వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి న్యూజిలాండ్ సమాధానం చెబుతోంది. ఎవరు అనుకోని విధంగా వారి ఆట తీరుని మెరుగు పరుచుకొని ఇంగ్లాండ్ జట్టుకి షాక్ ఇచ్చింది న్యూజిలాండ్ జట్టు.

Video Advertisement

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ సెంచరీ చేశారు. 282 బంతుల్లో 132 పరుగులు చేశారు. ఓపెనర్లు టామ్ లాథమ్ (83), కాన్వే (61) తొలి వికెట్‌కు 149 పరుగుల స్కోర్ జోడించారు. హెన్రీ నికోలస్‌ తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించిన కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్ (54) తో కలిసి ఐదవ వికెట్‌కు 75 రన్స్ చేశారు. టామ్ బ్లండెల్‌ (90) తో కలిసి ఆరో వికెట్‌కు 158 పరుగులు జోడించారు.

comments on bracewell runout in eng vs nz

 

హ్యారీ బ్రూక్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ అవుట్ అయ్యారు. విలియమ్సన్ కి టెస్ట్ మ్యాచ్ లో ఇది రెండవ సెంచరీ. అయితే 158.2 ఓవర్లో ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్ లో బ్లండెల్ షాట్ కొట్టారు. ఆ తర్వాత బ్రేస్వెల్ తో కలిసి 2 పరుగులు చేశారు. అక్కడ మూడవ పరుగు చేయడానికి అవకాశం ఉండడంతో మరో సారి వికెట్ల మధ్య పరిగెత్తారు. అలా పరిగెడుతున్న క్రమంలో బ్రేస్వెల్ రనౌట్ అయ్యారు.

comments on bracewell runout in eng vs nz

క్రీజ్ దగ్గరికి చేరుకున్నా కూడా బ్రేస్వెల్ బ్యాట్, బ్రేస్వెల్ కాలు గాలిలోనే ఉన్నాయి. దాంతో అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయారు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ మాత్రం కళ్ళు మూసి తెరిచేలోపే వికెట్ పడగొట్టారు. దాంతో న్యూజిలాండ్ మరొక వికెట్ కోల్పోయింది. కేన్ విలియమ్సన్ ఎంత బాగా ఆడినా కూడా బ్రేస్వెల్ ఇలాంటి తప్పు చేయడంతో చాలా మంది, “ఇంత బద్ధకం ఏంటి?” అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

watch video :