“చంద్రముఖి” సినిమాలో చూపించిన కథ అంతా నిజం కాదా..? అసలు కథ ఏంటంటే..?

“చంద్రముఖి” సినిమాలో చూపించిన కథ అంతా నిజం కాదా..? అసలు కథ ఏంటంటే..?

by kavitha

Ads

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, యాక్ట‌ర్, డైరెక్ట‌ర్‌ రాఘ‌వ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాకి సీనియ‌ర్ దర్శకుడు పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 19 న రిలీజ్ కానుంది.

Video Advertisement

హార‌ర్ జోన‌ర్‌లో సంచలనం సృష్టించిన క్లాసిక్ హిట్ సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ గా ‘చంద్రముఖి 2’ రూపొందుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పీ వాసు సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, పాటలు, ట్రైలర్ సందడి చేస్తుండడంతో అసలు చంద్రముఖి రాజుని చంపింది ఎవరు? ఈ స్టోరీ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..
కేరళ రాష్ట్రంలోని అలమట్టి పట్టణంలో ఒకప్పుడు ట్రావెన్ కోర్ రాజ్యం రాజులు పాలించేవారు. వారు నివసించిన పెద్ద ఇల్లు ఇప్పటికీ ఉంది. దాని చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. ట్రావెన్కోర్ వంశానికి చెందిన రాజు అలమోట్టిల్ మెద చాలా క్రూరుడు. ఆ ఇంట్లో కింద ఉండే భాగంలో బంధువులు ఉండేవారు. పైన భాగంలో ఆ రాజు నివసించేవాడు. అతను  బ్రిటిష్ వారికి శిస్తు కడుతూ, ఆ ప్రాంతాన్ని పాలించేవాడు. రాజు ఇంట్లో పనిచేసే వారు ఉండడానికి, ఆ ఇంటికి దూరంగా ఇల్లు ఉండేవి. రాజు తన ఉంపుడుగత్తెల కోసం కూడా ప్రత్యేకమైన ఇంటిని కాస్త దూరంలో నిర్మించాడు.
ఆ రాజు తన ఇంటి నుండి చూసినపుడు వారు కనిపించే విధంగా ఆ ఇంటిలో ఉంచేవారు. ఆ అందగత్తెలలో నాట్యం అద్భుతంగా చేసేవారిని పిలిచేవారు. అలా నాట్యం చేసి, రాజుని సంతోషపెట్టిన వారికి ఆభరణాలతో పాటు సత్కారం చేసేవాడు. అందమైన స్త్రీలు ఎక్కడ ఉన్నా, వారిని సొంతం చేసుకునే స్వభావం రాజుకు ఉండేది. ఆ క్రమంలోనే చంద్రముఖి స్టోరీ ఇక్కడే పుట్టింది. రాజు పాలించే రోజుల్లో రాజు సోదరి ఫ్యామిలీ రాజు ఇంటికి వచ్చింది. వారిని తన ఆస్థానంలో ఉండనిచ్చాడు.
కానీ రాజు అక్క, బావ అతని రాజభోగాలు, ఐశ్వర్యం చూసి అసూయపడి, రాజు ఆస్తిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అనుకున్నారు. ఇక్కడా ఎన్నిరోజులు ఉంటాము, తమకు కొంత ఆస్తి ఇస్తే తమ జీవితం తాము జీవిస్తామని రాజును అడిగారు. అప్పుడు రాజు ఒక పెద్ద భవంతి పాటు వెయ్యి ఎకరాల భూమిని కూడా ఇచ్చాడు. అయితే వారి చేతికి మాత్రం డబ్బు ఇవ్వలేదు. రాజు వార్ధక్యంలో ఆస్తి దక్కుతుందని వారు భావించారు. అయితే రాజుకి వయసు పెరుగుతుండడంతో ఆస్తి అంతటిని తన పిల్లల పేర్ల మీద రాసి, భార్యతో కూడా సంతకం పెట్టించి, ఇచ్చాడు.
దాంతో పగ పెంచుకున్న రాజు అక్క తనకు ఆస్తి ఇవ్వలేదని, రాజును చంపాలని నిర్ణయించుకుంది. ముందుగా రాజు భార్యను స్లో పాయిజన్ తో సందేహం రాకుండా చంపేశారు. భార్య చనిపోవడంతో ఒంటరి వాడైన రాజు తోడుగా ఉండేందుకు పనివాడి పద్దెనిమిదేళ్ళ కుమార్తెను ఇంట్లో పెట్టుకున్నాడు. రాజుని ఆమె బాగా చూసుకునేది. అయితే వకసరి అక్కడికి వచ్చిన ఒక  పెయింటర్ రాజు చిత్రం వేస్తానని అనడంతో, రాజు తనతో పాటు ఆ అమ్మాయి చిత్రాన్ని కూడా గీయమని చెప్తాడు. వారం రోజులు సమయం తీసుకుని పని మనిషి చిత్రాన్ని చాలా అందంగా గీస్తాడు.ఆ చిత్రాన్ని చూసి ఆమె అందానికి ముగ్ధుడైన రాజు పనిమనిషిని ఇష్టపడతాడు. అప్పుడే ఆ ఇంటికి వచ్చిన రాజు అక్క ఈ విషయాన్ని గమనించి, పెత్తనం అంతా తన గుప్పిట్లోకి తీసుకుంది. రాజును ఎలాగైనా చంపేయాలని అనుకుంది. అనుకున్న తాదువుగా ఇద్దరినీ ఒక గదిలో పెట్టి చంపి, రాజు సంపదను అంతా ఆమె తన సంస్థానానికి చేరవేస్తుంది. ఆ తర్వాత రాజు, పనిమనిషిని చంపిన రూమ్ ను తప్ప, మిగతా ఇంటిని అంతా అందంగా తీర్చి దిద్దింది. రాజు కొడుకు అక్కడ ఒక సేవకున్ని ఉంచాడు.అయితే ప్రతి అమావాస్యకు గది నుండి భయంకర శబ్దాలు వస్తుండడంతో అతను ఆ ఇంటిని నుండి పారిపోగా, రాజు కదుకు మరొక పనివాన్ని పంపిస్తాడు. కానీ అతనుకూడ శబ్ధాలకు భయపడి పారిపోతాడు. ఆఖరికి అక్కడ రాజు అక్క ఆ ఇంట్లోనే ఉంది. ఆ తరువాత వచ్చిన అమావాస్య రోజు రాత్రిపూట రాజు అక్క కూతురు కూడా ఇంట్లో ఉన్నప్పుడు, పని మనిషి ఆత్మ ఆమెను ఆవహించి, పని మనిషిలానే మాట్లాడుతూ రాజు అక్కను చంపేసింది. అప్పటి నుండి ఆ ఇంట్లో నుండి ప్రతి అమావాస్యకు భయంకరమైన శబ్దాలు వస్తుంటాయని అక్కడి వారు చెబుతారు. ఈ కథ ఆధారంగా చంద్రముఖి మూవీని తీశారు.

Also Read: సీరియల్స్ లోకి రాకముందు “అమర్‌దీప్ చౌదరి” ఏం చేసేవారో తెలుసా..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?


End of Article

You may also like