Ads
యాభైకి పైగా సినిమాలు మరియు టెలివిజన్ షోలు చేసిన ఇందు ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కేరళలోని పాలక్కాడ్ చెందిన ఇందు ఆనంద్ పెరిగింది మాత్రం ముంబైలోనే. ఇండస్ట్రీలోకి ప్రవేశించాక ఇందిరగా ఉండే తన పేరును ఇందు ఆనంద్ గా మార్చుకున్నారు.
Video Advertisement
తెలుగులో చక్రవాకం, మొగలి రేకులు, కళ్యాణ వైభోగమే ఇందు ఆనంద్ కి మంచి గుర్తింపు తెచ్చాయి. సినిమాల్లో చేసింది కొన్ని పాత్రలే అయినా గుర్తుండిపోయే పాత్రలే ఎంచుకున్నారు ఇందు ఆనంద్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాలోనే కాకుండా ఇటీవల గమనం, బుడుగు వంటి చిత్రాల్లో కూడా నటించారు ఆమె.
ఓ ఇంటర్వ్యూలో తను మతాడుతూ.. ముందు నుంచి తాను సినిమాల్లోకి రావాలని అనుకోలేదని, తన హావభావాలు బాగుంటాయని చాలామంది చెబుతుంటారని ఆమె చెప్పుకొచ్చారు. ఇందు కేరళకు చెందినప్పటికీ చదివిందంతా నార్త్ లోనే ఢిల్లీ, లక్నో, ముంబైలో ఎక్కువగా ఉండడం వల్ల హిందీ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే కేరళలో ఉండడానికి తన తండ్రి ఎక్కువగా ఇష్టపడడం వల్ల సెలవుల్లో ఎక్కువగా పాలక్కాడ్ లోనే గడిపేవాళ్ళమని చెప్పారు ఇందు.
ఇక స్టార్ యాంకర్ సుమ కూడా మలయాళీ అందుప్పా ఆమె ఇందు గారికి బంధువు. ఇందు ఈ విషయం గురించి మాట్లాడుతూ సుమ వాళ్ళ అమ్మ నాకు అక్క అవుతారు. అమ్మ వైపు నుండి, నాన్న వైపు నుండి సుమ నాకు రిలేటివ్ అని చెప్పారు. సుమ వాళ్ళ అమ్మ, మా నాన్న వాళ్ళ సోదరుడి భార్య అంటే మా పిన్ని ఇద్దరూ సొంత అక్కా చెల్లెళ్లు. అలా సుమ మాకు బంధువవుతుంది అని తెలిపారు.
అయితే సుమ నేను చాలా తక్కువగా కలిసి మాట్లాడుకుంటాము. రాజీవ్ కనకాల చెల్లెలు చనిపోయినప్పుడు ఆమెతో కలిసి పని చేసిన అనుబంధం ఉంది అందుకే సుమకు ఫోన్ చేసి మాట్లాడానంతే. ఎప్పుడైనా కలిస్తే మాట్లాడటం తప్ప అదే పనిగా మాట్లాడటం ఉండదు అంటూ సుమతో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చారు ఇందు ఆనంద్.
End of Article