Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అందరికీ దక్కదు. ఒక సినిమా ఒకరిని పైకి లేపితే మరొకరిని కిందకి నెట్టేస్తుంది. అలాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ సక్సెస్ను చూసి తర్వాత అడ్డడుగు స్థానానికి పడిపోయి మళ్ళీ కొంత కాలానికి తిరిగి పుంజుకున్న వారి లిస్టును ఒకసారి పరిశీలిస్తే…
Video Advertisement
1.పూరి జగన్నాధ్:
స్టైలిష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాస్ హీరో కేరక్టరైజేషన్ కి పెట్టింది పేరు. పూరి సినిమాలో ఒక హీరో నటించడం అంటే కంప్లీట్ కొత్తగా కనిపిస్తాడు. సినిమాని ఫాస్ట్ గా తీయడంలో పూరికి ప్రత్యేకమైన పేరు ఉంది. తన కెరియర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి హిట్లు కొట్టి పూరి జగన్నాథ్ ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అయితే తన సంపాదించింది అంతా ఒక స్నేహితుడు నమ్మి తన చేతిలో పెడితే అతను పూరిని మోసం చేశాడు. ఊహించని స్థాయిలో అప్పులు పాలై రోడ్డు మీదకు వచ్చేసే స్థితికి వచ్చాడు. ఆ సమయంలో దాదాపు 85 కోట్ల వరకు నష్టపోయాడు అంట. తర్వాత మళ్లీ కసిగా సినిమాలు చేసే హిట్టు కొట్టి మళ్ళీ స్టార్ స్టేటస్ ను తిరిగి పొందాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.
2. అశ్విని దత్:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ బ్యానర్ కి ప్రత్యేకమైన పేరు ఉంది. వైజయంతి బ్యానర్లో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ కూడా ఉంది. జగదేకవీరుడు అతిలోకసుందరి ఇలాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కూడా వీరికి సొంతం. అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వీరు తెరకెక్కించిన శక్తి సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా కారణంగా అప్పుల పాలై చాలా రోజులు సినిమాలు తీయలేదు. అయితే ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి పుంజుకుని నిర్మాణం చేస్తున్నారు. మహానటి, సీతారామం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు.
3.నాగబాబు:
మెగా బ్రదర్ కొణిదల నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి చిరంజీవితో సినిమాలు తీసేవారు. కొన్ని హిట్ సినిమాలు మరి కొన్ని ఫ్లాప్ సినిమాలు తో మెగా బ్రదర్ కెరీర్ సమానంగా వెళ్ళేది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఆరెంజ్ సినిమాని వైజయంతి బ్యానర్ లో తెరకెక్కించారు. ఈ సినిమా కథపరంగా బాగానే ఉన్నా కూడా ప్రేక్షకులకు ఎక్కలేదు. దాదాపు 30 కోట్లు నష్టపోయారంట. దీంతో నష్టాలు రావడంతో మెగా బ్రదర్ అప్పుల్లో కూరుకుపోయారు. ఆ కారణంగా కొద్ది రోజులు సినిమాలకు విరామం ఇచ్చి యాక్టింగ్ పైన దృష్టి పెట్టారు. తర్వాత జబర్దస్త్, కొన్ని సీరియల్స్ ద్వారా ఆర్థికంగా పుంజుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.
End of Article