టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ కోసం చంద్రబాబు తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే బాదోపవాదములు జరుగుతున్నాయి గాని చంద్రబాబుకు మాత్రం బెయిల్ రాలేదు. చంద్రబాబు నిర్దోషిగా విడుదలవుతారు అంటూ టిడిపి శ్రేణులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

Video Advertisement

అయితే చంద్రబాబు జాతకం ప్రకారం ఆయన ఎప్పుడు జైలు నుంచి విడుదలవుతారనేది పండితులు చెబుతున్నారు. దాని ప్రకారం చూస్తే…

ప్రస్తుతం చంద్రబాబుకి ఏలినాటి శని నడుస్తుందని దాని కారణంగానే ఆయన జైలుకు వెళ్లారని చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకి రాహువు మహా దశ నడుస్తుందని తెలిపారు. రాహువు శనితో కలిసినప్పుడు ఇలా జైలు పాలు అవడం జరుగుతుందని వివరించారు. 2024 లో రాహువు రవి కలిసి కొంత మంచి చేసినా కూడా ఏలినాటి శని ప్రభావం అయితే ఉంటుందని తెలిపారు. అందువల్ల చంద్రబాబు ఎంత మంచి చేసినా కూడా అది ఎదురు వస్తుందని తెలియజేశారు.

వీటి ప్రభావం వల్ల జైలు నుండి బయటకు వచ్చేది కూడా 2024 వచ్చాకే అని చెబుతున్నారు. భద్రకాళి ఆరాధన, హనుమంతుడి ఆరాధన చేస్తే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది తెలిపారు. కొన్ని రకాలు బలులు ఇవ్వడం ద్వారా కూడా దీని పరిహారం చేయవచ్చని చెబుతున్నారు.చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా ఆయన తరపున ఆయన ఇంట్లో వారు గాని ఆయన అభిమానులు గాని ఈ పరిహారాలు జరిపించవచ్చునని సూచించారు. చంద్రబాబు జాతికి రీత్యా చూస్తే 2024 వరకు కూడా బయటికి వచ్చే అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు.

అయితే చంద్రబాబు బయటికి రావాలని ఆయన అభిమానులు చెయ్యని పూజ లేదు మొక్కని దేవుడు లేదు.ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఏలినాటి శని కారణంగా జైలు పాలు అవడం , హాస్పిటల్ ఫాలో అవ్వడం జరుగుతుందని పండితులయితే చెబుతున్నారు.మరికొందరి ప్రముఖులకు కూడా ఏలినాటి శని జాతకం నడుస్తుందని వారు కూడా జైలు పాలు అవ్వడం తప్పదని తెలియజేశారు.

Watch video:

Also Read:పది నిమిషాల్లో పెళ్లి … అంతలోనే..? ఏం జరిగిందంటే..?