సీనియర్ నటుడు, ఆ తరం హీరో చంద్ర మోహన్ గారు ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. 82 ఏళ్ళ చంద్ర మోహన్ గారు హృదయరోగం తో కన్ను మూశారు.ఆయనకు భార్య జలంధర,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Video Advertisement

సోమవారం హైదరాబాద్ లో తుది వీడుకోలు జరగనుంది.ఇది ఇలా ఉండగా ఆయన ఆస్తి వివరాలు గురించి నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి.

గోల్డెన్ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్న హీరో చంద్ర మోహన్ గారు తన సినిమా లో నటించిన ప్రతి హీరోయిన్ దశ మారి బాగా పేరు తెచ్చుకున్న వారిలో శ్రీదేవి,జయసుధ,వాణి శ్రీ,జయ ప్రధ కొంత మంది. చంద్రమోహన్ గారితో నటించిన తరువాతే తమ సినీ కెరీర్ మలుపు తిరిగింది అని అందరూ చంద్రమోహన్ లక్కీ అనుకున్నారు. రంగుల రాట్నం సినిమా తో తన నట ప్రయాణం మొదలు పెట్టిన చంద్రమోహన్ కు ఈ సినిమాతో మంచి పేరు మరియు నంది అవార్డు అందించింది. మొత్తం 6 దశాబ్దాల సినీ ప్రయాణం లో 900 కు పైగా చిత్రాలలో నటించారు.

ఇది ఇలా ఉండగా చంద్రమోహన్ గారి ఆస్తి వివరాలు గురించి సోషల్ మీడియా లో హడావిడి చేస్తోంది. తన సినీ జీవితం లో సంపాదించిన మనీ తో హైదరాబాద్ శివారులో చాలా స్థిరాస్తులు కొనుగోలు చేయగా వాటి విలువ నేటికి మూడు వందల కోట్లు ఉన్నట్లు సమాచారం.

1945 మే 23 న కృష్ణ జిల్లా లో పుట్టి బాపట్ల అగ్రికల్చర్ డిగ్రీ చేసారు.ప్రఖ్యాత దర్శకుడు కే.విశ్వనాధ్ గారు, SP బాల సుబ్రహ్మణ్యం గారు చంద్రమోహన్ గారు కసిన్స్ అవుతారు. అందుకనే అనుకుంటా విశ్వనాధ్ గారి సినిమా లో ఎక్కువ శాతం చంద్రమోహన్ గారి పాత్రలు మనకు దర్శనం ఇచ్చాయి.

2017 లో కొన్ని సినిమాలు చేసి తరువాత వాటికి దూరంగా ఉన్నారు. కళా తపస్వి గారు కాలం చేసినపుడు మాత్రం మీడియా కి దర్శనం ఇచ్చారు. ఈ మధ్య గుండెకి సంబందించిన సమస్యలకు గురై ఇవాల ఉదయం కాలం చేసారు.కాగా నవంబర్ 13 న హైదరాబాద్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.