నిజాయితీ కి నిలువెత్తు రూపం ఈ ఆటో అన్న…ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

నిజాయితీ కి నిలువెత్తు రూపం ఈ ఆటో అన్న…ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

by Anudeep

Ads

ఈరోజుల్లో ఎక్కడ సందు దొరుకుతుందా ఎక్కువ డబ్బు గుంజేద్దాం అన్న బాపతు వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు. ఎలాంటి సిట్యుయేషన్ లో అయినా.. నిజాయితీని వదలని వారు మనకి అక్కడక్కడా తారస పడుతూనే ఉన్నారు. వీరిలో ఈ ఆటో అన్న కూడా ఒకరు. అతనెవరు..? ఈ స్టోరీ ఏంటో.. ఈ ఆర్టికల్ చదివితే తెలుస్తుంది.

Video Advertisement

auto feature

అది రద్దీ గా ఉండే చెన్నై సిటీ లో ఓ రోడ్. ఆటో నడుపుకునే డ్రైవర్ శరవణ కుమార్ కి ఓ కిరాయి దొరికింది. పాల్ అనే వ్యక్తి ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్ళడానికి శరవణ ఆటో ని కిరాయి మాట్లాడుకున్నారు. పాల్ కి అప్పటికే కొంచం ఎక్కువ లగేజ్ ఉంది. ఆటో ఎక్కినప్పటినుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. కంగారులో ఉన్నాడేమో ఆటో దిగే సమయం లో హడావిడి గా లగేజ్ తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ చాలా బాగ్ లు ఉండడం తో.. వాటిల్లోని ఓ చిన్న నల్లని బాగ్ ఆటోలోనే వెనకాలకు పడిపోయింది. పాల్ అది గమనించుకోకుండా ఆటో దిగి వెళ్ళిపోయాడు.

auto 1

చాలా సేపటి తరువాత డ్రైవర్ శరవణ కుమార్ ఆటో లో వెనకాల చిన్న బాగ్ ఉండడాన్ని గమనించాడు. అది తెరచి చూస్తే అందులో దాదాపు ఇరవై లక్షలు విలువ చేసే నగలు ఉన్నాయి. వీటిని తిరిగి ఇచ్చేయాలని అనుకున్నాడు. కానీ, ఎలా ఇవ్వాలి..? ఆ ఆటో లో ఎక్కిన అతని పేరు గాని ఊరు గాని తెలియవు. మరో వైపు, పాల్ కూడా బాగ్ మిస్ అవ్వడాన్ని గుర్తించాడు. ఆ ఆటో లోనే పడిపోయి ఉంటుందని గ్రహించాడు.

auto 2

కానీ, ఆ ఆటో అతని నెంబర్ కూడా తెలియదు. దీనితో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు.. ఆటో ను ట్రేస్ చేసి కనుక్కోవాల్సింది గా పోలీసులను కోరాడు. కానీ, అంత అవసరం లేకుండా.. శరవణ కుమార్ పోలీస్ స్టేషన్ లోనే వెళ్లి ఈ నగలను ఇచ్చేసాడు. అతని నిజాయితీకి పోలీసులు అభినందించకుండా ఉండలేకపోయారు. అతనికి ఒక బొకే ఇచ్చి గౌరవించారు.


End of Article

You may also like