Ads
గతేడాది తెలుగు చిత్ర సీమకి చెందిన చాలా మంది ప్రముఖులు కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆ విషాదాల నుంచి బయటపడి కొత్త ఏడాది లో రెండు నెలలు గడవక ముందే మరి కొన్ని విషాదాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దర్శకుడు విశ్వనాధ్, సీనియర్ నటి జమున, హీరో నందమూరి తారక రత్న వంటి వారు మరణించారు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 2023లో కన్నుమూసిన సినీ ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
#1 కళా తపస్వి విశ్వనాథ్
కళాతపస్వి కె.విశ్వనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మర్చిపోలేని సినిమాలను తెరపైకి తీసుకువచ్చారు. స్టార్ హీరోలు కూడా కమర్షియల్ గా ఆలోచించకుండా ఆయనతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించేవారు. అటువంటి దిగ్గజ దర్శకుడు ఈ ఏడాది ఫిబ్రవరి 2 న కన్ను మూసారు.
#2 జమున
తెలుగు తెర సత్యభామ గా గుర్తింపు పొందిన సీనియర్ నటి జమున వయోభారం తో ఈ ఏడాది జనవరి 27 న మరణించారు.
#3 నందమూరి తారక రత్న
నందమూరి మూడో తరం నట వారసుడు తారకతర్న గత నెల 27న లోకేశ్ యువగళం పాత్రలో పాల్గొంటూ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18 న కన్నుమూసారు.
#4 వాణి జయరాం
ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ అటు దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీ భాషల్లో తన సుమధుర గానంతో అలరించింది. ఉత్తమ గాయనీగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న ఆమె ఫిబ్రవరి 3 న తన స్వగృహం లో మరణించారు.
#5 మయిల్ స్వామి
ప్రముఖ తమిళ హాస్యనటుడు మయిల్ సామి దాదాపు 300 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించారు. ఆయన ఫిబ్రవరి 19 న కన్నుమూశారు.
#6 దర్శకుడు సాగర్
రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసిన సాగర్ .. ఇక ఆ తర్వాత అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, వంటి సినిమాలను తీశారు. ఆయన ఫిబ్రవరి 2 న మరణించారు.
#7 సునీల్ బాబు
సునీల్ బాబు మలయాళం, తెలుగు, తమిళం మరియు హిందీ చిత్రాలలో ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు . అతను ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ దగ్గర అసిస్టెంట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించాడు. ఆయన గుండెపోటు తో జనవరి 6 న మరణించారు. ఈయన ఇటీవల ‘సీతా రామం’ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసారు.
#8 డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి
ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్ రంగంలో తన సేవలను అందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి జనవరి 27 న గుండెపోటు తో మరణించారు. తెలుగులో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ వంటి ఎందరో స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు.
#9 జూడో కేకే రత్నమ్
తమిళం, తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో కొన్ని వందల చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేసిన జూడో రత్నం జనవరి 26న కన్నుమూసారు.
End of Article