JAILER REVIEW : “రజినీకాంత్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

JAILER REVIEW : “రజినీకాంత్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ కి తెలుగులో ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే రజినీకాంత్ కి కేవలం తెలుగులో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే రజనీకాంత్ నటించిన సినిమాలు చాలా వరకు ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తారు. ఇప్పుడు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : జైలర్
  • నటీనటులు : రజనీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, తమన్నా భాటియా, సునీల్, రమ్య కృష్ణన్.
  • నిర్మాత : కళానిధి మారన్
  • దర్శకత్వం : నెల్సన్
  • సంగీతం : అనిరుధ్ రవిచందర్
  • విడుదల తేదీ : ఆగస్ట్ 10, 2023

jailer movie review

స్టోరీ :

టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) ఒక జైలర్. పెద్దవాడు అయ్యాక రిటైర్ అయ్యి, తన భార్య, కొడుకు, కోడలు, మనవడితో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ముత్తువేల్ కొడుకు అర్జున్ (వసంత్ రవి) ఒక పోలీస్ అధికారి. ఎంతో నిజాయితీతో తన ఉద్యోగాన్ని చేస్తూ ఉంటాడు. ఒక కేసు విషయమై బయటికి వెళ్లిన అర్జున్, కనిపించకుండా పోతాడు. ఈ విషయాన్ని తెలుసుకొని అసలు ఏం జరిగింది అని చూస్తే ముత్తువేల్ కి తన కొడుకు చచ్చిపోయాడు అని అర్థం అవుతుంది.

jailer movie copied from a hollywood movie

కానీ అది అంతా నిజం కాదు అని, తన కొడుకు బతికే ఉన్నాడు అని తెలుసుకుంటాడు. అయితే తన కొడుకుని తిరిగి పంపించాలి అంటే వారు చెప్పిన పని చేయాలి అని ఒక గ్యాంగ్ ముత్తువేల్ కి ఛాలెంజ్ చేస్తారు. అప్పుడు ముత్తువేల్ ఏం చేశాడు? తన కొడుకుని ఎలా కాపాడుకున్నాడు? అసలు వాళ్లు చేసిన డిమాండ్ ఏంటి? అది పూర్తి చేయగలిగాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సాధారణంగా ఇండస్ట్రీలో తమని తాము ప్రూవ్ చేసుకున్న హీరోలకి ఒక పాయింట్ తర్వాత హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులు ఉంటారు. ఒకవేళ వారి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నెక్స్ట్ సినిమా హిట్ అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారి కెరీర్ లో అభిమానులని సంతృప్తిపరచడం కోసం ఎన్నో సినిమాలు చేశారు. ఒక పాయింట్ తర్వాత కొన్ని ప్రయోగాత్మక సినిమాలు కూడా చేయాలి అనుకుంటారు.

jailer movie review

ఆ సమయంలో అవి ప్రేక్షకులకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఆ హీరో ఆ సినిమా కోసం పడ్డ శ్రమని మాత్రం ప్రేక్షకులు ఎప్పుడు గుర్తిస్తారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా దాదాపు చాలా వరకు ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు. అలాగే పెద్దన్నలాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు అంత పెద్దగా నచ్చలేదు. అంతకుముందు వచ్చిన కబాలి, కాలా సినిమాలు అయితే ప్రేక్షకులని పూర్తిగా నిరాశపరిచాయి.

jailer movie review

పేట సినిమా మళ్లీ రజనీకాంత్ కి ఒక హిట్ సినిమాగా నిలిచింది. కానీ తర్వాత మళ్లీ దర్బార్, పెద్దన్న ఫ్లాప్ అయ్యాయి. దాంతో మళ్లీ రజనీకాంత్ ఒక మంచి కం బ్యాక్ ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే సబ్జెక్ట్ చాలా సింపుల్ గా ఉంది. కానీ రాసుకున్న విధానం బాగుంది. కేవలం రజనీకాంత్ మాత్రమే కాదు ఈ సినిమాలో ఇండియన్ రేంజ్ లో ఎంతో మంది పెద్ద పెద్ద నటీనటులు ఉన్నారు. వారందరికీ కూడా మంచి పాత్రలు లభించాయి అని చెప్పొచ్చు.

