సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా మీద అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోను భారీ అంచనాలు ఉంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వాటిని అందుకోవడంలో రజినీకాంత్ వెనకబడుతున్నారు. తాజాగా రజినీకాంత్ జైలర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ మూవీని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ నటించారు. నేడు విడుదల అయిన ఈ మూవీ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటించారు. మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్, కన్నడ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్, బలివుడ్ నుండి జాకీష్రాఫ్ నటించారు. రజిని కాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించగా, హీరోయిన్ తమన్నా, టాలీవుడ్ నటుడు సునీల్ కూడా ఈ మూవీలో నటించారు. విలన్ గా మలయాళ నటుడు వినాయకన్ నటించారు.
మొదట ఈ మూవీ పై అంతగా అంచనాలు లేనప్పటికీ, టీజర్, సాంగ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో ‘కావాలయ్యా’ సాంగ్ 100 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే షోలు ప్రారంభం కావడంతో జైలర్ మూవీ చూసిన వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. కొందరు నెటిజెన్లు ఫస్ట్ హాఫ్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్వల్ సన్నివేశంలో వింటేజ్ రజినీకాంత్ కనిపిస్తాడని, స్క్రీన్ ను షేక్ చేశాడని అంటున్నారు. మరికొందరు ఈ మూవీ రజినీకాంత్ అభిమానులకి ఫుల్ ఫీస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ఏమిటో మీరు చూసేయండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: JAILER REVIEW : “రజినీకాంత్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!








సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘బిజినెస్ మేన్’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు యాక్షన్. డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలు థియేటర్లలో రి రిలీజై సెన్సేషన్ సృష్టించగా, ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అవుతున్న బిజినెస్ మేన్ సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో కోటి రూపాయల గ్రాస్ మార్క్ ను దాటిందని తెలుస్తోంది.
హైదరాబాద్ లో 172 షోలు పడుతుండగా, వీటిలో 110 హౌస్ ఫుల్స్ అయినట్టు తెలుస్తోంది. మహేష్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు బిజినెస్ మేన్ మూవీ రీరిలీజ్ పై పలు మీమ్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. సోమవారం (ఆగస్టు 7) నాడు రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయం పై చర్చ జరుగగా, మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేసారు. ఓటింగ్ ముందు సీరియస్ గా జరిగిన చర్చలో 90 ఏళ్ల వయసులోనూ పాల్గొన్నారు. ఆయన మౌనంగా రాజ్యసభలో జరిగిన చర్చను నిశితంగా గమనించి, ఆ తరువాత ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన అనారోగ్యాన్ని పట్టించుకోకుండా, తన బాధ్యతను నెరవేర్చడం కోసం వచ్చిన మన్మోహన్ సింగ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు పార్లమెంట్ కు రాకుండా ఉంటారని, కానీ 90 సంవత్సరాల వయసులో ఉన్న మన్మోహన్ సింగ్ ను చూసి వారు నేర్చుకోవాలని నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. సెప్టెంబర్ లో మన్మోహన్ సింగ్ 91వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో ఆ బిల్లును ఆమోదముద్ర కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు. ఈ బిల్లుతో దేశరాజధాని డిల్లీలోని పరిపాలన యంత్రాంగం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక పై కేజ్రీవాల్ ప్రభుత్వ నియంత్రణ ఢిల్లీ ఉద్యోగుల పై నామమాత్రంగా ఉంటుంది.
కరాటే కళ్యాణి ప్రజాకవి గద్దర్ మరణ వార్త తెలిసి, ముందుగా పద్ధతిగా ఆయన మరణానికి బాధపడుతూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు. కాసేపటికి ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో గద్దర్ ఫ్యాన్స్ కరాటే కళ్యాణి పై మండిపడ్డారు.
‘మనిషి మరణిస్తే ఇలాంటి పోస్ట్ చేస్తావా? అందువల్లే కదా అందరూ నిన్ను తిట్టేది.. పోయినవాళ్ళని తిట్టడానికి ఎలా మనసు వస్తుంది. నువ్వు అసలు మనిషివేనా? అని ఓరేంజ్‌లో ఆగ్రహిస్తున్నారు. అయితే గద్దర్ అభిమానులు చేస్తున్న కామెంట్లపై కరాటే కళ్యాణి స్పందిస్తూ ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టింది. ఆ లైవ్ లో గద్దర్ పాటల పై, గద్దర్ కుమారుడి పై వివాదాస్పద కామెంట్స్ చేసింది. గద్దర్ పాటలతో ఎంతోమంది ప్రభావితం అయ్యి, అడవిబాట పట్టారు. అంతమంది అడవిదారి పడితే, మరి గద్దర్ కుమారుడు అమెరికాలో ఉన్నారు.
