స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాల నటుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అలీ, తనదైన కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అలీ పరిమితంగానే  సినిమాలలో నటిస్తున్నప్పటికీ, పలు బుల్లితెర షోలతో బిజీగా ఉన్నారు.

Video Advertisement

అలీ సతీమణి జుబేదా తన యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా పాపులర్ అయ్యారు. తాజాగా జుబేదా బిర్యానీ ప్యాకెట్లను పేదలకు పంచిపెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ హాస్యనటుడు అలీ సినిమాలతో పాటుగా, బుల్లితెర పై పలు షోలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఆయన  తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటించి, పాపులర్ అయ్యారు. పలు టెలివిజన్ షోలకు హోస్ట్ గా చేసిన అలీ పారితోషికం కూడా భారీగానే ఉందనే విషయం తెలిసిందే. ఆయన సతీమణి జుబేదా కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
యూట్యూబ్‌ లో సొంత ఛానెల్ ప్రారంభించిన జుబేదా తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యారు. తన ఛానెల్ లో ఎక్కువగా వంటల వీడియోలు మరియు హోం టూర్ వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. నటుడు అలీ, జుబేదా ఇద్దరు తాము సంపాదించిన దాని నుండి కొంత డబ్బుతో సేవా కార్యక్రమాల కూడా చేస్తుంటారు. ఏడు రోజుల క్రితం జుబేదా తన ఛానెల్ లో ఎగ్ ధమ్ బిర్యానీ వంటకాన్ని తయారు చేశారు. వంట పూర్తయ్యాక దానిని ప్యాక్ చేసి, కొంతమంది పేదవారికి పంచిపెట్టారు.
ఈ వీడియోకి ఏకంగా మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు జుబేదా చేసిన మంచి పనికి ఫిదా అవుతున్నారు. ఆమె ఇలాగే పేదలకు సహాయం చేయాలని కామెంట్లు చేస్తున్నారు. చాలా మందికి జుబేదా స్పూర్తిగా నిలిచారని కొందరు నెటిజెనలు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అలీ కెరీర్ లో మరింత విజయాన్ని సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.

watch video:

Also Read: “గుప్పెడంత మనసు” సీరియల్ లో ఇంకో పెద్ద షాక్..! ఇలా ఎందుకు చేశారు..?