ఐపీఎల్-16 లో సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌ను ధోని సారథ్యంలోని చెన్నై జట్టు నెగ్గింది. 227 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆరంభం పేలవంగా ఉన్నా ఆ జట్టు సారథి ఫాఫ్ డుప్లెసిస్ – గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ల పోరాటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది.

Video Advertisement

 

 

ఒక దశలో గెలుపుకి చేరువైంది బెంగళూరు జట్టు. కానీ చివర్లో తడబడి ఓటమి కొనితెచ్చుకుంది. కేవలం 8 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. ఆర్సీబీ ఓడినా ఆ జట్టు పోరాటం అభిమానులను ఆకట్టుకుంది. అలాగే బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పక్కటెముక గాయం తో కూడా అద్భుతమైన ఆటతీరుని కనబరిచాడు.

what is the meaning of faf du plessis new tattoo meaning..!!

13వ ఓవర్లో అతడు 56 పరుగుల వద్ద ఉండగా కడుపు నొప్పి వేధించడంతో చాలా ఇబ్బంది పడ్డాడు డుప్లెసిస్. అప్పుడు ఆ జట్టు ఫిజియో వచ్చి డుప్లెసిస్ కడుపునకు బ్యాండేజీ కట్టాడు. ఆ సమయం లో అందరి ద్రుష్టి డుప్లెసిస్ రిబ్స్​ మీద ఉన్న టాటూ పై పడింది. డుప్లెసిస్ కి ఇప్పటికే చాలా టాటూ లు ఉన్నాయి. కానీ ఈ కొత్త టాటూ కి అర్థం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు.

what is the meaning of faf du plessis new tattoo meaning..!!

 

సోషల్ మీడియాలో చర్చల తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ టాటూ అరబిక్ భాషలోని ఒక పదమట. దీని అర్థం ఫజెల్ (దేవుడి దయ). దేవుడి దయ వల్ల తన లైఫ్​లో ఊహించని సానుకూల మార్పులు జరగడం వల్ల డుప్లెసిస్ ఈ పచ్చబొట్టును వేయించుకున్నాడని అంటున్నారు. అలాగే తన జీవితం లోని ముఖ్యమైన సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఆయన అనేక టాటూలని వేయించుకున్నారు అని ఆయన ఫాన్స్ పేర్కొంటున్నారు.

what is the meaning of faf du plessis new tattoo meaning..!!

ఇక ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఇటీవల ‘ఫాఫ్‌: త్రూ ఫైర్‌’ (Faf: Through Fire) పేరుతో ఆటోబయోగ్రఫీ రాశాడు. ఇందులో క్రికెట్‌కు, ప్లేయర్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అందులో తన జీవితం, క్రికెట్ కి సంబంధించిన పలు కీలక ఘట్టాలను పంచుకున్నారు డుప్లెసిస్.