అమర్‌దీప్ అంటే టక్కున గుర్తు రాకపోవచ్చు కానీ జానకి కలగనలేదు సీరియల్ లో రామా ..అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. అయితే ప్రస్తుతం ఈ హ్యాండ్సం మ్యాన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో అడుగు పెట్టాడు.

Video Advertisement

సీరియల్స్ పెద్దగా చూడని వారు కేవలం బిగ్ బాస్ షో మాత్రమే ఫాలో అయ్యే వారికి అమర్‌దీప్ పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ బుల్లితెర ఫేవరెట్ స్టార్ గా అమర్‌దీప్ కి మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ లో అమర్‌దీప్ చౌదరి కూడా ఒకరు కావడంతో జరగబోయే ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా ఉంటాయి అని అభిమానులు ఆశిస్తున్నారు.

అమర్‌దీప్ తండ్రి అమీర్ బాషా…కేవలం రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మాత్రమే కాదు ఒక మంచి కూచిపూడి డాన్సర్ కూడా. ఇక తల్లి రూప నృత్యకారిణి ,పైగా బీజేపీలో నాయకురాలు. ఇలా మంచి ఎడ్యుకేటెడ్ మరియు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అమర్‌దీప్, తల్లిదండ్రులు అడుగుజాడల్లో నడిచి డాన్స్ నేర్చుకొని చక్కగా ఎన్నో పోటీలలో పాల్గొన్నాడు. చదువులో కూడా రాణించడంతో లండన్ వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి వచ్చాడు.

bigg boss telugu 7 amardeep chowdary background and profession

2016 లో పరిణయం అనే ఒక చిన్న షార్ట్ ఫిలిం తో తన యాక్టింగ్ కెరియర్ ను ప్రారంభించాడు. తరువాత త్రివేండ్రంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసిన తిరిగి నటన వైపే అతను మొగ్గు చూపాడు. ఐ డ్రీమ్ తెలుగులో చేరి…పిజ్జా vs గోంగూర, మంగమ్మ గారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ఊరెళితే, సూపర్ మచ్చి, రాజు గారి కిడ్నాప్, నా పబ్‌ జీ వైఫ్, డేట్, లవ్ యు జిందగీ, గర్ల్‌ఫ్రెండ్, డబుల్ డేట్ .. ఇలా ఎన్నో ఆసక్తికరమైన షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ లో నటించాడు.

bigg boss telugu 7 amardeep chowdary background and profession

ఇక 2017న ఉయ్యాల జంపాల అనే సీరియల్ తో అమర బుల్లితెర పై అడుగుపెట్టాడు. ఆయుష్మాన్ భవ, కేరాఫ్ అనసూయ ,కృష్ణా అర్జున యుద్ధం ,శైలజా రెడ్డి అల్లుడు మొదలైన చిత్రాలలో అమర్‌దీప్ కనిపించాడు. ప్రస్తుతం అతను బాగా పాపులారిటీ తెచ్చుకున్న సీరియల్ జానకి కలగనలేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి ఇందులో అమర్‌దీప్ కి తల్లి క్యారెక్టర్ లో నటిస్తోంది.

బుల్లితెరపై మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ ప్రస్తుతం అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. మరొక సీరియల్ నటి..తేజస్విని గౌడ…ప్రేమలో పడ్డ అమర్‌దీప్ 2022 డిసెంబర్ లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ కొత్త పెళ్లి కొడుకు బిగ్ బాస్ లో ఎటువంటి పర్ఫామెన్స్ ఇస్తాడో చూడాలి అని సీరియల్ అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.

ALSO READ : జవాన్ ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?