రైలులో దూర ప్రాంతాలు ప్రయాణించే ప్రయాణికులు ఆహారం కోసం రైల్వే క్యాటరింగ్ లో బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆ రైళ్లలో ఉండే కిచెన్ లోనే వండి ప్రయాణికులకు భోజనాన్ని అందిస్తారు. ఎప్పుడూ ప్రయాణికులకు పంపిణీ చేసే ఆహార పదార్థాలపై తరచూ ఫిర్యాదులు వస్తూ ఉంటాయి.
ఆహారా నాణ్యత బాగాలేదని, ఏమో పదార్థాలు కలిసాయని ఫిర్యాదులు అందుతూ ఉంటాయి. ఇటీవల ఓ రైలు వంటగదిలో కనిపించిన దృశ్యం ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తుంది. ఆ రైలు కిచెన్ లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

టెండూల్కర్ అనే వ్యక్తి ఇటీవల తన కుటుంబంతో కలిసి మడగావ్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణించారు. ఆ రైల్లోని కిచెన్ వైపుగా ఎలకలు వెళ్లడాన్ని అతను గమనించాడు. అతను వెళ్లి చూడగా ఆహార పాత్రలపై రెండు ఎలుకలు తిరగడంతో పాటు అందులోని పదార్థాలను తింటున్నాయి. దీంతో వెంటనే ఆ దృశ్యాలను తన ఫోన్ లో రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

“రైలు పాంట్రీలో దాదాపు 7 ఎలకలు ఆహార పాత్రలపై తిరుగుతూ కనిపించాయి” అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ పైన IRCTC స్పందించింది.ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందికి అవగాహన కల్పించి మళ్లీ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇలాంటి ఘటనలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాము టిక్కెట్ తో పాటు డబ్బు వెచ్చించి భోజనాన్ని బుక్ చేసుకుంటున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Also Read:ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?

















