ఎన్టీఆర్, చిరంజీవి తర్వాత… మళ్ళీ అలాంటి “స్టార్ హీరో” తెలుగు ఇండస్ట్రీలో లేనట్టేనా..?

ఎన్టీఆర్, చిరంజీవి తర్వాత… మళ్ళీ అలాంటి “స్టార్ హీరో” తెలుగు ఇండస్ట్రీలో లేనట్టేనా..?

by Anudeep

Ads

ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరిని మాత్రమే అందరూ గుర్తుంచుకుంటారు. కళామతల్లి కూడా తన బిడ్డల్ని చూసి గర్వపడే స్థాయిలో కొందరుంటారు. అందులో ముందు వరుసలో ఉంటారు. నందమూరి తారాక రామారావు, మెగాస్టార్ చిరంజీవి.

Video Advertisement

కొందరికి సినిమా అవసరం. కానీ కొందరు సినిమాకి అవసరం. వీరిద్దరూ తెలుగు సినిమా స్థాయిని పెంచి గొప్ప నటులు. అంతకు మించి మనసున్న మనుషులు.

తెలుగు సినిమా చరిత్రలో హీరోలని మూడు తరాలుగా విభజిస్తారు తెలుగు సినీ ప్రేక్షకులు. ఒకటి ఎన్. టి.ఆర్ తరం, రెండు చిరంజీవి తరం, మూడు నేటి తరం. ఏ.ఎన్. ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు,మోహన్ బాబు లాంటి హీరోలందరిని ఎన్. టి.ఆర్ తరం హీరోలు గా గుర్తిస్తారు. ఎందుకంటే ఆ కాలంలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సరికొత్త రికార్డ్ లు పరిచయం చేసిన ఘనత ఎన్. టి.ఆర్ దే. కమర్షియల్ మూవీస్ తో పాటు, రాముడు, కృష్ణుడు, కర్ణుడు, రావణాసురుడు మొదలైన పౌరాణిక పాత్రలకు ఎన్. టి.ఆర్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచేవారు. ఆ పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు.

ఇక యమగోల, అడవి రాముడు, వేటగాడు, జస్టిస్ చౌదరి, సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలి పులి,మేజర్ చంద్రకాంత్ లాంటి కమర్షియల్ హిట్స్ కి కూడా ఆయన కెరీర్ లో లోటు లేదు. అందువలనే ఆయన ఆ తరం హీరోలలో అగ్రగామిగా నిలబడగలిగారు. ఎన్. టి.ఆర్ తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన తన జెండా బలంగా నాటిన వ్యక్తి చిరంజీవి. ఈయన ఎన్. టి.ఆర్ గారిలా పౌరాణిక పాత్రలు చేయకపోయినా, మాస్ ఆడియెన్స్ లో చిరు పేరు చెబితే పూనకం వచ్చేలా డాన్స్ లతో, ఫైట్స్ తో అప్పటి వరకు ఒక పాత ధోరణిలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకి కొత్త రంగులు అద్దడం జరిగింది.

చిరు రాకతో తెలుగు సినీమా ఖ్యాతి భారతీయ సినీ ప్రపంచం లో మరింత పెరిగింది. ఖైదీ సినిమా తో ఇండస్ట్రీ లో తన స్ధానాన్ని ఖాయం చేసుకున్న చిరు, తర్వాత.. అడవి దొంగ, కొండవీటి దొంగ, కొండవీటి రాజా, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠామేస్త్రీ, జగదేక వీరుడు, అతిలోకసుందరి,ఇంద్ర, ఠాగూర్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో టాప్ హీరో కుర్చీని తన సొంతం చేసుకున్నారు. చిరంజీవి కాలంలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, రాజశేఖర్ లాంటి హీరోలు పోటీ పడినప్పటికి వారందరి కంటే చిరు కెరీర్ లోనే అత్యధిక హిట్ సినిమాలు ఉండడం, మరియు అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకోవడం తో చిరునే ఆ తరం గ్యాంగ్ లీడర్ గా అభిమానులు భావిస్తారు.

చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ టాప్ హీరో కుర్చీ ని ఎవరు తమ సొంతం చేసుకోలేకపోయారు. గబ్బర్ సింగ్,అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటు, అమోఘమైన ఫ్యాన్ బేస్ తో పవన్ కళ్యాణ్ గారు ఆ స్ధాయిలో కనిపించినప్పటికి, రాజకీయాల మీద ఆసక్తి తో ఆయన సినిమాల మీద పూర్తిగా దృష్టి పెట్టలేదని అనిపిస్తుంది. పవన్ తో పాటు, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్. టి.ఆర్ లాంటి కొత్త తరం హీరోలు వచ్చినప్పటికీ వారెవరు కూడా ఆ టాప్ హీరో కుర్చీని సొంతం చేసుకోలేకపోయారు. వారంతా కూడా ఇప్పటికి చిరునే తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అని చెప్పడం కొసమెరుపు.

మరి ఎన్. టి.ఆర్,చిరు తరువాత ఆ టాప్ హీరో కుర్చీని దక్కించుకుని, వెండితెర మీద తన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే నయా నవాబ్ ఎవరో కాలమే నిర్ణయించాలి.


End of Article

You may also like