మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. ఇందులో చిరంజీవితో పాటు రవితేజ కూడా మరొక హీరోగా నటించారు. సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. సినిమా టీజర్ విడుదల చేసిన తర్వాత చిరంజీవి గెటప్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాగే సినిమా పాటలకు కూడా చాలా మంచి స్పందన వచ్చింది. దాంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాకి అంతే మంచి టాక్ వచ్చింది. అందులోనూ ముఖ్యంగా చాలా మంది పాత చిరంజీవిని చూసినట్టు ఉంది అని అన్నారు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలో పాత్రలతో పోలిస్తే ఈ సినిమాలో చిరంజీవి పోషించిన పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. చిరంజీవి కామెడీ టైమింగ్ ని ప్రేక్షకులు మిస్ అయ్యారు.
ఈ సినిమా చూశాక ఇది కదా చిరంజీవి అంటే అని అందరికీ అనిపించింది. కామెడీ టైమింగ్ మాత్రమే కాకుండా పాటల్లో కూడా తన స్టైల్ లో డాన్స్ వేసి మళ్లీ ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. సినిమాకి కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా అవన్నీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే సినిమాకి హిట్ టాక్ రావడం మాత్రమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఇటీవల విడుదలైన చాలా సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12