సరదా కోసం ఆడే ఆటలు పరిధి దాటినప్పుడు ప్రమాదకరంగా మారుతాయి. ఏంటి నేను చెప్పేది నమ్మట్లేదా? అయితే నేను మీకు ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తాను అది విన్నాక మీరు నేను చెప్పింది నిజమని ఒప్పుకుంటారు.అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో సరదాగా ఆడిన పేకాటే ఆ సినిమాలలో అన్ని దారుణాలకు కారణమైంది. ఏంటి ఎగ్జాంపుల్ చెప్తానని సినిమా స్టోరీ చెప్తున్నాని అనుకుంటున్నారా?సినిమాలు నిజజీవితానికి ప్రతిబింబమే కదా!మీకు ఇంకా క్లియర్ గా చెప్పడానికి తాజాగా తిరుపతిలో జరిగిన ఈ సంఘటన చూడండి.మీకే ఓ క్లారిటీ వస్తుంది.

ఇక వివరాలలోకి వెళ్దాం.తిరుపతి పరిధిలో ఉన్న శ్రీ రంగరాజపురం మండలంలో ఉన్న పొదలపల్లి,వెంకటాపురం గ్రామాలలో ఉన్న యువకులు నిన్న రాత్రి వాలీబాల్ గేమ్ ఆడారు.ఆ సందర్భంలో ఎదురైన ఘర్షణ కారణంగా యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు రాళ్ళు,గాజు సీసాలు రువ్వుకున్నారు.ఈ ఘటనలో దాదాపు ఏడుగురు గాయపడ్డారు.దానితో రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
































