ఇంద్ర అనగానే ఇప్పటికీ తెలుగు బుల్లితెర ఆడియెన్స్ వెంటనే గుర్తుపట్టే నటుడు ఇంద్రనీల్‌. ఒకప్పుడు బుల్లితెర  స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఆయన ఒకటి, రెండు కాదు. 18 డైలీ సీరియల్స్‌ లో హీరోగా నటించిన యాక్టర్ ఇంద్రనీల్‌.

Video Advertisement

ఆయన నటించిన చక్రవాకం సీరియల్, మొగలి రేకులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంద్రనీల్  బుల్లితెర పై అప్పట్లో ఒక సంచలనం. ఈ మధ్యే బుల్లితెర సీరియల్ తో రీఎంట్రీ ఇచ్చినా,  కొద్దికాలానికే వెనుతిరిగారు. వేరే సీరియల్ లోనూ కనిపించలేదు. దానికి కారణం ఏమిటో తాజాగా ఇంద్రనీల్ చెప్పారు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చక్రవాకంలో ఇంద్రగా నటించిన యాక్టర్ ఇంద్రనీల్ బుల్లితెర పై సంచలనం సృష్టించారు. మంజులనాయుడు తెరకెక్కించిన ఈ సీరియల్, అప్పటి వరకు ఉన్న సీరియల్స్ ట్రెండ్ ను మలుపు తిప్పింది. ఆ తరువాత వచ్చిన మొగలి రేకులు సీరియల్ ఇంద్ర రేంజ్ ను మరింత పెంచింది. ఇంద్రనీల్ టెలివిజన్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఇంద్ర అనగానే ఇంద్రనీల్‌ని బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపడుతున్నారంటే ఆయన క్రేజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. క్రమంగా బుల్లితెరకు దూరం అయిన ఇంద్రనీల్‌ చాలాకాలం తరువాత ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్‌లో సామ్రాట్‌ అనే పాత్రతో రీఎంట్రీ ఇచ్చారు. ఇంద్ర బాగా నటించినప్పటికీ, ఆయన పక్కన హీరోయిన్ అమ్మమ్మలా ఉందని ఆమె పాత్రను హైలెట్ చేయడానికి సామ్రాట్ పాత్రను సరిగ్గా చూపించలేదని విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఆ తరువాత ఆ పాత్ర కనిపించలేదు. ఇంద్రనీల్ కి రీ ఎంట్రీ పని చేయలేదు. సీరియల్స్‌లో ఛాన్స్ లు లేకపోవడంతో ఇంద్రనీల్ ప్రస్తుతం తన భార్యతో కలిసి ఆన్ లైన్‌లో పచ్చళ్ల బిజినెస్ ప్రారంభించారు. ఇంద్రనీల్, మేఘనాలు ఎన్ఎమ్ ఫుడ్స్ పేరుతో అమ్ముతున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన ఇంద్రనీల్ తెలుగులో టీవీ నటులకు ఆఫర్స్ చాలా తక్కువ. దానికి కారణం కన్నడ నటుల డామినేషన్ ఎక్కువగా ఉందని అన్నారు. దాంతో చాలామంది తెలుగు ఆర్టిస్ట్‌లు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే మేము బాగానే ఉన్నామని, చక్రవాకం ఇంద్ర అనగానే ఇప్పటికీ గుర్తుపడతారు. హీరోగా 18 డైలీ సీరియల్స్ లో నటించాను. ప్రస్తుతం సీరియల్ హీరోలు 1,2 సీరియల్స్ అనంతరం కనిపించడం లేదు. కన్నడ వాళ్లు ఇక్కడ వర్క్ చేస్తున్నారని మాకేం ఇబ్బంది లేదు. వాళ్లలో ఎక్కువ మంది మా స్నేహితులు ఉన్నారు. తప్పు వాళ్లది కాదు. పరిశ్రమ వాళ్లది. కన్నడ లేదా తమిళ ఇండస్ట్రీలలో తెలుగువాళ్లను తీసుకోరు. అయితే తెలుగులో కన్నడవాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు.

Also Read: PACHUVUM ATHBUTHA VILAKKUM REVIEW : “ఫ‌హాద్ ఫాజిల్” హీరోగా నటించిన ప‌చ్చువుమ్ అద్భుత విళక్కుం ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!