ప్రేమ అంటే ఏంటి అని ఎవరినైనా అడిగితే ఎవరి నుండి సరైన సమాధానం రాదు. ఎందుకంటే అసలు డెఫినేషన్ ఏంటో ఎవరికీ తెలియదు కాబట్టి. అందరి ప్రేమకథలు పెళ్లి వరకు వెళ్లకపోవచ్చు.ఎక్కడో కొంతమంది మాత్రమే వాళ్లు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోగలుగుతారు అని అంటారు.

Video Advertisement

 

ఇది నిజంగా ఒక వ్యక్తికి సంబంధించిన చాలా పర్సనల్ విషయం కాబట్టి వాళ్లు తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న కారణాల గురించి ఎక్కువగా చర్చించుకోలేము.మన సెలబ్రిటీలలో కూడా కొంతమంది రిలేషన్ షిప్స్ దాదాపు పెళ్లి వరకు వెళ్ళాయి.

celebrities whose weddings were called off

మామూలుగా సెలబ్రిటీల మధ్య రిలేషన్ షిప్ రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ కొంతమంది తాము పెళ్లి చేసుకుంటున్నాం అని ఎనౌన్స్ చేసిన తర్వాత, లేదా పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్త వచ్చిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అలా ఇష్టపడిన వాళ్లని పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ సెలబ్రిటీలు ఎవరంటే.

#1 అక్షయ్ కుమార్ – శిల్పా శెట్టి

#2 త్రిష – వరుణ్ మణియన్

#3 ప్రభుదేవా – నయనతార

#4 ఉదయ్ కిరణ్ – సుష్మిత

#5 విశాల్ – అనీషా

#6 అఖిల్ – శ్రేయ భూపాల్

#7 రక్షిత్ శెట్టి – రష్మిక మందన్న

#8 మెహ్రీన్ పిర్జాదా – భవ్య బిష్ణోయ్

కొద్ది రోజుల క్రితం మెహ్రీన్ తన పెళ్లి కాన్సిల్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీని వెనకాల కారణం ఏంటో ఎవరికీ తెలియదు.

వీళ్లే కాకుండా రణ్ బీర్ కపూర్ – దీపికా పదుకొనే, శింబు – హన్సిక, ఇలియానా – ఆండ్రూ నీబోన్, శృతిహాసన్ – మైకేల్ కోర్స్ లే పెళ్లి వరకు కాకపోయినా కూడా వాళ్ల ప్రేమని బహిరంగంగా ప్రకటించారు.

కొంతమంది తాము డైరెక్ట్ గా ప్రేమలో ఉన్నామని చెప్పకపోయినా కూడా ఇన్ డైరెక్ట్ గా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా కానీ లేదా వాళ్లు మాట్లాడిన మాటల ద్వారా కానీ వాళ్ల రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసింది. కానీ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్లు విడిపోయారు.