Ads
అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. పుష్ప సినిమా అల్లు అర్జున్ కి మంచి హిట్ ని తీసుకు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపించారు. అల వైకుంఠపురం తర్వాత మంచి బ్లాక్ బస్టర్ ని బన్నీకి ఈ సినిమా తీసుకువచ్చింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప.
Video Advertisement
గత రెండు రోజుల నుంచి ఓటీటీ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పైగా రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వస్తున్నాయట. ఇదిలా ఉంటే సుకుమార్ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1996 సంవత్సరం నుంచి 2004 మధ్య జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిన్న విషయం ఒకటి వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో చంద్రబాబునాయుడు ఉన్నాడని అంతా అంటున్నారు. పైగా నెట్టింట్లో ఓ ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది.
చంద్రబాబునాయుడు ఏపీ సీఎం గా తొమ్మిదేళ్లపాటు ఉన్నారు. అయితే అప్పట్లో జరిగిన కధగా దీనిని తీసుకు వచ్చారు కనుక అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అన్న కాన్సెప్ట్ తో సుకుమార్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉండేటట్టు చేశారు. చంద్రబాబు నాయుడు అభిమానులు ఈ విషయంపై సుకుమార్ ని మెచ్చుకుంటున్నారు.
పైగా బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో బన్నీ బాలీవుడ్ లోకి వెళ్లడం కూడా మంచిదే అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్, డైలాగ్స్, డాన్స్, పాటలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.
డిసెంబర్ 17 న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో పాటు అందరి హృదయాల్ని గెలుచుకుంటోంది. సెలబ్రిటీలు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ సినిమాని ప్రశంసించారు.
End of Article