“వాణి జయరాం” తో పాటు… గత 3 నెలల్లో కన్నుమూసిన 12 “సినీ” ప్రముఖులు..!

“వాణి జయరాం” తో పాటు… గత 3 నెలల్లో కన్నుమూసిన 12 “సినీ” ప్రముఖులు..!

by kavitha

Ads

గత ఏడాది ప్రముఖ సినీ దిగ్గజాలు కన్నుమూశారు. కొత్త ఏడాది ప్రారంభం అయినప్పటి నుండి భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు చాలా మంది ప్రముఖులు కన్నుమూశారు.

Video Advertisement

వరుస విషాదాలతో సినీ పరిశ్రమ అంతటా విషాద ఛాయలు కమ్ముకుంటున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు చాలా మంది ప్రముఖులు మరణించారు. 2023 లో ఇప్పటివరకు మరణించినవారు ఎవరో ఇపుడు చూద్దాం..
1. వాణీ జైరామ్:

ప్రసిద్ధ నేపథ్య గాయని వాణీ జైరామ్ ఎన్నో వందల పాటలు పాడి అలరించారు. ఆమె 77 ఏళ్ల వయసులో అనారోగ్యంతో 2023 ఫిబ్రవరి 4న మరణించారు.
2. జావేద్ ఖాన్ అమ్రోహి:

బాలీవుడ్ నటుడు జావేద్ ఖాన్ అనారోగ్యం కారణంగా 77 ఏళ్ల వయసులో 2023 ఫిబ్రవరి 14న కన్నుమూశారు.
3. నందమూరి తారక రత్న:

టాలీవుడ్ హీరో నందమూరి తారక రత్న గుండెపోటు కారణంగా 39 సంవత్సరాలు వయసులో 2023 ఫిబ్రవరి 18న మరణించారు.
4. మయిల్‌సామి:

కోలీవుడ్ హాస్య నటుడు మయిల్‌సామి 57 సంవత్సరాల వయసులో గుండెపోటు కారణంగా 2023 ఫిబ్రవరి 19న మరణించారు.
5. బేలా బోస్:

బాలీవుడ్ నటి బేలా బోస్ అనారోగ్యం కారణంగా 2023 ఫిబ్రవరి 20న కన్నుమూశారు. ఆమె వయస్సు 79 సంవత్సరాలు.
6. సతీష్ కౌశిక్:

బాలీవుడ్ నటుడు మరియు దర్శకుడు సతీష్ కౌశిక్ 67 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా 09 మార్చి 2023న మరణించారు.
7. సమీర్ ఖాఖర్:

బాలీవుడ్, టెలివిజన్ నటుడు సమీర్ ఖాఖర్ అనారోగ్యం కారణంగా 15 మార్చి 2023న కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు.8. ప్రదీప్ సర్కార్:

బాలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ సర్కార్ 68 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా 2023 మార్చి 24న మరణించారు.
9. ఆకాంక్ష దుబే:

భోజ్‌పురి సినీ నటి ఆకాంక్ష దుబే అనుమానాస్పదంగా 2023 మార్చి 26న మృతి చెందారు.ఆమె వయస్సు 23 సంవత్సరాలు.10. పమేలా చోప్రా:

బాలీవుడ్ ప్రొడ్యూసర్,సింగర్ పమేలా చోప్రా 74 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 2023 ఏప్రిల్ 20న తుది శ్వాస విడిచారు.
11. డ్యాన్స్ మాస్టర్ చైతన్య:

ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న యంగ్ డ్యాన్స్ మాస్టర్ చైతన్య బలవన్మరణానికి పాల్పడి, 2023  ఏప్రిల్ 30న కన్నుమూశారు.  11. మనోబాల:

ప్రముఖ కోలీవుడ్ హాస్యనటుడు మనోబాల అనారోగ్యం కారణంగా 2023 మే 3న కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.
Also Read: “ఆచార్య” తో పాటు… హీరోల పక్కన “హీరోయిన్స్” లేకుండానే వచ్చిన 10 సినిమాలు..!


End of Article

You may also like