తాను అయితే ఏ విషయం అయినా మొదట మనం పాటించి, ఆ తరువాత అమలు పరచాలని భావిస్తాను. కానీ గద్దర్ అందర్నీ అడవిదారి పట్టించి, తన కుమారుడిని మాత్రం అమెరికాకు పంపించారు. సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్లన్ని అందరికీ నచ్చనవసరం లేదు. అందరికి నచ్చేలా పోస్ట్‌లు పెట్టలేం, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. అలాంటి వారి కోసం తన పద్దతిని మార్చుకోనని, ఎవరు తిట్టినా పట్టించుకోనని, తన పోస్ట్‌లు తన ఇష్టం అని చెప్పుకొచ్చారు.
విశాఖలోని వన్‌టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ మర్డర్ కేసులో వీడియో లభించిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో చూసిన పోలీసులు, రమేష్ వైఫ్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. లవర్ రామారావుతో కలిసి రమేష్ భార్య మంగళవారం రాత్రి భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ ను చంపడం కోసం ముందుగానే తన లవర్ తో కలిసి శివాని కుట్ర పన్నింది. హత్య విషయంలో తన పై సందేహం రాకుండా హత్య చేయకముందే రమేష్ తో చాలా ప్రేమగా ఉన్నట్లు వీడియో తీసింది.
మంగళవారం నాడు రాత్రి మటన్ కర్రీ చేసి, భర్తకు పెట్టి, మద్యం తాగించింది. తాను చాలా మంచిదని, మై వైఫ్, మై లైఫ్ అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డు చేసింది. ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న భర్తను తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మర్దర్ కేసు తనపై పడకుండా ఉండడం కోసమే, తాను మంచిదాన్ని అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డ్ చేసినట్లు శివాని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. దీంతో శివాని తెలివితేటలకు అందరూ షాక్ అవుతున్నారు.
విచారణలో శివాని తనకు పెద్దమ్మ కూతురు పైడమ్మ వల్లే రామారావుతో పరిచయం అయ్యిందని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రమేష్ మర్డర్ ఈ హత్య కేసులో పైడమ్మ హస్తం కూడా ఉందని శివాని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిందని సమాచారం. ఇక ఈ కేసులో ప్రస్తుతం రమేష్ భార్య శివాని, ఆమె లవర్ రామారావు, మరియు అతని ఫ్రెండ్ నీలా మీద మాత్రమే కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.

























పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన వేడుక. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ అమ్మాయి మెట్టింట్లో అడుగు పెడుతుంది. సాధారణంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు చాలా జాగ్రత్తలు చెప్తుంటారు. ఇక పెళ్ళిలో మగపెళ్ళి వారు కండిషన్లు పెడుతుంటారు. కానీ తాజాగా జరిగిన పెళ్ళిలో పెళ్లి కూతురి ఫ్రెండ్స్ వరుడికి కండిషన్లు పెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో పెళ్లి చేసుకోబోయే జంట పెళ్లి మండపంలోకి వెళ్తుండగా, మండపంలోకి వెళ్ళకుండా పెళ్లి కూతురి ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ పేపర్ ను పట్టుకుని ఉన్నారు. దానిపై సైన్ చేస్తే తప్ప మండపంలోకి వెళ్లనివ్వమని చెప్పడంతో పెళ్ళికుమారుడు ఆ అగ్రిమెంట్ పై సంతకం చేశాడు. ఆ తరువాత వధూవరులు వివాహం జరిగింది. ఈ వీడియోను వధువు కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
వరుడు సంతకం చేసిన కాంట్రాక్ట్ లో ఏముందంటే, కాజల్‌ను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఆమెను షరతులు లేకుండా ప్రేమించాలి. ఆమె ఎల్లప్పుడు సకరెక్ట్ గానే చేస్తుందని ఒప్పుకోవాలి. ఏడాదికి 3 సార్లు ఆమెను టూర్‌కు తీసుకెళ్లాలి. ఆమె ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎప్పుడూ ఆమె చలిగా ఫీల్ అవకుండా చూడాలి అని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజుకు పాకిస్తాన్ కి చెందిన నస్రుల్లాతో ఫేస్ బుక్ లో పరిచయం కావడం, ఆ తరువాత అది ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో లవర్ ను కలుసుకోవడం కోసం అంజు దేశ సరిహద్దులను దాటి పాకిస్తాన్ కు వెళ్లింది. అక్కడ ఇస్లాం మతంలోకి మారి, పేరు సైతం ఫాతిమా మార్చుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరో వారి పెళ్లి విషయం తెలిసిన అంజు ఆమె భర్త వారి పెళ్లి చెల్లదని చెబుతున్నారు. కానీ ఫాతిమా గా మారిన అంజు మాత్రం ఇక్కడి సంప్రదాయాలను మర్చిపోయి, అక్కడి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఫాతిమా, నస్రుల్లా పెళ్లి చేసుకోవడంతో బంధువులే కాకుండా అక్కడి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వారి ఇంటికి వెళ్ళి మరి బహుమతులు ఇస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ బిజినెస్ మెన్ మహమ్మద్ ఖాన్ అబ్బాసీ అంజుకి బహుమతుల అందచేశారు. ఆమెకు ఇల్లు కట్టుకోవడం కోసం స్థలం మరియు డబ్బును కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇతర మతాల నుండి తమ మతంలోకి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ప్రస్తుతం అతను చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.