17























ప్రముఖ హాస్యనటుడు అలీ సినిమాలతో పాటుగా, బుల్లితెర పై పలు షోలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఆయన తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటించి, పాపులర్ అయ్యారు. పలు టెలివిజన్ షోలకు హోస్ట్ గా చేసిన అలీ పారితోషికం కూడా భారీగానే ఉందనే విషయం తెలిసిందే. ఆయన సతీమణి జుబేదా కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
యూట్యూబ్ లో సొంత ఛానెల్ ప్రారంభించిన జుబేదా తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యారు. తన ఛానెల్ లో ఎక్కువగా వంటల వీడియోలు మరియు హోం టూర్ వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. నటుడు అలీ, జుబేదా ఇద్దరు తాము సంపాదించిన దాని నుండి కొంత డబ్బుతో సేవా కార్యక్రమాల కూడా చేస్తుంటారు. ఏడు రోజుల క్రితం జుబేదా తన ఛానెల్ లో ఎగ్ ధమ్ బిర్యానీ వంటకాన్ని తయారు చేశారు. వంట పూర్తయ్యాక దానిని ప్యాక్ చేసి, కొంతమంది పేదవారికి పంచిపెట్టారు.
ఈ వీడియోకి ఏకంగా మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు జుబేదా చేసిన మంచి పనికి ఫిదా అవుతున్నారు. ఆమె ఇలాగే పేదలకు సహాయం చేయాలని కామెంట్లు చేస్తున్నారు. చాలా మందికి జుబేదా స్పూర్తిగా నిలిచారని కొందరు నెటిజెనలు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అలీ కెరీర్ లో మరింత విజయాన్ని సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడిపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నెలరోజులు దాటిన ఆయనకు బెయిల్ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, ఆయన అభిమానులు నిరసనలు, ఆందోళన తెలుపుతున్నారు. ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా ఆయన మద్ధతుదారులు నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు స్త్రీల మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలో వారిద్దరూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి నెల దాటినా, ఇప్పటికి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని వారి ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. చంద్రబాబు అరెస్టు పై ఇప్పటికీ రెస్పాండ్ కాలేదు అని తిడుతూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌ను వెళ్ళగక్కారు. వారిలో ఒక మహిళ, నోరు తెరిస్తే ధర్మం, హిందుత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రధాని,
తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అరాచకాల గురించి ఒక్కసారైన మాట్లాడలేదని అన్నారు. ఇండియా వరల్డ్ లో టాప్ 3 ప్లేస్ కి వచ్చిందని అంటారు. కానీ రోడ్ల పై నడిచే మహిళలకు టాయిలెట్లు కూడా లేని పరిస్థితిలో ఉందని ఇంకో మహిళ అన్నారు. ప్రపంచంలో 3 స్థానం కాదు, ముందు రోడ్ల పై వెళ్ళే స్త్రీల కోసం టాయిలెట్లు కట్టించి, గొప్పలు చెప్పుకోవాలి అని తన కోపాన్ని బయటపెట్టింది. వీళ్ల సీరియస్ చర్చను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అయితే బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దైవంగా భావిస్తారు. ఆ విషయాన్ని పలు ఈవెంట్స్ లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ తాజాగా వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శల పై స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో వీడియోని పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ” నమస్కారం, నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన, ఒకటే బాధ, ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే, నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది. చిరాకు వేస్తోంది. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడు, దైవసమానులు అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్ మీరు పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు మీకు అద్భుతమైన హోదాను ఇచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను, మీకు చెప్తాను.
నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు, దశాబ్దాల పాటు ఆయనతో తిరుగుతున్నాను. ఆయన చాలా నిజాయితీపరుడు, నీతివంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఆ కష్టం నాదే అని ముందుకెళ్ళే వ్యక్తి, భోళా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి. అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే, అని నేను భావిస్తున్నాను. ఉరికురికే అదొక్కటే రీజన్, మరొకటి లేదా, పదే పదే అదే విషయం మాట్లాడటం, చాలా బాధ పడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను.
పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి. దేశం కోసం బతుకుతున్న మనిషి. ఏ రోజు స్వార్ధంతో కానీ, స్వలాభంతో కానీ ఏ పని చేయడు, అలా మాట్లాడటం కానీ, ఆయన మాటల్లో, చేతల్లో కానీ చూడలేదు. హాయిగా షూటింగ్‌లు చేసుకుంటూ, సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ, హాయిగా బ్రతకండి అని చెబుతూండేవాన్ని.వెయ్యేళ్లు బ్రతుకుతామా, మనం పోయినా కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకోవాలని, జనానికి ఏదైనా చేయాలని అనేవారు. ఆయన ఆలోచనలన్నిటిని నీతిగా, నిజాయితీగా అడుగాడుగు పేర్చుకుంటూ, భరిస్తూ, సహిస్తూ తలవంచుకుని జనం కోసం బ్రతకాలని, రాత్రిపగలు కష్టపడుతున్నాడు.
నిస్వార్ధంగా కష్టపడుతున్నాడు. రాత్రిపగలు షూటింగ్స్ చేసి ఆయన సంపాదించిన డబ్బుని పార్టీకి ఖర్చు పెడుతున్నాడు. ఎవరి దగ్గరా, ఏ విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, పార్టీని నడుపుతున్న మహానుభావుడు. దయచేసి, ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కష్టంలో ఉన్నా అంటే సహాయం చేస్తాడు. ఆయనకు లేనిది ఒకటే కులాభిమానం. భారతీయులంతా ఒక్కటే, మనం మనుషులం, మనుషులుగానే బ్రతకాలని చెప్పేవారు.
ఆయనకు గాని కుల పిచ్చి ఉంటే నన్ను ఆదరించేవాడా? నాకీ హోదా ఇచ్చేవాడా? నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి, తెలిసి తెలియకుండా, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని, మనసున్న వ్యక్తి పై అభాండాలు వేయకండి. నేను జనసేన వ్యక్తిని కాదు, కార్యకర్తని కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ నిర్మాతని, పవన్ కళ్యాణ్ మనిషిని” అంటూ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





