అఖిల్ అక్కినేని హీరోగా ఇటీవల విడుదల అయిన సినిమా ఏజెంట్. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్యలో ఈ సినిమా విడుదల అయ్యింది. కానీ ఆ అంచనాలని అందుకోలేకపోయింది. సినిమాలో ఏ ఒక్క అంశం కూడా ప్రేక్షకులకి నచ్చలేదు.

Video Advertisement

“ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఇలాంటి సినిమా ఇచ్చారు ఏంటి?” అంటూ చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుంది అని కొంత కాలం క్రితం ప్రకటించి మళ్లీ వాయిదా వేశారు. సోనీ లివ్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పటి వరకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు.

అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యే ముందు కొన్ని మార్పులు చేస్తున్నారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం అందులో కొన్ని సీన్స్ అలాగే ఎడిటింగ్. ఈ విషయంపై ఇప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నారు అని సమాచారం. సినిమాలో చాలా సీన్స్ అనవసరంగా ఉన్నాయి అన్నారు.

minus points in agent movie

దాంతో ఇప్పుడు సినిమా బృందం అంతా ఈ విషయంపై పని చేస్తున్నారు. సినిమాలో అవసరం లేని సీన్స్ అన్నీ కూడా తీసేసి, కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారు. థియేటర్లలో వచ్చిన స్పందనకి ఇప్పుడు సినిమా బృందం ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అందుకు కారణం థియేటర్లలో అంటే కేవలం ఆ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే చూస్తారు.

minus points in agent movie

అదే ఓటీటీలో రిలీజ్ అయితే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చూస్తారు. అందుకే ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని సినిమా విడుదల చేస్తున్నారు అని సమాచారం. ఈ సినిమా అసలు పాన్-ఇండియన్ రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల కేవలం తెలుగు, మలయాళంలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మరి ఇప్పుడు ఇన్ని మార్పులు చేసిన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఎలా స్పందిస్తారో అనేది తెలియాలి అంటే ఓటీటీలో సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.

ALSO READ : ఫ్లాప్ ల బాట పడుతున్న “టాలీవుడ్”.. ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకొచ్చింది.. కారణమేంటి..??