అందరికీ నమస్కారం. మొన్న నేను పెట్టిన వీడియో కి స్పందించి నా బాగోగులు కోరుకున్న నా అభిమానులందరికి కృతజ్ఞతలు ?? ఈ వీడియో youtube చెక్కర్లు కొడుతోంది. మంచిది. నేను తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పాటలు పాడటం వలన అక్కడకూడా అభిమానులు నాతో మాట్లాడుతూ వుంటారు. అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుందని ఎక్కువ ఆంగ్లంలో మాట్లాడటం జరిగింది.
కానీ విషయం వదిలేసి సమాజం లో ఉన్న చాలా మంది న్యాయనిర్ణేతలు(కోర్టు లో ఉండేవారు కాదు) “ఏ తెలుగు రాదా, ఫ్యాషన్ ఆ, కారోనా వస్తే ముందు హాస్పిటల్ కి వెళ్లి చావు మీడియా లో పబ్లిసిటీ కోసం అవసరమా” లాంటి తీర్మానాలు చేస్తుంటే ఈరోజు నుండి కారోనా గురించి నా అనుభవం మరియు నేను కల్పించాలనుకున్న అవగాహన కార్యక్రమాలు విరమించుకుంటున్నాను. ఇంకా ఏం వినాల్సొస్తుందో .. వున్నవి చాలవా… God bless you ?