జవాన్ ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

జవాన్ ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

Ads

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా జవాన్. ఈ సినిమాకి తమిళ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అట్లీకి ఇది మొదటి బాలీవుడ్ సినిమా. పేరుకి బాలీవుడ్ సినిమా అయినా కూడా సౌత్ కి సంబంధించిన ఎంతో మంది నటులు, టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేశారు.

Video Advertisement

నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. నటి దీపికా పదుకొనే కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది.

ట్రైలర్ చూసిన చాలా మంది చాలా సినిమాల షేడ్స్ ఇందులో కనిపిస్తున్నాయి అని అంటున్నారు. ఏదేమైనా టేకింగ్ బాగుంటే సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన పాటలు సినిమాపై ఆసక్తి ఇంకా పెంచాయి. వీళ్ళు మాత్రమే కాకుండా ప్రియమణి, యోగి బాబు ఇంకా ఎంతో మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా బృందం అంతా కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు.

ఇటీవల చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి షారుఖ్ ఖాన్ హాజరు అయ్యి సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలని చెప్పారు. అలాగే తను సౌత్ నటుల నుండి, సౌత్ టెక్నీషియన్స్ నుండి ఎంతో నేర్చుకున్నాను అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.

సాధారణంగా ఉమైర్ సంధు ఏదైనా ఒక సినిమాకి రివ్యూ ఇస్తే, కొన్ని సార్లు ఆయన చెప్పిందే జరిగినా కూడా కొన్ని సార్లు మాత్రం చెప్పిన రివ్యూకి పూర్తి వ్యతిరేకంగా సినిమాలు ఉంటాయి. ఇలా మాత్రమే కాకుండా కొన్ని సార్లు ఆయన చెప్పినట్టే సినిమాలు కూడా ఉంటాయి. అయితే ఈ సినిమాకి ఈ విధంగా రాశారు. “జవాన్ షారుఖ్ ఖాన్ టాలెంట్ కి జస్టిస్ చేసింది.”

jawan first review

“ఈ సినిమాతో ఆయనకి ఒక మంచి కథ, ఒక మంచి పాత్ర అలాగే చాలా ఎనర్జీతో కూడిన ఒక పర్ఫార్మెన్స్ దొరికింది అని చెప్పవచ్చు. షారుఖ్ ఖాన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇలాంటి ఫిజికల్ యాక్షన్ ఉన్న ఒక సవాళ్లతో కూడిన పాత్రను చాలా బాగా చేశారు అని” చెప్పారు. అలాగే ఈ సినిమాకి ఫోర్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. మరి ఈ రివ్యూలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.

ALSO READ : “జ్యోతిక” తో పాటు… “చంద్రముఖి” పాత్రలో నటించిన 9 హీరోయిన్స్..!


End of Article

You may also like