jailer movie review

పాత్రల నిడివి ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే, ఉన్న కొంచెం సేపు కూడా గుర్తుండిపోయేలాగా అలరిస్తారు. దర్శకుడు నెల్సన్ ఒక సీరియస్ పాయింట్ ని కాస్త కామెడీ యాడ్ చేసి చూపించడంలో స్పెషలిస్ట్. ఆయన ఫస్ట్ సినిమా అయిన కోలమావు కోకిల సినిమాలో మత్తు పదార్థాలు డీలింగ్ అనే విషయాన్ని కాస్త డార్క్ కామెడీతో చూపించారు. అలాగే రెండవ సినిమా అయిన డాక్టర్ లో కూడా అమ్మాయిలని రవాణా చేయడం అనే విషయం మీద తనదైన శైలిలో యాక్షన్ కూడా జోడించి చూపించారు.

jailer movie review

మూడవ సినిమా అయిన బీస్ట్ లో సినిమా మొత్తం దాదాపు షాపింగ్ మాల్ లో నడిచినా కూడా యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యేలా చేశారు. ఈయన చేసే ఇంకొక ప్రయోగం ఏంటి అంటే ఈయన సినిమాల్లో హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఎక్కువగా ఎమోషన్స్ చూపించరు. కాస్త ప్లెయిన్ టోన్ తో మాట్లాడుతూ, అక్కడి పరిస్థితి ఎలా ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. అలా ఉంటూనే ఆ పరిస్థితులను కూడా సరి చేస్తారు. బీస్ట్ సినిమాలో విజయ్ ని కూడా అలాగే చూపించారు.

jailer movie review

ఎప్పుడు హుషారుగా ఉండే విజయ్ ఆ సినిమాలో అలా నటించడంతో ప్రయోగం అంత పెద్దగా ఫలించలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాలో రజనీకాంత్ ని కూడా అలాగే ప్రశాంతంగా ఉన్న వ్యక్తిగా చూపించారు. అలా ఉంటూనే రజినీకాంత్ యాక్షన్ సీన్స్ కూడా చేశారు. ఒక రకంగా హీరో పాత్రని అలా చూపించడం సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ఎప్పుడు ప్రతి సినిమాలో పెద్ద పెద్ద డైలాగ్స్ చెబుతూ, ఆశ్చర్యపోయే యాక్షన్ సీన్స్ చేసే రజినీకాంత్, ఈ సినిమాలో ఇలాంటి పాత్ర చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఇంక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు.

jailer movie review

వారందరూ కూడా ప్రేక్షకులకు తెలిసినవారే. తమని తాము మంచి నటులుగా నిరూపించుకున్న వారే. వారికి ఇచ్చిన పాత్ర వరకు ప్రతి వారు బాగా నటించారు. రజనీకాంత్ పక్కన రమ్య కృష్ణన్ ని చూడడం, వారిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మళ్లీ నరసింహ సినిమాని గుర్తు చేసేలాగా ఉంది. ఇంక పాటల విషయానికి వస్తే, సినిమా పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆ పాటలు సినిమాలో చూడడానికి కూడా బాగున్నాయి. ముఖ్యంగా కావాలా సాంగ్ అయితే సెట్టింగ్స్, కొరియోగ్రఫీ పరంగా చాలా బాగుంది. తమన్నా చాలా రోజుల తర్వాత మళ్లీ ఇంత మంచి డాన్స్ సాంగ్ చేశారు.

jailer movie review

తన పాత్ర వరకు తను చాలా బాగా నటించారు. అలాగే మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, హిందీ నుండి జాకీ ష్రాఫ్, తెలుగు నుండి నాగబాబు, సునీల్ కూడా డిఫరెంట్ పాత్రలో నటించారు. ఆ పాత్రల పరిధి మేరకు వారు నటించారు. విజయ్ కార్తీక్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫీ, అలాగే సినిమాకి వాడిన కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. సినిమాలో చాలా సీన్స్ ని ఎలివేట్ చేసి, ఇది కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యింది అని అనచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

  • రజినీకాంత్ పాత్రని చూపించిన విధానం
  • భారీ తారాగణం
  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
  • పాటలు

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్
  • అక్కడక్కడ సాగదీసినట్టుగా ఉన్న సీన్స్

రేటింగ్ :

3.5/5

ట్యాగ్ లైన్ :

సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా అవి ప్రేక్షకులకి పెద్దగా కనిపించవు. అంటే సినిమా ఎలా ఉంది అనేది మీకే అర్థం అయిపోతుంది. ప్రేక్షకులు రజినీకాంత్ ని ఎలా చూడాలి అనుకున్నారో అలా చూశారు. ఈ వయసులో కూడా తన అభిమానులని సంతృప్తి పరచాలి అని రజనీకాంత్ పడుతున్న తాపత్రయాన్ని చూస్తే హ్యాట్సాఫ్ అనక తప్పదు. ఇటీవల కాలంలో వచ్చిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల్లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా జైలర్ సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : “బ్రో” మూవీ గురించి… ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!


End of Article

You may also like