ఈ 11 మంది నటులు ఒకటి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా.?

ఈ 11 మంది నటులు ఒకటి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా.?

by Mohana Priya

Ads

సెలెబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అని అంటారు. వాళ్ళు మనకి వ్యక్తిగతంగా తెలియదు. వారికి మనం అందరం అంత పర్సనల్ గా తెలియదు. కానీ వాళ్ళ విషయాలు అన్ని మనకి తెలుస్తాయి.

Video Advertisement

అందరూ సెలబ్రిటీలు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడరు. అయినా సరే వాళ్ళ విషయాలు స్ప్రెడ్ అవుతాయి. అందులో పెళ్లి కూడా ఒకటి.

పర్సనల్ కారణాల వల్ల కొంత మంది మ్యారేజ్ లైఫ్ అనుకున్న విధంగా సాగలేదు. దాంతో సపరేట్ అయ్యారు. తర్వాత కొంత కాలానికి మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 అక్కినేని నాగార్జున

1984 లో నాగార్జున కి, లక్ష్మీ తో వివాహం జరిగింది. తర్వాత కొంత కాలానికి వాళ్ళు విడిపోయారు. 1992 లో అమల ని వివాహం చేసుకున్నారు నాగార్జున.

#2 ప్రకాష్ రాజ్

1994 లో నటి లలిత కుమారి ని వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. 2009 లో వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారు. 2010 లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మని పెళ్లి చేసుకున్నారు.

#3 రాధిక

1985 లో నటుడు ప్రతాప్ పోతన్ తో రాధిక పెళ్లి జరిగింది. 1986 లో వాళ్ళిద్దరూ విడిపోయారు. 1990 లో రిచర్డ్ హార్డీ ని పెళ్లి చేసుకున్నారు రాధిక. 1992 లో వాళ్లు విడిపోయారు. 2001 లో నటుడు శరత్ కుమార్, రాధిక పెళ్లి చేసుకున్నారు.

#4 శరత్ బాబు

1981 లో నటి రమాప్రభ ని పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు. 1988 లో వాళ్ళిద్దరూ విడిపోయారు. తర్వాత స్నేహలత ని పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు.

#5 పవన్ కళ్యాణ్

1997 లో నందిని ని పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 2008 లో వీళ్లిద్దరు విడిపోయారు. 2009 లో రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ పెళ్లి జరిగింది. 2012 లో వీళ్లు సపరేట్ అయ్యారు. 2013 లో అన్నా లెజ్నెవా ని పెళ్లి చేసుకున్నారు.

#6 లక్ష్మి

సీనియర్ నటి లక్ష్మి గారు 1969 లో భాస్కర్ ని పెళ్లి చేసుకున్నారు. 1974లో వారిద్దరూ విడిపోయారు. 1975 లో నటుడు మోహన్ శర్మ ని పెళ్లి చేసుకున్నారు. 1980లో వీళ్లు సపరేట్ అయ్యారు. 1987 లో నటులు, దర్శకులు, రచయిత అయిన శివ చంద్రన్ ని పెళ్లి చేసుకున్నారు.

#7 కమల్ హాసన్

1978 లో వాణి గణపతి ని పెళ్లి చేసుకున్నారు. 1988 లో నటి సారిక తో కమల్ హాసన్ పెళ్లి జరిగింది. వీరిద్దరూ 2004 లో విడిపోయారు.

#8 సీత

ఎన్నో సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటించిన సీత 1990 లో నటుడు పార్తిబన్ ని పెళ్లి చేసుకున్నారు. 2001 లో వాళ్ళిద్దరు విడిపోయారు. 2010 లో సతీష్ ని పెళ్లి చేసుకున్నారు.

#9 కీర్తి రెడ్డి

2004 లో నటుడు సుమంత్ తో కీర్తి రెడ్డి పెళ్లి జరిగింది. 2006 లో వీళ్లిద్దరు సపరేట్ అయ్యారు. 2014 లో కార్తీక్ ని పెళ్లి చేసుకున్నారు కీర్తి రెడ్డి.

#10 మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ కూడా ఇటీవల భూమా మౌనికని పెళ్లి చేసుకున్నారు.

#10 శరత్ కుమార్

శరత్ కుమార్ 1984 లో ఛాయా ని పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో వీరిద్దరూ విడిపోయారు. 2001 లో రాధిక తో, శరత్ కుమార్ పెళ్లి జరిగింది.

 


End of Article

You may also like