈ ఉద్యోగం చేశాడా లేదా అన్న విషయాన్ని పక్కన బెడితే, ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా ధోని బ్రాండ్ వాల్యూను ఈ లెటర్ తెలియచేస్తోంది. ఇండియా సిమెంట్స్ అనేది చెన్నై సూపర్‌కింగ్స్‌కు అనుబంధ సంస్థ.

చాలా రోజుల నుండి ఐపీఎల్ నుండి ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ధోని ఈ సంవత్సరమే తప్పుకోవాల్సింది. కానీ తదుపరి జట్టు కెప్టెన్ ఎవరు అనే విషయం పై స్పష్టత రాకపోవడంతో ధోనీ తన రిటైర్మెంట్ ను వాయిదా వేసుకున్నారని, అది ఇప్పుడు పూర్తి అయ్యిందని, అందువల్ల ధోని ఎప్పుడైనా తప్పుకోవచ్చు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అంబటి రాయుడు, సిఎస్కే నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూనే, యువ క్రికెటర్ పై ప్రశంసలు కురిపించి, పరోక్షంగా అతనే తదుపరి కెప్టెన్ అని తెలిపాడు. యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ పై రాయుడు ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ ధోనీలా ప్రశాంతంగా ఉంటాడని అన్నారు. అతనిలో లీడర్ షిప్ లక్షణాలు దాగున్నాయని, ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ల సహాయంతో రుతురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎక్కువ కాలం సేవలు అందించగలడని వెల్లడించారు.
ఆసియన్ గేమ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ భారత పురుషుల టీమ్ కు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమ్ ఇండియా ప్రదర్శన మీదనే రుతురాజ్ సీఎస్కే కెప్టెన్సీ ఆధారపడి ఉంటుంది. టీమిండియా ఒకవేళ స్వర్ణం సాధించినట్లయితే సిఎస్కే నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు జవాబు దొరికినట్లే.
1. అంబటి రాయుడు:
2. కరుణ్ నాయర్:
3. వసీం జాఫర్:
4. ఇర్ఫాన్ పఠాన్:
5 . దినేష్ కార్తీక్:
అప్పటికే జట్టులో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. దాంతో కార్తీక్ ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇక ధోనీ ఉండడం వల్ల అతను వికెట్ కీపర్‌గాను రెండవ స్థానంలో ఉండేవాడు. ఎంతో ప్రతిభ ఉన్నా దినేష్ కార్తీక్ భారత అత్యంత దురదృష్టకర క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు.