సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వస్తోంది అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ఇప్పటికే మొదలయ్యింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు గెటప్ కూడా ఇప్పటికే వైరల్ అయ్యింది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇది. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీగా అంచనాలు ఉన్నాయి.

mahesh babu-trivikram next movie story resembelms that salman movie..??

ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఇందులో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఈ సినిమా విషయంలో చాలా పెద్ద పెద్ద మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గత కొద్ది రోజుల నుండి చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో జరిగిన మార్పులు ఇవే అని ఒక వార్త అయితే ప్రచారం అవుతోంది. సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మార్చారు అని సమాచారం. ఆ మార్పులు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 సినిమా స్టోరీ ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఉండే ఒక ఎంటర్టైనర్ అని అన్నారు. అంటే ఫైటింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇదే మార్చినట్టు సమాచారం. అంటే సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతుంది. ఫైటింగ్స్ ఉంటాయిలే కానీ, మరి హెవీ ఫైటింగ్స్ అయితే ఉండవు. త్రివిక్రమ్ మార్క్ అయిన కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుంది.

#2 అలాగే ఫస్ట్ షెడ్యూల్ లో ఒక పవర్ ఫుల్ యాక్షన్ సీన్ చిత్రీకరించారు. ఇప్పుడు ఆ సీన్ సినిమాలో ఉండదు. సినిమాలో యాక్షన్ సీన్స్ తొలగించాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ సీన్ కూడా సినిమాలో ఉండే అవకాశం లేదు.

#3 ఈ సినిమా కోసం విలన్ పాత్ర పోషించడానికి ఒక పెద్ద స్టార్ నటుడు ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. అందుకోసం మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పాత్రలో నటిస్తారు అని అన్నారు. హీరోకి ధీటుగా ఉండే విలన్ పాత్ర ఉండాలి అంటే కచ్చితంగా మరొక స్టార్ నటుడు ఈ పాత్ర పోషిస్తే బాగుంటుంది అని అన్నారు. కానీ సినిమా స్టోరీ లైన్ మారింది కాబట్టి ఇప్పుడు విలన్ పాత్ర కోసం అంత పెద్ద యాక్టర్ ని కాకుండా వేరే నటుడిని పెడితే బాగుంటుంది అని సినిమా బృందం నిర్ణయించుకున్నారు. దాంతో ఇప్పుడు విలన్ పాత్ర కూడా మారే అవకాశం ఉంది.

this young heroine hiked remuneration for mahesh babu movie

#4 సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాగే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అనే వార్తలు వస్తున్నాయి. సెకండ్ హీరోయిన్ కోసం సినిమా బృందం చర్చల్లో ఉన్నారు. అలాగే ఒక సీనియర్ నటి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. ఆ నటి శోభన అనే వార్తలు కూడా వస్తున్నాయి.

మహేష్ ఫాన్స్ ని భయపెడుతున్న త్రివిక్రమ్ !

అందులోనూ ముఖ్యంగా సంగీత దర్శకత్వం వహించే తమన్ కూడా రీప్లేస్ అవుతారు అని అన్నారు. కానీ ఆ వార్త నిజం కాదు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ప్రారంభం అయ్యింది అని విడుదల చేసిన ఒక వీడియోకి తమన్ అందించిన సంగీతం చాలా పెద్ద హైలైట్ అయ్యింది. దాంతో సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తారు. ఏదేమైనా సరే వీళ్ళిద్దరి కాంబినేషన్ హిట్ అవ్వాలి అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ సినిమాకి ఈ మార్పులు చేయబోతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే అంత వరకు ఆగాల్సిందే.