“ఇలా చేయడం మానుకోవాలి..!” అంటూ… “నిహారిక” ఇంటర్వ్యూపై మాజీ భర్త చైతన్య కామెంట్స్..! ఏం అన్నారంటే..?

“ఇలా చేయడం మానుకోవాలి..!” అంటూ… “నిహారిక” ఇంటర్వ్యూపై మాజీ భర్త చైతన్య కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by Mounika Singaluri

మెగా డాటర్ కొణిదెల నిహారిక-జొన్నలగడ్డ చైతన్యను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి మెగా కుటుంబ అత్యంత వైభవంగా జరిపించింది.అయితే పెళ్లి జరిగి సంవత్సరం గడవక ముందే వీరి సంసారంలో గొడవలు మొదలయ్యాయి.

Video Advertisement

కిందట ఏడాది నిహారిక చైతన్య ఇద్దరు మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేసి విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా నిహారిక ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల విషయం పైన మాట్లాడారు. విడాకులు జరిగాక ఆ బాధను తట్టుకోలేక తాను ప్రతిరోజు ఏడ్చేదానిని అని, విడాకులకి ముందు, ఆ తర్వాత జరిగిన సంఘర్షణ గురించి వివరించారు.

అయితే దీనిపైన నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య స్పందించారు. ఈ వీడియో పోస్ట్ చేసిన లింక్ కింద ఒక సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు. “హాయ్ ఇటీవల నిహారిక ఎదుర్కొంటున్న నెగిటివిటీని దూరం చేసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం అంత సులభం కాదని నాకు తెలుసు… కానీ పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయడం, అందుకు ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవడం మానుకోవాలి. ఇలా జరగడం ఇది రెండోసారి… బాధ ఇద్దరికీ ఉంటుంది. ఒకరి వైపు నుంచి మాట్లాడకూడదు…విడాకుల విషయంలో వారి జోక్యం చేసుకోకూడదు…”

chaitanya jv comments on niharika konidela interview

“బాధ నుంచి ఎలా కోలుకున్నామో అనే దాని గురించి మాట్లాడితే అది చాలామందికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటిది చేస్తే… ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి… జరిగిందేంటో తెలుసుకోకుండా జడ్జ్ చేయడం ఎంత తప్పో… ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు ఒకే కోణం ద్వారా చెప్పడం అంతే తప్పు అని అనుకుంటున్న అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా” అని రాసుకొచ్చాడు… ఇప్పుడు ఒక పక్కన నిహారిక ఇంటర్వ్యూ మరోపక్క ఆమె మాజీ భర్త కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి


You may also like

Leave a Comment