సూపర్‌ స్టార్‌ కృష్ణ, గిన్నిస్‌ బుక్ రికార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ విజయ నిర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఆదర్శ జంటగానూ నిలిచారు.కృష్ణ తో విజయ నిర్మల పలు సినిమాలు డైరెక్ట్ చేశారు. అయితే వీరిద్దరి పెళ్లి వెనుక ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ హస్తం ఉందనే విషయం మీకు తెలుసా….!

Video Advertisement

చంద్రమోహన్‌ వందకుపైగా సినిమాల్లో హీరోగా నటించారు,తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కళాతపస్వి డైరెక్టర్ కె .విశ్వనాథ్‌ కి బంధువులు అనే సంగతి తెలిసిందే. అయితే సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీ తోనూ ఆయనకి మంచి అనుబంధం ఉంది. దానికి కారణం వారి ఇద్దరి ప్రేమ పెళ్లి వెనుక చంద్రమోహన్‌ హస్తం ఉండటమే కారణం.ఇంతకీ అసలు విషయం ఏంటంటే….!

కృష్ణ, విజయ కలిసి అనేక సినిమాలు చేశారు. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ పలు సినిమాలు చేస్తే, ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. మొత్తంగా వీరిద్దరు 40 పైగా సినిమాలు చేశారు. విజయ నిర్మల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఆల్మోస్ట్ కృష్ణ హీరోగా చేసేవారు. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అది ప్రేమగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే కృష్ణకి ఇందిరా దేవితో పెళ్లి అయ్యింది, పిల్లలున్నారు. మరోవైపు విజయనిర్మలకి పెళ్లి అయ్యింది, ఇద్దరు కుమారులున్నారు.అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

krishna

ఆ సమయంలో వారికి అండగా నిలిచింది నటుడు చంద్రమోహన్‌. వారికి మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు దగ్గరుండి వారిద్దరి పెళ్లి చేసారు. తిరుపతిలో కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకోగ ఆ పెళ్లి ఏర్పాట్లు మొత్తం చూసుకుంది చంద్రమోహన్ అంట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకరకంగా చూస్తే కృష్ణ విజయనిర్మల పెళ్లికి పెద్ద చంద్రమోహన్‌. వీరి పెళ్లికి కృష్ణ మేకప్ మెన్, విజయ నిర్మల అసిస్టెంట్, చంద్రమోహన్, మోహన్ కుమార్ అనే ఒక జర్నలిస్టు  తిరుపతిలో పెళ్లి చేశారు. ఈ పెళ్లితో చంద్రమోహన్ కృష్ణ విజయనిర్మల కుటుంబానికి బాగా కావలసిన వ్యక్తిగా మారారు.సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు రమేష్ బాబు, మహేష్ బాబు అన్న సంగతి తెలిసిందే. అలాగే విజయనిర్మల కుమారుడు నరేష్ కూడా అందరికీ పరిచయమే.

 

Also Read:చంద్ర మోహన్” భార్య ఎవరో తెలుసా..? వారి సంతానం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..?