Ads
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన స్థానం పదిలంగా ఉంది. ఆయన సహచర నటులుకైనా, కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వారికైనా చిరంజీవి అంటే ఒక ఇన్స్పిరేషన్. అప్పటిలో చిరంజీవి చెయ్యని పాత్ర లేదు. నిర్మాతలు, దర్శకులు చిరంజీవి డేట్ ల కోసం క్యూ కట్టేవారు.
Video Advertisement
ఇండియాలోనే మొట్టమొదటిసారి కోటి రూపాయల పారితోషకం అందుకున్న ఏకైక స్టార్ హీరో చిరంజీవి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి కంటే కూడా నటుడు చంద్రమోహన్ ఎక్కువ పారితోషకం అందుకున్నాడని మీకు తెలుసా…?
ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇటీవల మరణించారు. చంద్రమోహన్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు హిట్ సినిమాలో నటించారు. తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి మంచి పాత్రలు చేశారు. అయితే తాను ఒక సినిమాలో చిరంజీవి కంటే ఎక్కువ పారితోషకం అందుకున్నాను అని ఒక ఇంటర్వ్యు లో చెప్పారు. ప్రాణం ఖరీదు సినిమాలో చంద్రమోహన్, చిరంజీవి కలిసి నటించారు. అయితే అప్పటికే చంద్రమోహన్ చిరంజీవి కంటే సీనియర్. ఆ సినిమాలో చంద్రమోహన్ కి 25000 పారితోషకం ఇవ్వగా చిరంజీవికి 5000 మాత్రమే ఇచ్చారని తెలిపారు. అప్పటికి చిరంజీవి చాలా రఫ్ గా ఉండేవారని, తనలో ఏదో తపన కనిపించేదని అన్నారు.
చిరంజీవి చాలా పెద్ద నటుడు అవుతాడని అప్పుడే అనుకున్నట్లు చెప్పారు. చిరంజీవి డాన్సులు చూసి మంచి డాన్సర్ వచ్చారని ఇండస్ట్రీ మొత్తం అనుకుందని గుర్తు చేశారు.అయితే చంద్రమోహన్ చనిపోయినప్పుడు చిరంజీవి తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చంద్రమోహన్ మృతికి దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ప్రతిష్ట హీరో సినిమాలో చంద్రమోహన్ నటించారు. తండ్రి పాత్రలు అంటే గుర్తు వచ్చేది చంద్రమోహన్. మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనను రీప్లేస్ చేసే నటుడు రాడు అని అభిమానులు చెబుతున్నారు.
Also Read:చంద్ర మోహన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
End of Article