గత వారం నుండి సోషల్ మీడియా అంతా ఓ పాట, ఓ డైలాగు ఫుల్ గా వైరల్ అయిపోతున్నాయి.అసలు కథేంటంటే ఈటీవీ వారు ప్రసారం చేస్తున్న ఢీ షోలో గతవారం పండు అనే కంటెస్టెంట్ లేడీ గెటప్ లో నాది నెక్లెస్ అంటూ ఒక పాటకు పర్ఫామ్ చేశాడు. లిరిక్స్ క్యాచీగా ఉండటంతో అది బాగా వైరల్ అయ్యింది.
ఈ పాటకు పర్ఫామ్ చేస్తున్న టైంలోనే పండు Who Is దుర్గారావు!? అనే డైలాగ్ కు ఇచ్చిన ఎక్స్ ప్రెషన బాగా ఆకట్టుకుంది.దీనితో పండు ఇచ్చిన పర్ఫార్మెన్స్ తో పాటు Who Is దుర్గారావు!? అనే డైలాగ్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.దీనితో చాలామందికి అసలు ఈ దుర్గారావు ఎవరు అనే డౌట్ స్టార్ట్ అయ్యింది.దీనితో గ్యాప్ లేకుండా ఇంటర్ నెట్ అంతా అతని గురించి తెగ వెతికేస్తున్నారట.
మీకు తెలిసిన అలాంటి వారితో ఈ ఆర్టికల్ ను షేర్ చేసుకోండి ఇక అసలు కథలోకి వెళదాం. ఈ దుర్గారావు తన భార్యతో కలిసి సరదాగా అప్పట్లో టిక్ టాక్ వీడియోస్ చేస్తుండేవాడు. దీనికి మంచి స్పందన లభించేది.దీనితో దుర్గారావు టిక్ టాక్ ను సీరియస్ గా తీసుకొని వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.ఇతనికి టిక్ టాక్ లో దాదాపు 3లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.అలా దుర్గారావు చేసిన ఓ వీడియో ను పండు ఢీ స్టేజ్ పై పర్ఫామ్ చేశాడు.ఈ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద సంచలనమైంది.
watch video:
https://youtu.be/CPAtn-viQJs